Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నిరుటితో పోల్చితే ఈ ఏడాది మొదటి త్రైమాసికం (2021Q1/ జనవరి-మార్చి, 2021)లో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టుల సంఖ్య 17% మేర తగ్గింది. ఏదేమైనప్పటికీనా, 2020 మొదటి మూడు త్రైమాసికాలతో పోల్చితే నగరంలో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టుల సంఖ్య ఎక్కువగానే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కొండాపూర్, మియాపూర్ మరియు నల్లగండ్ల ప్రాంతాలలో కొత్త ప్రాజెక్టులు కేంద్రీకృతమై ఉండగా, కొత్త ప్రాజెక్టుల విషయంలో ప్రధాన వాటా పశ్చిమ శివారు ప్రాంతాలకే ఉంది.దీని తరువాత నగరంలో ప్రారంభమైన ప్రాజెక్టుల్లో 43 శాతం వాటా ఉత్తర శివారు ప్రాంతాల్లోఉన్నాయి. సరసమైన ధరల విభాగంలో (రూ.50 లక్షల కన్నా తక్కువ) కొత్త ప్రాజెక్టులు సంఖ్య గణనీయంగా వృద్ధి చెందగా, ఈ త్రైమాసికంలో మొత్తం కొత్త ప్రాజెక్టుల వాటా 48% ఉంది.
హెచ్2 2020లో జరిగిన విక్రయాల్లో పరిస్థితులే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనూ కొనసాగాయి. నివాస సముదాయాల యూనిట్ల విక్రయాలు 4% వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కానీ, నగరంలో విక్రయాల పరిమాణం 2019 తరహాలో గరిష్ట స్థాయికి చేరుకోలేదు. నగరానికి పరిమితమైన రెడీ-టు-మూవ్-ఇన్ విభాగంలో ప్రముఖ డెవలపర్లు ఇటీవల ప్రారంభించిన ప్రాజెక్టులపై ఇళ్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపించారు. పశ్చిమ శివారు ప్రాంతాల్లోని ఐటి హబ్‌లకు చేరువలో ఉన్న ప్రముఖ ప్రాంతాలతో పాటు, ఉత్తర శివార్లలో కొంపల్లి మరియు బాచుపల్లి విభాగాల్లో నెలకొల్పిన ఐటి హబ్‌లకు మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ మెరుగుదల కారణంగా ఇళ్ల కొనుగోలుదారులను నూతన గమస్థానాలుగా మారాయి.
‘‘డిమాండ్ స్థాయిని మెరుగుపరచడం, తక్కువ పెట్టుబడిని కలిగి ఉన్న రెడీటూ మూవ్ ప్రాజెక్టుల ధరలు నగరంలో స్థిరంగా ఉన్నాయి. విక్రయాలు సాధారణ స్థితికి చేరుకున్న అనంతరం మరింత మెరగుపడతాయని అంచనా కాగా, నగరంలోని ప్రైమ్ సెకండరీ, పశ్చిమ మరియు ఉత్తర శివారు ఉప మార్కెట్లలో మూలధన విలువలు స్వల్పంగా మెరుగుపడ్డాయని’’ జెఎల్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ &తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విభాగాధిపతి సందీప్ పట్నాయక్ పేర్కొన్నారు.
భారతదేశం వ్యాప్తంగా ఇళ్ల విక్రయాలు పునరుద్ధరించబడ్డాయి
2021 మొదటి త్రైమాసికంలో (Q1)(జనవరి-మార్చి)లో నివాసాల విక్రయాలు మొదటి ఏడు నగరాల్లో 2020 Q1 (ప్రీ-కోవిడ్) కన్నా 90%కన్నా ఎక్కువ పరిమాణంలో నమోదయ్యాయి. చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పుణె నగరాలు నగరాలు 2020Q1లో విక్రయ పరిమాణాలు మెరుగుపడ్డాయి. మొత్తం విక్రయాలు వరుస ప్రాతిపదికన 17%వృద్ధి చెందాయి. ముఖ్యంగా, పరిశీలనలో ఉన్న రెసిడెన్షియల్ మార్కెట్లలో విక్రయాలు మెరుగుపడ్డాయి లేదా అదే స్థాయిలో ఉన్నాయి (Q1 2020 తో పోలిస్తే Q1 2021లో). గత నాలుగు త్రైమాసికాలలో విక్రయాల్లో ముంబై నిలకడగా నిలిచింది. 2021Q1లోముంబయిలో విక్రయాలు 23%, ఢిల్లీ ఎన్‌సిఆర్ 21% వాటాతో కొనసాగుతున్నాయి.
ఏదేమైనప్పటికీ, కోల్‌కతాలో 2020 నాల్గవ త్రైమాసికంతో పోల్చితే 2021Q1లో విక్రయ కార్యకలాపాలు గరిష్ఠంగా పెరిగాయి. కోల్‌కతాలో, 2021Q1లో రెసిడెన్షియల్ యూనిట్ల విక్రయాల అంశంలో దక్షిణ శివారు ప్రాంతాలు (జోకా, కాస్బా, బెహాలా, జాదవ్‌పూర్, టోలీగంజ్) మరియు తూర్పు శివారు ప్రాంతాలు (ఈఎం బైపాస్, రాజర్హట్, తోప్సియా) సంయయుక్తంగా 70% కంటే వాటాను కలిగి ఉన్నాయి.