Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతదేశంలో శాంసంగ్ యొక్క అత్యంత అందుబాటు ధరలోని 5జీ స్మార్ట్‌ఫోన్
· 5జీ కనెక్టివిటీ అందిస్తున్న శాంసంగ్ యొక్క మొట్టమొదటి మధ్య తరహా శ్రేణి స్మార్ట్‌ఫోన్
· శాంసంగ్ పేతో వస్తున్న మొట్టమొదటి గెలాక్సీ ఎం స్మార్ట్‌ఫోన్
· స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, ఎస్‌అమోలెడ్ డిస్ప్లే, అసలైన 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, భారీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
ఢిల్లీ: భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నేడు గెలాక్సీ ఎం42 5జీను ఆవిష్కరించింది. శాంసంగ్ యొక్క మొట్టమొదటి మిడ్ సెగ్మంట్ 5జీ ఉపకరణం ఇది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో శక్తివంతం అయిన గెలాక్సీ ఎం42 5జీ, వాస్తవంగా అత్యంత వేగవంతమైన మానెస్టర్గా నిలుస్తుంది. సాంకేతికత పట్ల అమితాసక్తి కలిగిన మిల్లీనియల్స్ మరియు వేగవంతమైన జీవితాలను కోరుకునే జెన్ జెడ్ వినియోగదారుల కోసం డిజైన్ చేయబడింది. గెలాక్సీ ఎం42 5జీ ఇప్పుడు గెలాక్సీ ఎం స్మార్ట్‌ఫోన్ లో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా శాంసంగ్ పే ను సైతం కలిగి ఉంది. శాంసంగ్ యొక్క సురక్షితమైన, అత్యంత సులభంగా వినియోగించతగిన మొబైల్చెల్లింపుల సేవ ఇది. గెలాక్సీ ఎం42 5జీ స్మార్ట్‌ఫోన్‌లో శాంసంగ్ యొక్క డిఫెన్స్ గ్రేడ్ మొబైల్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ శాంసంగ్ నాక్స్ సైతం వస్తుంది.
గెలాక్సీ ఎం42 5జీ స్మార్ట్‌ఫోన్ అత్యద్భుతమైన ప్రిజమ్ డాట్ బ్లాక్ మరియు ప్రిజమ్ డాట్ గ్రే కలర్స్‌లో 21999 రూపాయలకు 6జీబీ+128 జీబీ వేరియంట్ మరియు 23999 రూపాయలలో 8జీబీ+128జీబీ వేరియంట్ లభ్యమవుతుంది. గెలాక్సీ ఎం42 5జీ ఇప్పుడు శాంసంగ్ డాట్ కామ్, అమెజాన్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల వద్ద లభ్యమవుతుంది. ప్రత్యేక పరిచయ ధరగా వినియోగదారులు గెలాక్సీ ఎం42 5జీని ప్రత్యేక ధర 19,999 రూపాయలలో 6జీబీ వేరియంట్‌ను 21,999 రూపాయలలో 8జీబీ వేరియంట్‌ను శాంసంగ్ డాట్ కామ్ మరియు మే నెలలో అమెజాన్ యొక్క ఆన్లైన్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.
గెలాక్సీ ఎం42 5జీలో అత్యద్భుతమైన 6.6 అంగుళాల ఎస్‌అమోలెడ్ ఇన్ఫినిటీ యు–డిస్ప్లే ఉంది. లీనమయ్యే వీక్షణ అనుభవాలను అందించడంతో పాటుగా దీనిలోని అసలైన 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అత్యుత్తమ శ్రేణి ఐసోసెల్ జీఎం2సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 5జీ ఆధారిత సమగ్రమైన పనితీరు కలిగిన ఉపకరణం కోసం వెదికే వినియోగదారుల కోసం అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. ‘‘అంతర్జాతీయంగా శాంసంగ్‌కు అత్యధిక సంఖ్యలో 5జీఉపకరణాలు ఉన్నాయి. గెలాక్సీ ఎం42 5జీ ఆవిష్కరణతో, మేము మా మొట్టమొదటి మిడ్ శ్రేణి 5ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో ఆవిష్కరించాం. అమితాదరణ పొందిన ఎం సిరీస్ వారసత్వం కొనసాగిస్తూ గెలాక్సీ ఎం42 5జీ మా మొట్టమొదటి ఫాస్టెస్ట్ మానెస్టర్గా ఇప్పటికి నిలిచింది. దీనిలో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 5జీప్రాసెసర్ ఉంది. గెలాక్సీ ఎం42 5జీలో భారీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, అద్భుతమైన సూపర్ అమోలెడ్ స్ర్కీన్, డిఫెన్స్ గ్రేడ్ నాక్స్ సెక్యూరిటీ ఉన్నాయి. శాంసంగ్ పే తో వస్తున్న మొట్టమొదటి ఎం సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఇవన్నీ కూడా గెలాక్సీ ఎం42 5జీని అత్యుత్తమ 5జీ స్మార్ట్‌ఫోన్‌గా వేగం మరియు సమగ్రమైన పనితీరు కోరుకునే యంగ్ మిల్లీనియల్స్ మరియు జెన్ జెడ్ వినియోగదారులకు మలుస్తుంది..’’ అని ఆదిత్య బబ్బర్, సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్, మొబైల్ మార్కెటింగ్, శాంసంగ్ ఇండియా అన్నారు.
