Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యాంకర్ ఇన్నోవేషన్స్ ప్రీమియం ఆడియో బ్రాండ్, సౌండ్‌కోర్ నేడు తమ తరువాత తరపు టీడబ్ల్యుఎస్ను తమ ప్రాచుర్యం పొందిన లిబర్టీ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ శ్రేణి, లిబర్టీ ఎయిర్2 ప్రోలో విడుదలచేసింది. దీనిలో అత్యాధునిక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్సీ), పారదర్శకత, ప్యూర్ నోట్ డ్రైవర్ టెక్నాలజీ ఉంటాయి. వీటి ధర 9999రూపాయలు. 18 నెలల వారెంటీతో ఇవి వస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌పై లభ్యమవుతున్న ఈ ఉత్పత్తి త్వరలోనే భారతదేశ వ్యాప్తంగా అగ్రశ్రేణి వాణిజ్య స్టోర్లలో కూడా లభ్యం కానుంది.
ఈ ఆవిష్కరణ సందర్భంగా శ్రీ గోపాల్ జయరాజ్– కంట్రీహెడ్, యాంకర్ ఇన్నోవేషన్ మాట్లాడుతూ ‘‘దాదాపుగా భారతీయుడు ప్రతి వారం 19.1 గంటలు సంగీతాన్ని వింటూ గడిపేస్తున్నాడు. దాదాపు 90% మందికి పైగా తమ చేతి ఉపకరణాల ద్వారానే ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకుని సౌండ్‌కోర్ ఇంజినీర్లు లిబర్టీ ఎయిర్2 ప్రోతో వచ్చారు. ఇవి చెవులకు సౌకర్యంగా ఉంటాయి. భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్‌ఫోన్స్ లిబర్టీ ఎయిర్ 2 ప్రో. ఇది ప్రతి ఒక్కరికీ సంగీతాస్వాదనను వృద్ధి చేస్తుంది’’అని అన్నారు. లిబర్టీ ఎయిర్ 2 ప్రో కు యాంకర్స్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ మద్దతునందిస్తుంది. ఇయర్‌బడ్స్ 10 నిమిషాల చార్జింగ్‌తో రెండు గంటల ప్లే టైమ్ లభిస్తుంది. లిబర్టీ ఎయిర్ 2 ప్రో నాలుగు రంగులు – ఓనిక్స్ బ్లాక్, టైటానియం వైట్, సఫైర్ బ్లూ, క్రిస్టల్ పింక్–లో లభిస్తుంది.