Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవ్‌దత్ పట్నాయక్, శ్రీరామ్ శ్రీరంగం తో నూతన టైటిల్స్ ఆవిష్కరణ
ఢిల్లీ: అబ్యాసకులకు అబ్యాసం ద్వారా తమ పూర్తి సామర్థ్యం వెల్లడి చేయడంలో సహాయపడతామనే తమ నిబద్ధతకు అనుగుణంగా, ప్రపంచంలో సుప్రసిద్ధ అబ్యాస కంపెనీ పియర్సన్ నేడు తమ నూతన టైటిల్స్‌ను యుపీఎస్సీ టెస్ట్ ప్రిపరేషన్ కోసం అత్యున్నత నాణ్యత కలిగిన కంటెంట్‌ను కోరుకునే ఔత్సాహికుల కోసం విడుదల చేసింది. పియర్సన్ ఇండియా ఈ టైటిల్స్ ఆవిష్కరణ కోసం సుప్రసిద్ధ రచయితలు శ్రీ దేవ్‌దత్ పట్నాయక్ మరియు శ్రీ శ్రీరామ్ శ్రీరంగం, శ్రీ రోహిత్ డియో జా తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ పుస్తకాల శక్తివంతమైన సమ్మేళనపు అభ్యాస పరిష్కారాలను పుస్తక మరియు యాప్ రూపంలో విడుదల చేశారు. ఇవి యుపీఎస్సీ ఔత్సాహికులకు అన్ని కీలకమైన అంశాలనూ సమగ్రంగా అభ్యసించేందుకు తోడ్పడనున్నాయి.
దేవదత్ పట్నాయక్ రచించిన పుస్తకాన్ని‘ ఇండియన్ కల్చర్, ఆర్ట్ అండ్ హెరిటేజ్’ అనే శీర్షికన విడుదల చేశారు. సంస్కృతి, కళలు, వారసత్వం అనే కీలకాంశాలను ఏ విధంగా మిళితం చేశారన్నది ఇది చూపుతుంది. తొలి నాళ్ల నుంచి భారతీయ సమాజంలో ఈ అంశాలను ఏ విధంగా సృష్టించారు, నిర్మించారు మరియు పునరుత్థానం చేశారో వెల్లడించారు. ఇదే రీతిలో, ‘ఇండియన్ పాలిటీ’ శీర్షికన పుస్తకాన్ని శ్రీ రామ్ శ్రీరంగం మరియు రోహిత్ డియో జాలు రచించారు. దీనిలో భారత రాజ్యాంగం, దీని మూలాలు,సవరణలు, రాష్ట్ర విధానం యొక్క నిర్ధేశక సూత్రాలు, ప్రాధమిక హక్కులు, విధులు మరియు దానికి సంబంధించిన చట్టాలు, ఎలక్షన్ కమిషన్ మరియు షెడ్యూల్స్ వంటివి దీనిలో చర్చించారు.
రాజేష్ పంకజషాన్, డైరెక్టర్– ప్రొడక్ట్స్ అండ్ పోర్ట్‌ఫోలియో, పియర్సన్ ఇండియా మాట్లాడుతూ ‘‘దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఔత్సాహికులు ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతుంటారు. సీఎస్ఈ సమాచారం ప్రకారం దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు 2019లో సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం హాజరయ్యారు. దేశంలో ఎక్కువ మంది సిద్ధమవుతున్న పరీక్షలలో ఇది కూడా ఒకటి. అందువల్ల, విద్యార్థులకు అత్యున్నతనాణ్యత కలిగిన వనరులను, సాంకేతికతలను పరీక్షలలో హాజరయ్యేందుకు పొందాల్సి ఉంది. పియర్సన్ ఇండియా యొక్క కంటెంట్, సివిల్ సర్వీసెస్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయి కంటెంట్‌గా చిపరిచితం. ఇప్పుడు సమ్మిళిత రీతిలో బైట్ సైజ్డ్ అభ్యాస వనరులను సుప్రసిద్ధ రచయితలు దేవ్‌దత్ పట్నాయక్, శ్రీరామ్ శ్రీరంగం చేత ఆవిష్కరింపజేశాం. ఔత్సాహికులు వీటి ద్వారా తమ పరీక్ష సంసిద్ధత పరంగా ఏకీకృత పరిష్కారాలను పొందడంతో పాటుగా పరీక్షలలో విజయం సాధించేందుకు తగిన ప్రయోజనాలూ పొందగలరు’’అని అన్నారు.
