Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్‌కు 244 పాయింట్ల నష్టం
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లలో మంగళవారం కూడా అమ్మకాల వెల్లువ కొనసాగింది. పలు రాష్ట్రాల్లో స్థానిక లాక్డౌన్ ఆంక్షలు పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు మరింత నష్టపోయాయి. సెన్సెక్స్ ఉదయం లాభాల్లోనే ప్రారంభమైనప్పటికీ.. ఓ దశలో ఐటి, విత్త రంగాల్లో ఒత్తిడి నెలకొనడంతో1000 పాయింట్ల మేర కోల్పోయింది. తుదకు 244 పాయింట్లు లేదా 0.5 శాతం నష్టంతో 47,706కు పడిపోయింది. నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయి 14,296 వద్ద ముగిసింది. అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సిఎల్ టెక్, హెచ్‌డిఎఫ్‌సి, టెక్ మహీంద్రా, హెచ్‌యుఎల్, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సూచీలు అధికంగా 5 శాతం వరకు నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. బిఎస్ఇలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం విలువ కోల్పోయాయి. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థపై నీలినీడలు కమ్ముకోవడంతో మదుపర్లు మార్కెట్లపై విశ్వాసాన్ని కోల్పోతున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఎలాంటి సానుకూల సంకేతాలు కానరాకపోవడంతో స్టాక్ మార్కెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.