Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగుళూరు: అత్యంత చారిత్రాత్మకమైన, గణనీయమైన పన్ను సంస్కరణల్లో ఒకటిగా కొనియాడబడే సరుకులు, సేవల పన్ను జీఎస్టీ, జూలై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది. దేశం కోసం ఒక సింగిల్ అప్రత్యక్ష పన్నుగా రూపొందించబడిన జీఎస్టీ, పలు డొమెస్టిక్ అప్రత్యక్ష పన్నులైన వ్యాట్(VAT), ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ పన్ను వంటి వాటి స్థానంలో అమల్లోకి వచ్చి – ఒక దేశం, ఒక పన్ను - అనే పన్ను విప్లవానన్ని తీసుకువచ్చింది.
2017లో అమలు చేయబడిన నాటి నుండి జీఎస్టీ పలు సవరణలను చవిచూసింది. నేటికి కూడా జిఎస్టి అనుపాలనను జరిపేందుకు వ్యాపారసంస్థలు చాలా కష్టపడవలసి వస్తోంది. అయితే, జిఎస్టి ఫైల్ చేసే ప్రక్రియను సరళీకరించేందుకు, ఎంఎస్ఎంఇల అనుపాలనాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం గణనీయమైన చర్యలను తీసుకుంటోంది. దీనిని సరళీకరించి, డిజిటల్ ఇండియా స్ఫూర్తిని అనుగుణంగా ఉంచాలన్నదే దీని వెనుక ఉద్దేశ్యం.
జీఎస్టీ పరిధిలో రిజిస్టర్ అయిన అందరు పన్ను చెల్లింపుదారులు, నియమనిబంధనలను పాటించవలసి ఉంటుంది. వ్యాపారసంస్థలు జిఎస్టి నిబంధనలను ఏ మేరకు పాటిస్తున్నాయో పర్యవేక్షించేందుకు భారతప్రభుత్వం, జిఎస్టి పోర్టల్ పై రిజిస్టర్ అయిన వ్యక్తి యొక్క ప్రొఫైల్‌ను ప్రవేశపెట్టి, నిరంతరం ఆ ప్రొఫైల్‌ను అప్డేట్ చేస్తోంది. దీనిని PAN లేదా GSTIN లతో తనిఖీ చేయవచ్చు. ఇవ్వబడిన కొన్ని కీలకమైన వివరాలు – రిజిస్ట్రేషన్ యొక్క స్థితి, రిటర్న్ దాఖలు అనుపాలన.
ఇన్వాయిస్లు సజావుగా జారీ చేయబడ్డాయని, జిఎస్టి రిటర్న్‌లో వరుసక్రమంలో అప్లోడ్ చేయబడి, కొనుగోలుదారు క్రెడిట్లను ఉపయోగించుకోవటానికి మరియు ప్రభుత్వం సరియైన పన్నులను పొందేందుకు అనువుగా ఉండేట్లుగా విక్రేత జాగ్రత్త వహించాలి. పన్ను క్రెడిట్ నష్టం ఏమీ లేకుండా ఉండునట్లు ఇన్వాయిస్లు సరైన క్రమంలో ఉండేలా ఒక కొనుగోలుదారు జాగ్రత్త వహించాలి.
ఇన్-వర్డ, ఔట్వర్డ్ సరుకు రవాణాల కోసం, నెలవారి రిటర్న్ కోసం వేరు వేరు ఫారాలతో జీఎస్టి ప్రారంభమయ్యింది. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు, రెండు సింగిల్ రిటర్న్‌లను నెలవారి పద్ధతిలో సమర్పిస్తూండాల్సి ఉంది. ఎంఎస్ఎంఇల కోసం అనుపాలనను సరళతరం మరింత సరళం చేసేందుకు, జిఎస్టి సమితి కొత్త రిటర్న్ ఫైలింగ్ వ్యవస్థ అమలును ఆమోదించింది. దీని వలన జనవరి 1, 2021 నుండి, రూ. 5 కోట్ల వరకు వార్షిక సమగ్ర టర్నోవర్ కలిగిన జిఎస్టి పన్ను చెల్లింపుదారులు, గతంలో 12 పత్రాలను నింపవలసి ఉండగా, ఇప్పుడు నాలుగు జిఎస్టిఆర్ 3బి పత్రాలను నింపవలసి ఉంటుంది.