భారతీయ మైథాలజిస్ట్, స్పీకర్, ఇలస్ట్రేటర్ దేవ్‌దత్ పట్నాయక్ మాట్లాడుతూ ‘‘ యుపీఎస్సీ పరీక్షకు సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్ అనేది అతి ముఖ్యమైన సబ్జెక్ట్‌గా నిలుస్తుంది. ప్రిలిమ్స్‌లో ఆబ్జెక్టివ్ ప్రశ్నావళిరూపంలో వీటిని ప్రయత్నించడంతో పాటుగా విద్యార్థులు ఈ ప్రపంచాన్ని, ఆర్ధిక వ్యవస్థ, రాజకీయాలు, నాగరికతను మరియు ఎన్నో అంశాలను కాలంతో పాటుగా ఏ విధంగా అర్థం చేసుకున్నారనేది కూడా తెలుస్తుంది. పియర్సన్ ఇండియాతో కలిసి ఆర్ట్ అండ్ కల్చర్‌పై ఈ నూతన పుస్తకాన్ని ఆవిష్కరించడం పట్ల నేను గర్వంగా ఉన్నాను. దీనిని అతి జాగ్రత్తగా తీర్చిదిద్దాము. నేపథ్యాలు, భౌగోళికం, చరిత్ర రూపాలుగా దీనిని విభజించడం వల్ల విద్యార్థులు ఈ సంస్కృతి వెనుక ఉన్న లాజిక్‌ను అర్ధం చేసుకోగలరు. చదువరులకు ఇది ఆహ్లాదకరమైన, వినోదాత్మక అంశంగా ఇది నిలుస్తుందని, పోటీపరీక్షలలో విజయం సాధించేందుకు విద్యార్థులకు తోడ్పడుతుందని,మన దేశపు భావి బ్యూరోక్రాట్లను తీర్చిదిద్దడంలో ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
శ్రీరామ్ శ్రీరంగం, ఫౌండర్ అండ్ ప్రొప్రైయిటర్, శ్రీరామ్స్ ఐఏఎస్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుత సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలను అతలాకుతలం చేయడంతో పాటుగా పునరుద్ధరణ, పునః సృష్టి మరియు అభివృద్ధి పరంగా అవకాశాలనూ తెరిచింది. ప్రభుత్వాలు తమ విధానాలను పునరాలోచించాల్సిన ఆవశ్యకతను ఇది కల్పించడంతో పాటుగా మహమ్మారి వల్ల తలెత్తిన సమస్యల నుంచి బయటపడేందుకు పలు వ్యూహాలనూ అమలు చేయాల్సిన ఆవశ్యకతనూ కల్పించింది. అదే సమయంలో వృద్ధి పరంగా వేగమూ కొనసాగించేలా చర్యలు తీసుకోవడమూ చేయాల్సి వచ్చింది. అందువల్ల, యుపీఎస్సీ ఔత్సాహికులు ఈ అవరోధాలు, చర్యలను గురించిన సవివరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే భవిష్యత్‌లో మన సమాజాన్ని ఏ విధంగా ఇవి తీర్చిదిద్దుతాయనేది కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. పియర్సన్తో కలిసి ‘ఇండియన్ పాలిటీ’ పేరిట విడుదల చేసిన ఈ పుస్తకం, ఔత్సాహిక అభ్యర్థులు పలు అతి ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవడంలో తోడ్పడటంతో పాటుగా భారతీయ రాజకీయం అర్థం చేసుకోవడంలోనూ సహాయపడుతుంది. అదే సమయంలో యుపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయుక్తమైన వనరుగానూ తోడ్పడుతుంది’’ అని అన్నారు.
నూతన మహోన్నత టైటిల్స్‌తో పాటుగా పియర్సన్ ఇండియా ఇప్పుడు ఓ యాప్ (ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్) రూపంలో అందిస్తుంది. ఇది సమ్మిళిత అభ్యాస అనుభవాలను అందించడంతో పాటుగా అభ్యాస కంటెంట్‌ను సృజనాత్మక బైట్ సైజ్ ఫార్మాట్లో అందిస్తుంది. ఇది ఔత్సాహికులకు ప్రతి రోజూ లభ్యమవుతుంది. పియర్సన్ ఇండియా ఇప్పుడు సుప్రసిద్ధ కంటెంట్ క్రియేటర్లతో ఈ యాప్ కోసం భాగస్వామ్యం చేసుకుంది మరియు వనరులను ఔత్సాహికులకు ఉచితంగా అందిస్తుంది.