Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శామ్ సంగ్, భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఈ రోజు, మొబైల్ ఉపకరణాల కోసం కొత్త పిక్-అప్ మరియు డ్రాప్ సేవను ఒకదానిని ప్రారంభించి తన కాంటాక్ట్‌లెస్ సర్వీస్ ఆఫరింగ్‌లను దేశంలో విస్తరింపజేసింది. శామ్సంగ్ సర్వీస్ సెంటర్లను సందర్శిస్తున్న వినియోగదారులు కూడా, బాగుచేసిన తర్వాత తమ మొబైల్ ఉపకరణాలను తమ ఇంటి వద్దకు తెప్పించుకునేందుకు డ్రాప్ ఓన్లీ సర్వీస్ కోసం ఆప్ట్ చేసుకోవచ్చు. దీనితో, శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ మరియు ట్యాబ్లెట్ల వినియోగదారులు, తమ ఇంటి నుండి అడుగు బయట పెట్టకుండా, సురక్షితంగానూ మరియు సౌకర్యవంతంగా తమ ఉపకరణాలను సర్వీస్ చేయించుకునే అవకాశం కలుగుతుంది.
మొబైల్ ఉపకరణాల కోసం పిక్అప్ మరియు డ్రాప్ సర్వీసును 46 నగరాలలో ప్రారంభించటమైనది – ఢిల్లీ, గురుగ్రామ్, ముంబయ్, కోల్‌కతా, చెన్నై, పూణె, బెంగుళూరు, అహ్మదాబాద్ ఘాజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా, చండీగఢ్, లూధియానా, జలంధర్, జైపూర్, ఉదయపూర్, జోధ్‌పూర్, ఆగ్రా, లక్నో, వారాణసి, డెహ్రాడూన్, గువాహటి, భుబనేశ్వర్, పట్నా, దుర్గాపూర్, రాంచి, థానే, ఔరంగాబాద్, కోల్హాపుర్, నాగ్‌పూర్, సూరత్, వడోదరా, భోపాల్, ఇందోర్, రాయ్‌పూర్, రాజ్‌కోట్, జబల్పూర్, కోయంబత్తూర్, మదురై, కొచ్చి, కాలికట్, తిరుపతి, హుబ్లీ, హైదరాబాద్, విజయవాడ, మరియు విశాఖపట్నంలలో, నాన్-కంటెయిన్మెంట్ జోన్ల కోసం, మునిసిపల్ పరిమితుల్లో ఉన్న ప్రాంతాల్లో, కర్ఫ్యూ నియమనిబంధనలను అనుసరించి ప్రారంభించటమైనది. తమ గెలాక్సీ ఎ, గెలాక్సీ ఎమ్, గెలాక్సీ ఎస్, గెలాక్సీ ఎఫ్, గెలాక్సీ నోట్ మరియు గెలాక్సీ ఫోల్డ్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు, ఇంకా ట్యాబ్లెట్ల సర్వీస్ కోసం కస్టమర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. వినియోగదరాలు ఇళ్ళ నుండి ఉపకరణాల పిక్-అప్ మరియు డ్రాప్ పనిలో నిమగ్నమై ఉండే సిబ్బంది రక్షణసంబంధ నిర్వహణ నియమాలను పాటిస్తారు.
మొబైల్ ఉపకరణ బాగుచేతల కోసం ఈ పిక్-అప్ మరియు డ్రాప్ సేవను ఐఎన్ఆర్ 199లకు మరియు డ్రాప్ ఓన్లీ సర్వీసును ఐఎన్ఆర్ 99లకు పొందవచ్చు. పలు డిజిటల్ చెల్లింపు ఆప్షన్ల ద్వారా సర్వీసు కోసం వినియోగదారులు చెల్లింపు జరపవచ్చు. “శామ్సంగ్లో, వినియోగదారుల శ్రేయస్సే అన్నింటి కన్నా ప్రధానమైన అంశం. వారికి, వారి కుటుంబాలకు సౌకర్యాన్ని కల్పించటానికి కావలసిన అన్న చర్యలను తీసుకునేందుకు మేము నిబద్ధులమై ఉన్నాము. ఈ కొత్త పిక్-అప్ మరియు డ్రాప్ మరియు డ్రాప్ ఓన్లీ సర్వీస్ తో వినియోగదారులు తమ మొబైల్ ఉపకరణాలను, ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంటి నుండి కాలు బయట పెట్టకుండానే, సర్వీస్ చేయించుకోగలుగుతారు. మా విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్ మరియు పలు కాంటాక్ట్‌లెస్ సర్వీస్ ఆప్షన్లు, మరింత గొప్ప సౌకర్యాన్ని కల్పించే సమయంలో మా వినియోగదారుల కనెక్ట్‌ను మరింత పటిష్టం చేసుకునేందుకు ఉపకరించగలుగుతాయని మేము విశ్వసిస్తున్నాము. వినియోగదారులు, ఇంటి వద్ద ఉంటూ, సురక్షితంగా ఉంటూ, ఈ పిక్-అప్ మరియు డ్రాప్ సర్వీసును ఉపయోగించుకుంటారని మేము ఆశిస్తున్నాము.”అని సునీల్ కటిన్హా, వైస్ ప్రెసిడెంట్, కస్టమర్ సర్వీస్, శామ్సంగ్ ఇండియా, అన్నారు.
