Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొవిడ్-19 మహమ్మారిపై పోరాటం చేసేందుకు అందరినీ సంఘటితం చేస్తోంది
# స్టేస్ట్రాంగ్ఇండియా (#StayStrongIndia)
మిత్రులారా!
మీలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాము.
మనం ప్రమాదకరమైన కాలంలో జీవిస్తున్నప్పటికీ, మనమందరం కలిసికట్టుగా ఉంటూ, పోరాటం చేయవలసిన సమయం ఇదేనని గుర్తు చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పాజిటివ్ కేసులను గుర్తించడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కాని ధైర్యం, ఓర్పు, మరియు ఒకరిపట్ల మరొకరు సానుభూతి చూపించుకోవడం ద్వారా మనమంతా శక్తివంతులం కావచ్చు. సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ, మనం అన్ని సమస్యలను అధిగమించి మళ్లీ వృద్ధిలోకి వస్తాము.
అనూహ్యమైన ఈ కష్ట కాలంలో, ఒప్పో ఇండియా తరుపున మేము ఈ పరీక్షా సమయాన్ని అధిగమించే దిశలో సమాజానికి మద్దతు ఇచ్చేందుకు మా వంతు ప్రయత్నాలను చేస్తున్నాము. ఒక సంస్థగా మేము ‘‘టెక్నాలజీ ఫర్ మ్యాన్‌కైండ్, కైండ్‌నెస్ ఫర్ ది వరల్డ్’’ను విశ్వసిస్తున్నాము మరియు కొవిడ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీకి మరియు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి రూ.4.3 కోట్ల విలువైన 1,000 ఆక్సిజనేటర్లు మరియు 500 బ్రీతింగ్ యంత్రాలను విరాళంగా అందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ ఉపకరణాలను ఆయా ఆసుపత్రులకు పంపిణీ చేస్తాము. ఇదే సమయంలో, మనల్ని అందరినీ సురక్షితంగా ఉంచేందుకు, అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఫ్రంట్‌లైన్ యోధులందరికీ మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము.
మా కృతజ్ఞతకు ఒక చిన్న చిహ్నంగా ఢిల్లీ పోలీసులు మరియు గ్రేటర్ నోయిడా అథారిటీలో ఫ్రంట్-లైన్ యోధులకు రూ.1.5 కోట్ల విలువైన 5,000 యూనిట్ల ఒప్పో బ్యాండ్ స్టైల్‌ను విరాళంగా అందిస్తున్నాము. వారు ఇతరులకు సేవలు అందిస్తున్న సమయంలో వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఇవి సహకరిస్తాయి. మీరు మాస్కు ధరించి, సురక్షితంగా ఉండాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. దీనితో మనం అందరం ఈ సవాళ్లతో కూడిన సమయాన్ని అధిగమించేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి దశ గణనకు వస్తుంది మరియు ప్రతి చర్య కీలకైనదే అని గుర్తుంచుకోవాలి. భారతదేశానికి మద్దతుగా ఒప్పో నిలుస్తుంది మరియు ఈ ప్రతికూలతను అధిగమించేందుకు మద్దతు ఇస్తుంది. కలిసికట్టుగా, మనం విజయం సాధిస్తాము!
సురక్షితంగా ఉండండి!
ఒప్పో ఇండియా