Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలో నంబర్ 1 స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ టీవీ బ్రాండ్ ఎంఐ ఇండియా 2021లో తన ప్రీమియం ఫ్లాగ్షిప్ ఉపకరణాలు ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11X సిరీస్ మరియు ఎంఐ క్యూఎల్ఇడి టివి 75’’లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. విప్లవాత్మక కెమెరాలు, సరికొత్త ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్™8 XX సిరీస్ చిప్సెట్లు, శక్తివంతమైన స్పీకర్లు, 120 హెడ్జ్ ఇ4 సూపర్ అమోల్డ్ (AMOLED) డిస్ప్లే మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్న ఈ ఉపకరణాలు వినియోగదారులకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. వినియోగదారులకు గదిలో థియేటర్ తరహా అనుభవాన్ని సృష్టించేందుకు, ఎంఐ క్యూఎల్ఇడి 75’’ టివి 97% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 4కె క్యూఎల్ఇడి (4K QLED)ప్యానెల్, 192 లోకల్ డిమ్మింగ్ జోన్లు మరియు 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్‌తో అందుబాటులోకి వస్తోంది.
వీటి విడుదల గురించి ఎంఐ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ మాట్లాడుతూ, “ఎంఐ బ్రాండ్ ప్రీమియం మాత్రమే కాకుండా మా వినియోగదారులు పరిగణనలోకి తీసుకునే ఉత్తమమైన ఇన్-క్లాస్ టెక్నాలజీని కలిగిన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు రావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. ఎంఐ11 సిరీస్ ద్వారా, మేము భవిష్యత్తుకు తగిన సాంకేతికతను తీసుకువస్తున్నాము మరియు మొత్తం మీద వినియోగదారుని అనుభవాన్ని ఉన్నతీకరించేలా వీటిని తయారు చేశాము. ఈ ఫ్లాగ్షిప్ స్థాయి ఉత్పత్తులు చక్కని పనితీరును అందిస్తూ, అత్యుత్తమ కెమెరాలు మరియు పనితీరును లీనమయ్యే ప్రదర్శనతో కలపడం ద్వారా ఆవిష్కరణకు ఉన్న సరిహద్దులను అధిగమిస్తుంది.
మేము ప్రపంచంలో మొట్టమొదటి (1st) ట్రిపుల్ ప్రో-గ్రేడ్ కెమెరా సెటప్‌తో పాటు హర్మాన్/ కార్డన్ నుంచి డ్యూయల్ డిస్ప్లే మరియు లెగసీ సౌండ్‌తో ఎంఐ 11 అల్ట్రాను పరిచయం చేస్తున్నాము. ఎంఐ 11 అల్ట్రా అనేది ప్రపంచంలోని డిఎక్స్ఓ నంబర్.1 స్మార్ట్‌ఫోన్ కెమెరా మరియు ప్రొఫెషనల్ గ్రేడ్ కెమెరాలతో పోల్చగల మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ కెమెరా. సన్నని మరియు తేలికపాటి చట్రంతో ఎంఐ 11Xమరియు ఎంఐ 11X ప్రో, టాప్-ఆఫ్-ది-లైన్ ప్రాసెసర్లు మరియు టాప్-ఎండ్ 120 హెడ్జ్ ఇ4 సూపర్ అమోల్డ్ (AMOLED) డిస్ప్లేతో, వినియోగదారులకు ప్రీమియం మొబైల్ అనుభవాన్ని అందిస్తుందని’’ వివరించారు.
