Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- Zoom యాప్స్ పర్యావరణ వ్యవస్థలో ఆవిష్కరణను ప్రేరేపించడానికి కొత్త వెంచర్ ఫండ్
న్యూఢిల్లీ: Zoom వీడియో కమ్యూనికేషన్స్, ఇంక్. ఈ రోజు (NASDAQ:ZM) Zoom యాప్స్ ఫండ్ ను ప్రకటించింది, జూమ్ యొక్క జూమ్ యాప్స్, ఇంటిగ్రేషన్లు, డెవలపర్ ప్లాట్ఫాం మరియు హార్డ్వేర్ యొక్క పర్యావరణ వ్యవస్థ వృద్ధిని ప్రేరేపించడానికి సృష్టించబడిన కొత్త 0 మిలియన్ వెంచర్ ఫండ్.Zoom కస్టమర్లు ఎలా కలుసుకుంటారు, ఎలా సంభాషించుకుంటారు మరియు సహకరించుకుంటారు అనేదానికి ప్రధానమైన పరిష్కారాలను రూపొందించడానికి పోర్ట్ఫోలియో కంపెనీలు 250,000 మరియు 2.5 మిలియన్ల మధ్య ప్రారంభ పెట్టుబడులను అందుకుంటాయి.Zoomtopia 2020 లో ప్రకటించిన, Zoom యాప్స్, ఉత్పాదకత మరియు ఆకర్షణీయమైన అనుభవాలను నేరుగా Zoom ప్లాట్ఫామ్లోకి తీసుకువచ్చే ప్రముఖ యాప్స్.
డజన్ల కొద్దీ Zoom యాప్స్ ప్రస్తుతం అభివృద్ధి చేయబడుతున్నాయి మరియు ఇవి వీడియో కమ్యూనికేషన్ల భవిష్యత్తును నిర్మించడంలో ముఖ్యమైన భాగం.Zoom యాప్స్ ఫండ్ మా వినియోగదారులకు విలువైన మరియు ఆకర్షణీయమైన అనుభవాలను అందించే ఆచరణీయ ఉత్పత్తులు కలిగిన మరియు ప్రారంభంలో మార్కెట్ పరమైన ఆమోదం ఉన్న డెవలపర్ భాగస్వాములకు పెట్టుబడి పెడుతుంది.
“నేను దాదాపు పదేళ్ల క్రితం 2011 లో, Zoom ను స్థాపించాను.ప్రారంభ పెట్టుబడిదారుల మద్దతు లేకుండా, జూమ్ ఈరోజు ఉన్న స్థితిలో ఉండేది కాదు” అని Zoom CEO మరియు వ్యవస్థాపకులు ఎరిక్ ఎస్. యువాన్ అన్నారు.“గత సంవత్సర కాలంలో నేను నేర్చుకున్నది ఏమిటంటే, మనం సమావేశాలు ఉత్పాదకంగా మరియు సరదాగా ఉండేలా చూడాలి.Zoom యాప్స్ ఫండ్ మా కస్టమర్లు సంతోషంగా కలవడానికి మరియు మరింత సజావుగా సహకారం అందించుకోవడానికి సహాయపడుతుందని, మరియు అదే సమయంలో మా వేదిక అభివృద్ధి చెందుతున్న కొద్దీ వ్యవస్థాపకులు కొత్త వ్యాపారాలను నిర్మించడంలో సహాయపడుతుందని నా ఆశ.” Zoom యాప్స్ ఫండ్ గురించి మరింత తెలుసుకోవడానికి zoom.com/fund ని సందర్శించండి.