Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నేచర్ జర్నల్ కమ్యూనికేషన్స్ బయాలజీలో ఏప్రిల్ 12,2021వ తేదీన ప్రచురితమైన ఓ అధ్యయనంలో మెడ్ జినోమ్, ఇండియా/యుఎస్ఏ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం పరిశోధకులు మరియు సై జెనోమ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎస్‌జీఆర్‌ఎఫ్), ఇండియా పరిశోధకులు ఏసీఈ2లో జన్యు వైవిధ్యతను విశ్లేషించారు. ఏసీఈ 2 అనేది కోవిడ్–19 కు కారణమైన సార్స్–కోవ్–2 వైరస్ స్వీకర్త. దాదాపు 3 లక్షలమంది వ్యక్తులను పరిశీలించిన తరువాత , కీలకమైన మ్యూటెంట్లను గుర్తించడంతో పాటుగా కోవిడ్–19 వైరస్ బారిన పడేందుకు మరింత అనుమానాస్పద వ్యక్తులను అంచనా వేశారు. వైరస్ నుంచి రక్షణ కల్పించగల ఏసీఈ2 వేరియంట్లును సైతం వారు నివేదించారు. ఏస్ 2 – సార్స్ –కోవ్–2 ఇంటరాక్షన్ ప్రచురిత నిర్మాణాత్మక నమూనాలను వినియోగించుకుని రచయితలు గతంలో వేరియంట్ల ప్రభావం అంచనా వేశారు మరియు ఇప్పుడువెట్ల్యాబ్ ప్రయోగాలు ఈ అంచనాలను నిజం చేశాయి.
రచయితలు, రసాయన చర్య రీత్యా మరల కలిపిన డీఎన్ఏ మరియు ప్రొటీన్ ఎక్స్ప్రెషన్ సాంకేతికతలను వినియోగించుకుని, పలు మానవ ఏస్ 2 వేరియంట్లను ఉత్పత్తి చేశారు మరియు వైరల్ స్పైక్ (ఎస్ ) ప్రొటీన్‌ను సైతం ఉత్పత్తి చేసి వాటిని బయో కెమికల్ ఎస్సేల ద్వారా పరీక్షించారు. ఈ అధ్యయనాలలో వెల్లడి అయిన దాని ప్రకారం ఏస్ 2 వేరియంట్లు ఎస్ ప్రొటీన్ కోసం అనుబంధాన్ని సైతం మారుస్తున్నాయని జీవరసాయన పరీక్షల ద్వారా వెల్లడించారు. తమ అంచనాలకు అనుగుణంగా, మరో అడుగు ముందుకేస్తూ, రీకాంబినెంట్ ఏస్2 , ఎస్ ప్రొటీన్ పట్ల పెరిగిన అనుబంధంతో కణజాలానికి వైరస్ సోకకుండా నిరోధించిందని వారు చూపించారు. ‘‘మా అధ్యయనాలు అతి కీలకమైనవి. దీనిద్వారా ఎవరు మరింతగా ఈ వైరస్ బారిన పడేందుకు అవకాశం ఉందో ఊహించవచ్చు. అలాగే ఈ సమాచారం వినియోగించుకుని ఈ వైరస్‌ను ప్రభావంతంగా ట్రాప్ చేసే ఔషదాలనూ తయారుచేయవచ్చు. సొల్యూల్ రీకాంబినెంట్ ఏస్ 2, సహజసిద్ధమైన వేరియంట్లను ముందుకు తీసుకువెళ్తుంది. ఇది వైరస్ సర్ఫేస్ ఎస్ ప్రొటీన్ మరింత జిగురుగా ఉండేందుకు తోడ్పడటంతో పాటుగా అద్భుతమైన డెకాయ్ ట్రాప్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇది రోగులకు ఇన్ఫెక్టింగ్ అయినప్పుడు వైరస్‌ను అడ్డుకుంటుంది’’ అని డాక్టర్ శేఖర్ శేషగిరి, అధ్యక్షులు, ఎస్‌జీఆర్‌ఎఫ్, ఇండియా మరియు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన రచయిత అన్నారు.
సార్స్ కోవ్ 2 కారణంగా అంతర్జాతీయంగా దాదాపు 138 మిలియన్ల మంది ప్రభావితమయ్యారు. దాదాపు 2.97 మిలియన్లమంది మరణించారు. ఈ వ్యాధి లక్షణాలలో జ్వరం,చలి, దగ్గు, డయేరియా, న్యుమోనియా ఉంటాయి. కొంతమంది ఈ వ్యాధి బారిన పడినప్పటికీ లక్షణాలు లేకుండా ఉంటుంటే, 10%మంది ఆస్పత్రులలో చేరాల్సి వస్తుంది మరియు 1–5% కేసులు మృత్యువుకు చేరువవుతున్నాయి. ఇతరులతో పోల్చినప్పుడు కొంతమంది ఎందుకు ఎక్కువగా ప్రభావితమవుతున్నారో తెలుసుకోవడమనేది ప్రమాదం బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలు గల వ్యక్తులను రక్షించడంలో తోడ్పడుతుంది. అంతేకాదు, ఈ వ్యాధిని నిర్వహించడంలో మరియు వైరస్‌తో పోరాడటంలో ప్రభావవంతమైన ఔషదాలను అభివృద్ధి చేయడంలోనూ తోడ్పడుతుంది.
‘‘అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వైరస్ అంటే అర్ధం మనం మరింత ఆప్రమప్తంగా ఉండటంతో పాటుగా వేగవంతమైన పరీక్షలు, నివారణ, కోవిడ్–19 చికిత్స కోసం మరింత సృజనాత్మక వ్యూహాలను అభివృద్ధి చేయాల్సి ఉంది మరియు భవిష్యత్ మహమ్మారుల కోసం కూడా ముందుగా సిద్ధం కావాల్సి ఉంది. పలు మ్యూటెంట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం రూపొందించేందుకు సుస్థిర ప్రయత్నాలు చేయడంతో పాటుగా ఈ ప్రాణాంతిక మహమ్మారికి చికిత్స చేయడానికి లక్ష్యిత చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడంలోనూ సహాయపడతాయి. పలు ఫార్మా భాగస్వాములతో మేము చర్చలను జరుపుతుండటంతో పాటుగా వారి డ్రగ్ డెవలప్మెంట్ వర్క్‌ను మా జెనోమిక్స్ మార్గదర్శక అధ్యయనంలో తెలుసుకున్న అంశాల ఆధారంగా మరింత వేగవంతం చేయనున్నాం’’ అని శ్రీ శామ్ సంతోష్, సీఈవో, మెడ్ జెనోమ్ అన్నారు.