దీని గురించి ఆయన మరింత వివరిస్తూ ‘‘మాకు ఉన్న పెద్ద వ్యాపార విభాగంలో స్మార్ట్ టివి మరొకటి మరియు భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కొలమానాల్లో దాన్ని అందించడం ద్వారా వినియోగదారుల మొత్తం అనుభవాన్ని ఉన్నతీకరించేందుకు మేము నిరంతరం శ్రమిస్తూ వస్తున్నాము. దీని 97% స్క్రీన్-టు-బాడీ రేషియో, ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ, రియాలిటీ ఫ్లో MEMC మరియు 30W స్పీకర్లతో 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్, ఇవన్నీ హౌస్ ఆఫ్ ఎంఐ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్న అత్యంత అధునాత మరియు ప్రీమియం టీవీ అని సగర్వంగా ప్రకటిస్తున్నాము. మా విజయ పరంపరను పెంచుకుంటూ, మేము ‘రేపటి థియేటర్’ను అందుబాటులోకి తీసుకు వస్తూ,మా అభిమానులు మరియు వినియోగదారులకు వారి గదిలో ఒక థియేటర్ అనుభవాన్ని పునఃసృష్టి చేసుకునేదుకు సాధికారతను కల్పిస్తున్నాము.
నేడు రెండు విభాగాల్లో నాలుగు ఉపకరణాలను విడుదల చేయడం ద్వారా మేము స్మార్ట్ఫోన్లు మరియు స్మార్ట్ టీవీల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాము. కచ్చితత్వంతో రూపొందించబడినఇది సాంకేతిక పురోగతి భవిష్యత్తును సూచిస్తూ, వినియోగదారులకు అసాధారణమైన అనుభవాన్ని తన సరికొత్త ఆవిష్కరణలతో పూర్తి స్థాయిలో అందిస్తుంది. ఎంఐ అభిమానులు మరియు వినియోగదారులు వాటిని ఎక్కువగా ఉపయోగించుకుంటూ, తమ ప్రొడక్టివిటీని మరియు సృజనాత్మకతను తదుపరి స్థాయికి తోడ్కొని వెళతారని, గతంలో ఎన్నడూ లేని విధంగా కంటెంట్‌ను ఆస్వాదిస్తారని మేము నమ్మకంతో ఉన్నామని’’ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎంఐ 11 అల్ట్రా: స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా సామర్థ్యాలకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చే సూపర్‌ఫోన్ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీని సరికొత్త స్థాయికి తీసుకువెళ్లే కెమెరా ఆవిష్కరణలను తనతో తోడ్కొని వస్తోంది. స్మార్ట్‌ఫోన్ కెమెరా వినియోగపు పనితీరును ఉన్నతీకరిస్తూ ఎంఐ 11 అల్ట్రా ప్రో-గ్రేడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చిన, ప్రపంచంలో 1వ ఫోన్ ఇది కాగా, దీన్ని డిఎక్స్ఓ-మార్క్ నంబర్.1 స్మార్ట్‌ఫోన్ కెమెరాగా రేటింగ్ ఇచ్చింది.
· 50ఎంపి GN2 కస్టమ్ సెన్సర్ శామ్సంగ్ ISOCELL డివిజన్‌తో కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. (స్మార్ట్ఫోన్లలో ఇది అతి పెద్ద సెన్సర్)
· 48ఎంపి సోనీ IMX586 అల్ట్రా-వైడ్ –ఈ పరిశ్రమలో విశాలమైన 128-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ లెన్స్ వ్యవస్థను కలిగి ఉంది
· 48ఎంపి సోనీ IMX586 5x ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ లెన్స్ సిస్టమ్, 10x హైబ్రిడ్ మరియు 120x డిజిటల్ జూమ్ సామర్థ్యం కలిగి ఉంటుంది.
ప్రొఫెషనల్ కెమెరా సెటప్ తక్కువ-వెలుగు పరిస్థితులోనూ ఫొటోలను చక్కని స్పష్టతతో తీసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది GN2 సెన్సార్‌లో OISతో అందుబాటులోకి వస్తుండగా, ఇది స్థిరమైన గింబాల్ స్థాయి వీడియో రికార్డింగ్‌కు అవకాశం కల్పిస్తుంది. మూడు లెన్స్‌లలో 8కె రికార్డింగ్‌ను అనుమతించే మొదటి స్మార్ట్ఫోన్లలో ఇది కూడా ఒకటి.
ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత అధునాత డిస్ప్లే ఉంది. ఇది టాప్-ఆఫ్-ది-లైన్ 17.29 సెం.మీ (6.81’’) డబ్ల్యూక్యూహెచ్‌డి + ఇ4 సూపర్ అమోల్డ్ క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. దీనిలోని 1700 నిట్ల గరిష్ట ప్రకాశంతో ఇది ప్రపంచంలోనే అత్యం ప్రకాశవంతమైన డిస్ప్లేగా నిలుస్తుంది. ఇది 120హెడ్జ్ అడాప్టివ్‌సింక్ టెక్నాలజీతో మరియు టచ్ శాంప్లింగ్ రేటు 480హెడ్జ్‌తో వస్తుంది. వినియోగదారులు రిచ్ వర్ణాలను కూడా ఆస్వాదించవచ్చు మరియు డాల్బీ విజన్ మరియు HDR10+ అదనపు మద్ధతుతో ఈ డిస్ప్లే డైనమిక్ పరిధిని కలిగి ఉంటుంది. ఈ హై-ఎండ్ ఫీచర్లు మొత్తం వీక్షణ అనుభవాన్ని ఉన్నతీకరిస్తూ మరియు గేమింగ్ మరియు కంటెంట్ వినియోగానికి ఇది ఉత్తమ డిస్ప్లేలలో ఒకటిగా నిలుస్తుంది. ఎంఐ 11 అల్ట్రా కెమెరా మాడ్యూల్ వెనుక వైపు ఒక ప్రత్యేకమైన 1.1”అంగుళాల అమోల్డ్ టచ్ డిస్ప్లే ఉంటుంది. దీన్ని వ్యూఫైండర్ డిస్ప్లే అని పిలుస్తారు. ఈ అదనపు డిస్ప్లే కాల్ అలర్ట్‌లు, యాప్ నోటిఫికేషన్లను చూపించడమే కాకుండా, వెనుక వైపు ఉండే కెమెరా సెటప్‌ను ఉపయోగించడం ద్వారా ప్రో-గ్రేడ్ సెల్ఫీలు తీసుకునేందుకు వ్యూఫైండర్‌గా ఉపయోగపడుతుంది.
ఎంఐ 11 అల్ట్రా సరికొత్త ఫ్లాగ్షిప్ క్వాల్కామ్®స్నాప్‌డ్రాగన్™888 చిప్సెట్తో ఎనిమిది క్రియో 680 సిపియును కలిగి ఉండడంతో ఇది తీవ్రమైన పనితీరు మరియు అద్భుతమైన శక్తి సామర్థ్యాన్ని ఫోన్‌కు అందిస్తుంది. హర్మాన్ కార్డాన్ ద్వారా డ్యూయల్-స్టీరియో స్పీకర్ సెటప్‌తో, ఇది గొప్ప మరియు లోతైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. వైర్లెస్ మరియు వైర్డు కనెక్షన్ రెండింటిలో 67W టర్బో-ఛార్జింగ్ సదుపాయం ఇందులో ఉంది. ఫోన్ 0 నుంచి 100% వరకు పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 36 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా రక్షణ పొందుతున్న ప్రపంచంలోని కొన్ని మొదటి ఫోన్లలో ఇది ఒకటి మరియు వెనుక భాగం ప్రీమియం సిరామిక్ మెటీరియల్‌తో తయారు చేయబడింది. ఇది IP68 సర్టిఫికేట్, అంటే, దుమ్ము మరియు నీటి నుంచి రక్షణ కోసం అత్యధిక నాణ్యత ప్రమాణాలను కలిగి ఉంది, అలాగే ఇది వాటర్ ప్రూఫ్ ఫోన్.
