Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెజాన్ పే వెల్లడి
హైదరాబాద్ : దేశంలో 50 లక్షల చిన్న, మధ్యస్థ వ్యాపారుల డిజిటల్ లావాదేవీలకు సాధికరతను కల్పిస్తున్నామని అమెజాన్ పే తెలిపింది. హైదరాబాద్లో సుమారు 3 లక్షల మంది వ్యాపారులు తమ క్యూఆర్ కోడ్ వేదికను ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. అమెజాన్ సంభవ్లో 'ఇన్నోవేటింగ్ ఫర్ ఏ బెటర్ ఇండియా' సమావేశంలో అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రస్సెల్ గ్రాండినెట్టి మాట్లాడుతూ దేశంలో 25 లక్షల పైగా కిరాణా స్టోర్స్, రిటైల్ అవుట్లెట్లలో తమ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. మరో 10 లక్షల మంది రెస్టారెంట్లు, 5 లక్షలకు పైగా సేలూన్స్లకు చేరువ కాగా.. మిగితా ఆరోగ్యం, వైద్య సంరక్షణ, టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్లంబర్స్ మరెన్నో రకాల వత్తుల వారు తమ యాప్ను ర0రరఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.