Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రెండో దశ తీవ్రం కావడంతో పరిశ్రమలు మళ్లీ మూతపడుతున్నాయి. దేశం లోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ భారత్లోని తన అన్ని ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఏప్రిల్ 22 నుంచి నుంచి మే ఒకటి వరకు ప్రతీ యూనిట్లోనూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. యూనిట్ల నిలిపివేత సమయంలో మెయింటెనెన్స్ పనులు పూర్తి చేసుకుంటామని వెల్లడించింది. ఇప్పటికే తమ అన్ని కార్పొరేట్ ఆఫీసులను మూసివేసినట్లు వెల్లడించింది.