ఎంఐ 11X ప్రో: అన్నింటికన్నా ఉత్తమం
ఎంఐ 11X ప్రో అందమైన, ఆచరణాత్మక రూపకల్పన మరియు బహుముఖ కార్యాచరణల సంపూర్ణ సమ్మేళనం. ఎంఐ 11Xప్రో శక్తివంతమైన క్వాల్కామ్®స్నాప్‌డ్రాగన్™888ను ఉపయోగించుకోవడం ద్వారా ఎంఐ 11 అల్ట్రా తరహాలో పనితీరును, చక్కని కంప్యూటిషనల్ వేగాన్ని అందిస్తుంది. ఇది 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో సరికొత్త 120హెడ్జ్ ఇ4అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఇప్పుడు కచ్చితమైన వర్ణం డెప్త్ మరియు డైనమిక్ పరిధిని అందించడానికి మూడు-వేళ్ల 360హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ మరియు HDR10+కు మద్దతు ఇస్తుంది.
విప్లవాత్మక 108ఎంపి HM2 కెమెరాతో, 9-ఇన్-1 పిక్సిల్ బిన్నింగ్ టెక్నిక్‌తో ఇది అతి తక్కువ వెలుగు పరిస్థితుల్లోనూ అద్భుతమైన ఫలితాల్ని అందిస్తుంది. ఎంఐ 11X ప్రోలో 4,520ఎంఏహెచ్ సామర్థ్యపు బ్యాటరీ ఉండడంతో రోజంతా బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది మరియు కేవలం 19 నిమిషాల్లో 0 నుండి 50% ఛార్జ్ వరకు వెళుతుంది. ఈ ఉపకరణం సొగసైన గ్లాస్ బాడీ డిజైన్‌తో, కేవలం 196 గ్రాముల తూకంతో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎక్కువ గంటలు దృఢమైన మరియు సౌకర్యవంతమైన గ్రిప్ అందిస్తుంది.
ఎంఐ 11X: ఈ విభాగంలో వేచి ఉన్న డామినేటర్
ఎంఐ 11Xవిలక్షణ ప్రాసెసర్ మరియు కెమెరా సెటప్‌తో ఎంఐ 11Xప్రో అన్ని మంచితనాలను కలిగి ఉంది. ప్రో వెర్షన్ తరహాలోనే ఎంఐ 11X కూడా 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్, మూడు-ఫింగర్ 360హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేటుతో సరికొత్త ఇ4 అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది అధిక ఎఫ్పిఎస్తో గేమ్స్‌లో గేమర్లకు చక్కని పోటీ ఎడ్జ్ అందిస్తూ, 1300 నిట్స్‌తో గరిష్ఠ ప్రకాశవంతతను అందిస్తుంది. ఇది డాల్బీ అట్మోస్ మద్దతుతో డెడికేటెడ్ స్టీరియో స్పీకర్ సెటప్‌ను కూడా కలిగి ఉంది. ఎంఐ 11X ప్రో తరహాలోనే ఎంఐ 11X4520ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఇన్-బాక్స్ 33W ఛార్జర్‌తో కేవలం 19 నిమిషాల్లో 0-50% ఛార్జ్ అవుతుంది.
సరికొత్త క్వాల్కామ్®స్నాప్‌డ్రాగన్™870 ప్రాసెసర్‌ను కలిగి ఉన్న మొట్టమొదటి కొన్ని స్మార్ట్ఫోన్లలో ఎంఐ 11X కూడా ఒకటి. నిరుడు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ - స్నాప్‌డ్రాగన్™825తో పోల్చినప్పుడు కొత్త ప్రాసెసర్ 12% వరకు మెరుగైన పనితీరును అందిస్తుంది. కెమెరా ముందు, 48ఎంపి సోనీ IMX582 నేతృత్వంలోని 48ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ప్రధాన సెన్సార్‌గా కలిగి ఉంటూ, అనంతరం 119-డిగ్రీ కెమెరా మరియు టెలి మాక్రో కెమెరాతో ఇది అల్ట్రావైడ్కు మద్దతు ఇస్తుంది.
