Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో మంగళవారం భారత మార్కెట్లోకి నూతన పల్సర్ ఎన్ఎస్ 125ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద దీని ధరను రూ. 93,690గా నిర్ణ యించింది. ఇది పల్సర్ ఎన్ఎస్ శ్రేణి మోటర్ సైకిల్స్‌కు నూతన జోడింపు అని ఆ కంపెనీ తెలిపింది. యువ ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకొని పల్సర్ ఎన్ఎస్ 125ను తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఇది శక్తివంతమైన 12 పిఎస్ శక్తిని అందిస్తుందని వెల్లడించింది. ఇది ప్రవేశ దశ బైక్ విభాగంలో తమ బ్రాండ్ స్థానాన్ని బలోపేతం చేయనుందని బజాజ్ ఆటో మోటార్ సైకిల్స్ ప్రెసిడెంట్ సారంగ్ కనాడి పేర్కొన్నారు.