మొట్టమొదటి 5జీ మానెస్టర్
అంతర్జాతీయంగా 5జీ సాంకేతికతలో అగ్రగామిగా శాంసంగ్ వెలుగొందుతుంది. 2019లో ప్రపంచంలో మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్10ను ఆవిష్కరించింది. శాంసంగ్‌కు ఇప్పుడు అంతర్జాతీయంగా 5జీ ఉపకరణాల పరంగా అతిపెద్ద పోర్ట్‌ఫోలియో ఉంది. అంతేకాదు ప్రపంచంలో అతిపెద్ద 5జీ స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్ (ఎస్ఈపీ) వాటా కూడా ఉంది. గెలాక్సీ ఎం42 5జీ ఇప్పుడు భారతదేశంలో శాంసంగ్ యొక్క అత్యంత అందుబాటు ధరలోని 5జీ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. శాంసంగ్యొక్క అంతర్జాతీయ నైపుణ్యం మరియు 5జీలో నాయకత్వం చేత నిర్మించబడింది. 5జీ కనెక్టివిటీతో వినియోగదారులు ఇప్పుడు అత్యున్నత వేగవంతమైన డౌన్లోడ్స్ను ఆస్వాదించడంతో పాటుగా బఫర్ ఫ్రీ స్ట్రీమింగ్, అవాంతరాలు లేని ఆన్లైన్ గేమింగ్‌ను ఆస్వాదించవచ్చు. 5జీ నెట్‌వర్క్‌లో డాటా 4జీతో పోలిస్తే 20 రెట్లు వేగంగా ఉండటంతో పాటుగా అసాధారణ వినియోగదారుల అనుభవాల పరంగా లాటెన్సీలో 10 రెట్ల తరుగుదల కూడా ఉంటుంది.
మానెస్టర్ పనితీరు
క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750జీతో శక్తివంతమైన గెలాక్సీ ఎం42 5జీ అత్యున్నత వేగవంతమైన పనితీరుకు భరోసా అందిస్తుంది. గెలాక్సీ ఎం42 5జీలో శక్తివంతమైన మరియు సమర్థవంతమైన 5జీ ప్రాసెసర్ ఉంది. ఇది స్నాపీ పనితీరు, మృదువైన మల్టీ టాస్కింగ్ మరియు బ్రౌజింగ్ లేదా బహుళ యాప్‌లను వినియోగిస్తున్న వేళ కూడా తగ్గించబడిన శక్తి వినియోగం అందిస్తుంది. గేమ్స్ కోసం, దీనిలో గేమ్ బూస్టర్ ఉంటుంది. అలాగే దీనిలోని ఫ్రేమ్ బూస్టర్ అత్యాధునిక గేమింగ్ పనితీరు మరియు ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అనుభవాలను సైతం అందిస్తుంది.
అసలైన 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
ఫాస్టెస్ట్ మానెస్టర్ గెలాక్సీ ఎం42 5జీలో అత్యుత్తమ శ్రేణి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇది ప్రయాణ సమయాలలో కూడా అతి ముఖ్యమైన క్షణాలను ఒడిసిపట్టుకోవాలనుకునే మిల్లీనియల్స్ అవసరాలను తీరుస్తుంది. అతి ప్రధానమైన 48 మెగాపిక్సెల్ ఐసోసెల్ జీఎం2 సెన్సార్ వెనుక కెమెరాలో ఉండటం వల్ల దీనిలో ప్రభావవంతమైన రిజల్యూషన్ 6000ఘ8000 పిక్సెల్స్అందుబాటులో ఉండి అసలైన 48 మెగా పిక్సెల్ ఔట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్పష్టమైన మరియు ఘనమైన వివరాలను సైతం అందిస్తుంది.
వెనుక వైపు కెమెరా సెటప్‌లో 8మెగా పిక్సెల్ అలా్ట్ర వైడ్ లెన్స్ సైతం ఉన్నాయి. ఇవి వినియోగదారులకు ఆకర్షణీయమైన ల్యాండ్ స్కేప్స్‌ను 123 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో ఒడిసిపట్టే అవకాశం అందిస్తుంది. అదే సమయంలో 5మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ క్లోజప్ షాట్స్‌ను ఆకర్షణీయమైన వివరాలతో అందిస్తుంది. 5మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయడంతో పాటుగా వినియోగదారులు అద్భుతమైన పోట్రెయిట్ షాట్స్‌ను తీసుకునేందుకు సైతం సహాయపడుతుంది. ఈ వెనుక వైపు కెమెరా హెచ్డీఆర్ మరియు 4కె వీడియో రికార్డింగ్‌కు 30ఎఫ్‌పీఎస్ వద్ద మద్దతునందిస్తుంది. గెలాక్సీ ఎం42 5జీ యొక్క కెమెరాలో అద్భుతమైన ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఇవి సింగిల్ టేక్‌తో బహళ ఫోటోలు మరియు వీడియో ఔట్‌పుట్‌ను సింగిల్ క్లిక్, నైట్ మోడ్, హైపర్‌లాప్స్, సూపర్ స్లో మోషన్, సీన్ ఆప్టిమైజర్ మరియు ఫ్లా డిటెక్షన్‌తో అందిస్తుంది. గెలాక్సీ ఎం42 5జీ స్మార్ట్‌ఫోన్ 20 మెగాపిక్సెల్ ముందు వైపు కెమెరాతో వస్తుంది. దీనిలోని సెల్ఫీ ఫోకస్‌తో అత్యధిక రిజల్యూషన్ సెల్ఫీలను తీసుకోవచ్చు.