ఎప్పటికప్పుడు మార్పులను సంతరించుకుంటూ ఆవిర్భవించే తత్వం కారణంగా, ఈ కొత్త చట్టం గురించి, ఆ వ్యవస్థను గురించి పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించటం ఒక సవాలు. జిఎస్టి అనుపాలనకు సంబంధించి గమనించదగిన కొన్ని అంశాల్లో, ఇన్వాయిస్లను అప్పటికప్పుడు అప్లోడ్ చేయటం (భారతదేశవ్యాప్తంగా రూ. 50 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన పన్ను చెల్లింపుదారులకు వర్తించే ఇ-ఇన్వాయిసింగ్), మరియు ఇన్పుట్ పన్ను క్రెడిట్ (ఐటిసి)ని క్లెయిమ్ చేసుకునేందుకు చర్యలు. ఇందులో ఇబ్బందిని కలిగిన విషయం ఏమిటంటే, చిన్న వ్యాపార సంస్థలు ఈ కార్యకలాపాల కోసం సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది లేదా ఈ కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా నియోగించిన సిబ్బందిని కలిగి ఉండవలసి ఉంటుంది.
పలు వెండర్లతో లావాదేవీలను నిర్వహించే వ్యాపారసంస్థలు, తమకు ఇన్వాయిస్ లభించిన ప్రతిసారి, తమ జిఎస్టి సంఖ్య దాని పై సరిగా ముద్రించబడి ఉండునట్లు జాగ్రత్త వహించాలి. ఇలా జరగని సందర్భాల్లో, ఈ ఇన్వాయిస్లు అనుపాలన జరగనివి అయిపోతాయి. అంతే కా, అనుపాలన చేయని వెండర్ల విషయంలో, వ్యాపార సంస్థలు 5 శాతం నుండి 28 శాతం ఇన్పుట్ పన్ను క్రెడిట్‌ను నష్టపోయే అవకాశాలుంటాయి. పలువురు వెండర్లతో వ్యవహరించటం వలన, ఫిజికల్ ఇన్వాయిస్లతోను మరియు రకరకాల ఫార్మాట్ల ఇన్వాయిస్లతోనూ వ్యవహరించవలసిన చీకాకు కలిగించే పరిస్థితి కలుగవచ్చు. అమెజాన్ బిజినెస్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారంలు ఇలాంటప్పుడే చిన్న మరియు మధ్యతరహా వ్యాపారసంస్థలకు జిఎస్టి అనుపాలనా సమస్యలను సరళీకరించుకునేందుకు సహకరించగలుగుతాయి.
తమ వ్యాపారాలను విస్తరింపజేసుకునేందుకు ఎంఎస్ఎంఇలు ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లకు మారుతున్న తరుణంలో, ఎంఎస్ఎంఇలు జిఎస్టి అనుపాలనను చేపట్టే బరువుబాధ్యతలను సరళీకరించేందుకు వారికి అమెజాన్ బిజినెస్ సహకరించగలుగుతుంది. జిఎస్టి అనుపాలక ఇన్వాయిస్లను ఒక కేంద్రీకృత స్థానంలో పొందగలగటం వలన ఆ ఎంఎస్ఎంఇలు పలు లాభాలను పొందగలుగుతాయి. అంతేకాక, పలువురు సప్లయర్లతో వ్యవహరించేందుకు ఎంఎస్ఎంఇలు వెచ్చించవలసిన సమయాన్ని, వారి శ్రమను తగ్గిస్తుంది.