ఎంఐ క్యూఎల్ఇడి టీవీ 75’’- నేత్రాలకు ఉల్లాసవంతమైన చిత్ర నాణ్యత
ఎంఐ క్యూఎల్ఇడి టివి 75”ఎడ్జ్-టు-ఎడ్జ్ 75-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండగా, ఇది మినిమాలిక్ బెజెల్స్‌తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. ప్రీమియం మెటల్ ఫినిషింగ్ ఎంఐ క్యూఎల్ఇడి టివి 75” చూసేందుకు ఆకర్షణీయంగా మరియు చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. సౌందర్యం మరియు సమతుల్యతను మరింత పెంచేందుకు ఇది సరికొత్త ప్రీమియం ‘ఫ్లోటింగ్ స్టాండ్’తో అందుబాటులోకి రాగా, ఇది తాజా ఫ్లాగ్‌షిప్‌కు కొత్త కోణాన్ని జోడిస్తుంది. ఈ ఫ్లోటింగ్ డిజైన్ గదిలో మధ్యలో పెద్ద కాన్వాస్ ప్రవాహం తరహా ముద్రను ఇస్తుంది. దీన్ని వాస్తవంగా ఇంట్లో థియేటర్ లాంటి అనుభవం కోసం తయారు చేశారు.
ఎంఐ క్యూఎల్ఇడి టివి 75”ఒక బిలియన్ కన్నా ఎక్కువ నిజ-జీవిత వర్ణాలను మరియు ప్రతి చిత్రానికి జీవితాన్ని ఊపిరి పీల్చుకునే 100% రంగు స్పెక్ట్రంను అందిస్తుంది. ఇది 192 జోన్ల పూర్తి శ్రేణి డైనమిక్ లోకల్ డిమ్మింగ్‌తో వస్తుంది, ఇది లోతైన నల్లదనాన్ని మరియు తెల్లని ప్రకాశవంతను అందిస్తూ టీవీ కాంట్రాస్ట్ నిష్పత్తిని నమ్మశక్యం కాని 10,000:1కి తీసుకు వెళుతుంది. చివరిగా హోమ్ సినిమా అనుభవాన్ని ఉన్నతీకరించే లక్ష్యంతో, ఇది డాల్బీ విజన్®హెచ్డి, హెచ్‌డిఆర్10+ మరియు 120 రిఫ్రెష్ రేట్ ప్యానెల్‌కు మద్దతు ఇస్తుంది. రియాలిటీ ఫ్లో120, ఆటో లో లాటెన్సీ మోడ్ (ALLM) మరియు HDMI 2.1 పోర్ట్‌లను అద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో కలిపి, ఎంఐ క్యూఎల్ఇడి టీవీ 75’’ అద్భుతమైన గేమ్‌ప్లే అనుభవాన్ని అందిస్తుంది. రిచ్ బాస్‌తో స్పష్టమైన త్రీ డైమెన్షనల్ ఆడియో కోసం 30W- అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేసే ఆరు స్పీకర్ల శ్రేణితో ఇది అద్భుతమైన శ్రవణ అనుభవాన్ని అందిస్తుంది.
ధర
· ఎంఐ 11 అల్ట్రా 12జిబి + 256జిబి వేరియంట్లో రూ.69,999 ధరలో లభిస్తుంది.
· ఎంఐ క్యూఎల్ఇడి టివి 75”ధర రూ.1,19,999
· ఎంఐ 11 Xప్రో 8 జిబి + 128 జిబి, 8 జిబి + 256 జిబి వేరియంట్లలో వరుసగా రూ.39,999 మరియు రూ.41,999 ధరలకు లభిస్తుంది.
· ఎంఐ 11X6 జిబి + 128 జిబి, 8 జిబి + 128 జిబి వేరియంట్లలో వరుసగా రూ.29,999 మరియు రూ.31,999 ధరలకు లభిస్తుంది.