మానెస్టర్ బ్యాటరీ
గెలాక్సీ ఎం42 5జీ స్మార్ట్ఫోన్లు భారీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు ఇన్ బాక్స్ 15 వాట్ ఫాస్ట్ చార్జర్‌తో వస్తుంది. ఇది మీరు పగలు, రాత్రి తరచుగా చార్జింగ్ చేయాల్సిన బాధ లేకుండా పనిచేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫోన్ 36 గంటల టాక్ టైమ్, 22 గంటల ఇంటర్నెట్ బ్రౌజింగ్, 34 గంటల వీడియో ప్లేను సింగిల్ చార్జ్‌తో అందిస్తుంది. అందువల్ల మీరు నెమ్మదించకుండా మీరు కోరుకున్నవి అన్నీ చేయవచ్చు.
డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ, క్లిష్టత లేని యూజర్ ఇంటర్ఫేజ్
గెలాక్సీ ఎం42 5జీలో శాంసంగ్ నాక్స్ ఉంది. శాంసంగ్ యొక్క డిఫెన్స్గ్రేడ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ ఇది. దీనిద్వారా వ్యక్తిగత సమాచారం రక్షించబడటంతో పాటుగా వాస్తవ సమయంలో డాటా సైతం కాపాడబడుతుంది మరియు కాంటాక్ట్‌లెస్ డిజిటల్ చెల్లింపుల కోసం శాంసంగ్ పే (ఎన్ఎఫ్సీ) సైతం ఉంది. గెలాక్సీ ఎం42 5జీలో ఆండ్రాయిడ్ 11 ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉంది. ఇది ఎక్కువ మంది అభిమానించే ఒన్ యుఐ 3.1 ఇంటర్‌ఫేజ్‌కు మద్దతునందిస్తుంది. ఇది సహజమైన అనుభవాలను అందించడంతో పాటుగా స్థిరమైన ఇంటరాక్షన్స్కు సైతం రెస్పాన్సివ్నెస్ వృద్ధి చేయడం మరియు అవాంతరాలను తగ్గించడం ద్వారా అందిస్తుంది.
శాంసంగ్ డిస్ప్లే, ప్రిజమ్ డాట్ డిజైన్
అత్యద్భుతమైన 6.6 అంగుళాల ఎస్‌అమోలెడ్ ఇన్ఫినిటీ యు–డిస్ప్లే కలిగిన గెలాక్సీ ఎం42 5జీ బింగీ వాచర్స్‌కు ఆనందాన్ని అందిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రయాణ సమయాలలో సైతం కంటెంట్‌ను వీక్షించాలనుకునే వారిని ! గెలాక్సీ ఎం42 5జీలో వినూత్నమైన ప్రిజమ్ డాట్ డిజైన్ ఉంది. ప్రీమియం గ్లోసీ ఫినీష్‌ను ఇది కలిగి ఉంది. ఈ ఫోన్ పలుచగా కేవలం 8.6 మిల్లీమీటర్ల మందం మాత్రమే కలిగి ఉండటంతో పాటుగా ఆధునిక 3డీ డిజైన్ కూడా కలిగి ఉంది. దీనిలోని లేయర్డ్ ప్యాట్రర్న్ సౌకర్యవంతమైన గ్రిప్‌ను అందిస్తుంది.
మెమరీ వేరియంట్స్, లభ్యత, ధర
గెలాక్సీ ఎం42 5జీ స్మార్ట్‌ఫోన్ అత్యద్భుతమైన ప్రిజమ్ డాట్ బ్లాక్ మరియు ప్రిజమ్ డాట్ గ్రే కలర్స్‌లో 21999 రూపాయలకు 6జీబీ+128 జీబీ వేరియంట్ మరియు 23999 రూపాయలలో 8జీబీ+128జీబీ వేరియంట్ లభ్యమవుతుంది. గెలాక్సీ ఎం42 5జీ ఇప్పుడు శాంసంగ్ డాట్ కామ్, అమెజాన్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల వద్ద లభ్యమవుతుంది. ప్రత్యేక పరిచయ ధరగా వినియోగదారులు గెలాక్సీ ఎం42 5జీని ప్రత్యేక ధర 19,999 రూపాయలలో 6జీబీ వేరియంట్‌ను 21,999 రూపాయలలో 8జీబీ వేరియంట్‌ను శాంసంగ్ డాట్ కామ్ మరియు మే నెలలో అమెజాన్ యొక్క ఆన్లైన్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.