ఒక కొనుగోలుదారుగా వ్యాపారసంస్థలు తమ జిఎస్టి నెంబరును అమెజాన్ బిజినెస్ పై అప్డేట్ చేయగానే, ప్రతి ఇన్వాయిస్, వారి జిఎస్టి నెంబరును కలిగి ఉంటుంది. దీని వలన, అన్ని ఇన్వాయిస్లను వ్యాలిడేట్ చేసేందుకు పట్టే సమయం మరియు కలిగే శ్రమలో చెప్పుకోదగిన తగ్గుదల ఉంటుంది. జిఎస్టి-అనుపాలక బ్యాడ్జ్ కలిగిన లక్షలాది ఉత్పత్తులను అమెజాన్ బిజినెస్ కలిగి ఉంటుంది. ఎంఎస్ఎంఇ కొనుగోలుదారులు కేవలం రిజిస్టర్ అయిన జిఎస్టి వెండర్లతో మాత్రమే కనెక్ట్ అయ్యేట్లు చేసేందుకు ఉపయోగపడే జిఎస్టి ఫిల్టర్లను కలిగి ఉంటుంది. వ్యాపార లావాదేవీలు అవాంతరాలు లేకుండా నడిచేందుకు ఇది దోహదం చేస్తుంది. పలువురు వెండర్లతో వ్యవహరించేటప్పుడు వ్యాపారసంస్థల సమయం మరియు శ్రమను ఇది ఆదా చేస్తుంది. జిఎస్టి అనుపాలక ఇన్వాయిస్లు మరియు వర్తించే ప్రతి చోటా ఇ-వే బిల్లులను కూడా పొందేందుకు సహకరిస్తుంది. అంతేకా, అమెజాన్ బిజినెస్ పై ఇన్వాయిస్లు డిజిటల్ మరియు ప్రామాణికమైనవి. ఇందువలన, ఈ వ్యాపార కొనుగోళ్ళ పై మరింత ఎక్కువ ఆదా చేసుకునేందుకు ఇన్పుట్ పన్ను క్రెడిట్ కోసం వీటిని ఫైల్ చేయటాన్ని సరళతరం చేసింది.
ఒక విక్రేతగా ఎంఎస్ఎంఇలు, అమెజాన్ బిజినెస్ వంటి ఇ-కామర్స్ ప్లాట్ఫారం నుండి సేవలను పొంది, పన్ను అనుపాలకమైన ఇన్వాయిస్లను అటువంటి ఇ-కామర్స్ వేదికల ద్వారా సృష్టించవచ్చు, ఆయా సమయాలకుగాను నివేదికలను పొందగలుగుతాయి. ఈ నివేదికలు, నెలవారి/త్రైమాస జిఎస్టి అనుపాలకాలు మరియు ఆడిట్లను చేపట్టేటప్పుడు బాగా ఉపయోగపడతాయి.
2017లో ప్రారంభించబడినప్పటి నుండి, ఎంఎస్ఎంఇల విభిన్నమైన వ్యాపారావసరాలకు తగిన విధంగా ఉపయోగపడేందుకు ఉన్నత క్యాటగిరీల వ్యాప్తంగా 20 కోట్లకు పైగా జిఎస్టి సశక్త ఉత్పత్తులతో ఎంఎస్ఎంఇలకు ఒక వన్-స్టాప్ డెస్టినేషన్‌గా మారేందుకుగాను అమెజాన్ బిజినెస్ ఎల్లప్పుడూ ఎంఎస్ఎంఇలను సశక్తీకరించేందుకు ఉద్దేశించినది. అమెజాన్ బిజినెస్ పై బిజినెస్ కస్టమర్లకు విక్రయిస్తున్న 3.7 లక్షల మంది విక్రేతలు ఉన్నారు. విస్తృతశ్రేణి ఉత్పత్తులను అందించటంతో పాటు, అప్రత్యక్ష ఖర్చులను నిర్వహించుకునేందుకు ఎంఎస్ఎంఇలకు సహకరించటం ద్వారా వారు తమ వ్యాపారాలను నిర్వహించుకునేందుకు అమెజాన్ బిజినెస్ ఉపయోగపడుతుంది. విశ్వసనీయమైన మరియు అంతర్జాతీయస్థాయి ఫుల్ఫిల్మెంట్ నెట్వర్కును అమెజాన్ అందిస్తున్న కారణంగా మల్టీ-యూజర్ అకౌంట్లు మరియు ఆమోదాలు, ఖర్చు విశ్లేషణలు మరియు సురక్షితమైన మరియు విశ్వసనీయమైన డెలివరీ వంటి ఫీచర్లతో వ్యాపారనిర్వహణ సులభతరం అయ్యి, ఖర్చులు తగ్గుతాయి.
ఎంఎస్‌ఎంఇకి ఇకామర్స్ ఒక గొప్ప భాగస్వామి. ఎంఎస్ఎంఇలు తమ అప్రత్యక్ష ఖర్చులను మేనేజ్ చేసుకునేందుకు, కొనుగోలును మరింత సౌకర్యవంతంగా చేసేందుకు, జిఎస్టి అనుపాలకంగా మారేందుకు, తద్వారా లాభార్జనను మెరుగుచేసుకునేందుకు సహకరించటం ద్వారా, మెల్లమెల్లగా ఇకామర్స్, వారికి బలమైన మద్ధతుగా నిలుస్తోంది.