శామ్సంగ్ తన వినియోగదారులకు, ఇంటి నుండి అడుగు బయట పెట్టకుండానే, తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు, పలు కాంటాక్ట్‌లెస్ సర్వీస్ ఆప్షన్లను ఆఫర్ చేస్తోంది. వాట్సాప్, రిమోట్ సపోర్ట్, లైప్ చాట్, కాల్ సెంటర్ ద్వారా సాంకేతిక సహకారం లేదా యాక్సెస్ డూ-ఇట్-యువర్సెల్ఫ్ వీడియోలను శామ్సంగ్ వెబ్సైట్ మరియు యూడ్యూబ్ పై వినియోగదారులు ఎంచుకోవచ్చు.
కాంటాక్ట్‌లెస్ సర్వీస్ ఆఫరింగ్‌లు
· వాట్సాప్ సపోర్ట్ –శామ్సంగ్ వారి వాట్సాప్ సపోర్ట్ నెంబర్ 1800-5-SAMSUNG (1800-5-7267864)కు కేవలం సందేశాన్ని పంపించి సర్వీస్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. వాట్సాప్ పై వారు సాంకేతిక సహకరాన్ని కోరవచ్చు, సర్వీస్ సెంటర్ల నెలవులను గురించి సమాచారాన్ని పొందవచ్చు, రిపెయిర్ యొక్క వర్తమాన పరిస్థితి, కొత్త ఆఫర్లు తెలుసుకోవచ్చు, మరియు తాము అప్పుడే కొనుగోలు చేసిన శామ్సంగ్ ఉత్పత్తుల డెమో మరియు ఇన్స్టలేషన్ కోసం అభ్యర్ధించవచ్చు. ఈ సేవ 24x7అందుబాటులో ఉంటుంది.
· రిమోట్ సపోర్ట్ –శామ్సంగ్ కాల్ సెంటర్ ఏజెంట్లు ఒక వినియోగదారుని గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్ టివి పై సుదూరంగా ఉండి, ఇంటర్నెట్ ద్వారా పని చేసి, ఆన్లైన్లోనే సమస్యను గుర్తించి, తక్షణ పరిష్కారాన్ని అందిచగలుగుతారు.
· లైవ్ చాట్ –వెబ్సైట్ www.samsung.com/in/support పై వినియోగదారులు శామ్సంగ్ను తక్షణం చేరుకోగలుగుతారు. ఈ వెబ్సైట్ పై, శిక్షణ పొందిన ఏజెంట్లు మరియు కృత్రిమ మేథస్సు (ఎఐ) ఆధారిత చాట్ బాట్, ఏ సందేహాలకైన 24x7, సరియైన సమాచారాన్ని తక్షణమే, ఎటువంటి ఎదురుచూపులు లేకుండానే అందిస్తాయి.
· కాల్ సెంటర్ ద్వారా సాంకేతిక సహకారం –నిపుణులైన కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లు ఫోన్ కాల్ పై సాంకేతిక సహకారాన్ని అందిస్తారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు తమకు లభిస్తున్న సాంకేతిక సలహాలను వినియోగదారులు అనుసరిస్తారు.
· శామ్సంగ్ వెబ్సైట్ మరియు యూట్యూబ్ పై వీడియో టిప్స్ –శామ్సంగ్ వెబ్సైట్ పైన మరియు యూ ట్యూబ్ పైన, సాధారణ సమస్యల కోసం పరిష్కారలను అందించే డూ-ఇట్-యువర్సెల్ఫ్ వీడియోల ద్వారా వినియోగదారులు, ఉపయోగకరమైన ఉత్పత్తి సంరక్షణ చిట్కాలను కనుగొనగలుగుతారు.
· శామ్సంగ్ మెంబర్స్ యాప్ - ‘శామ్సంగ్ మెంబర్స్’లో పది మిలియన్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. ఇందులో వినియోగదారులకు లైవ్ చాట్ ఆప్షన్ లభిస్తుంది, సర్వీస్ అభ్యర్ధనలను చేయగలుగుతారు, రిపెయిర్ పురోగతిని తెలుసుకోగలుగుతారు, రిమోట్ సపోర్ట్ మరియు ఫోన్ డయాగ్నోస్టిక్స్‌ను పొందగలుగుతారు. ఇతర శామ్సంగ్ అభిమానులతో వినియోగదారులు, కమ్యూనిటీ విభాగంలో కూడా సంభాషించి, స్వయంగా సహకరించుకోగలుగుతారు మరియు ఉత్పత్తి ఫీచర్లను అర్ధం చేసుకోగలుగుతారు.
శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కం. లిమిటెడ్‌ను గురించి
శామ్సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్వర్క్ సిస్టమ్‌లు మరియు మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ మరియు ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్సంగ్ ఇండియా న్యూస్రూమ్ను http://news.samsung.com/inవద్ద సందర్శించండి. హిందీ కొరకు, శామ్సంగ్ న్యూస్‌రూమ్ భారత్‌ను https://news.samsung.com/bharat వద్ద సందర్శించండి. @SamsungNewsIN వద్ద మీరు మమ్ములను ట్విట్టర్ పై అనుసరించవచ్చు.