Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భద్రత పట్ల అవగాహనను వృద్ధి చేసేందుకు చేస్తోన్న ప్రయత్నాలలో భాగంగా, హైదరాబాద్‌లో తమ ప్లాట్‌ఫామ్‌పై డ్రైవర్ల కోసం లింగ సున్నితత్త్వ సదస్సులను ఉబెర్ నిర్వహించింది. ఈ సంవత్సరారంభంలో, న్యూఢిల్లీకి చెంది మానసిక ఆరోగ్యం, లింగ సమానత్వం, న్యాయం వంటి అంశాలలో పనిచేస్తోన్న ఎన్జీఓ మనస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకుని 2021 సంవత్సరాంతం నాటికి భారతదేశ వ్యాప్తంగా 1,00,000 మంది డ్రైవర్లకు లింగ సున్నితత్త్వంపై అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. మహిళలకు మర్యాద ఇవ్వడంతో పాటు ఆపద సమయాల్లో వారికి సాయం చేసే విధంగా కొంతమంది డ్రైవర్లకు శిక్షణను 2018 నుంచే మనస్ ఫౌండేషన్ తో కలిసి ఇస్తోంది ఉబర్. ఇందుకోసం మనస్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు 7 నగరాల్లో దాదాపు 63000 మంది డ్రైవర్లకు వ్యక్తిగతంగా సెషన్స్ నిర్వహించాయి.
కోవిడ్-19 కారణంగా సెషన్లు కొంతకాలం ఆగాయి. ఆ సమయంలో ఉబర్ ఇండియా మరియు మనస్ ఫౌండేషన్ జూమ్ ద్వారా సెషన్స్ నిర్వహించాయి. ఈ జూమ్ సెషన్ కార్యక్రమం దేశంలోని 34 నగరాల్లో జరిగాయి. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లో వారానికి ఐదు రోజులు ప్రతి రోజు ఒక వర్చువల్ జెండర్ సెన్సిటైజేషన్ సెషన్ నిర్వహించారు. దీంతోపాటు ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని చిన్న నగరాల్లో శనివారం సెషన్స్ నిర్వహిస్తారు. ఈ జెండర్ సెన్సిటైజేషన్ సెషన్లలో పురుషులు మరియు మహిళలు ప్రజా రవాణా వ్యవస్థలను ఎలా ఉపయోగిస్తారో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎలాంటి వేధింపులను ఎదుర్కుంటారో సవివరంగా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తారు. అలాగే సమస్యలను పరిష్కరించడంలో డ్రైవర్ల పాత్ర ఎలాంటిదో వివరిస్తారు. ప్రధానంగా మహిళలకు ఎలాంటి వాతావరణం ఉంటే వారు సురక్షితంగా భావిస్తారో, అలాగే మహిళలతో ఎలా ప్రవర్తించాలో కూడా డ్రైవర్లు ఈ సెషన్లలో నేర్చుకుంటారు. అంతేకాకుండా వారికి వచ్చిన సమస్యను పరిష్కారించడంలో ఒక భాగంగా ఉండటానికి కట్టుబడి ఉంటారు. ఈ సందర్భంగా భాగస్వామ్యంపై ఉబర్ ఇండియా & సౌత్ ఆసియా డ్రైవర్, సప్లై & సిటీ ఆపరేషన్స్ (మొబిలిటీ) హెడ్ పవన్ వైష్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ “ఉబర్ చేసే ప్రతి పనిలో భద్రత ప్రధానమైనది. మా లక్ష్యం మహిళలకు సురక్షితమైన రవాణాను అందించడం. ఇది వారు చేసే ఎంపికలపై మరియు వారు యాక్సెస్ చేయగల అవకాశాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. మనస్ ఫౌండేషన్‌తో మా భాగస్వామ్యంను డ్రైవర్లు చాలా సానుకూలంగా స్వీకరించారు. మరియు మేము ఈ రంగంలో మా ప్రయత్నాలను కొనసాగించనున్నాము. ఈ సంవత్సరం మరిన్ని నగరాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు ప్రణాళిక చేశాము’’ అని అన్నారు. మరోవైపు మనస్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు మోనికా కుమార్ మాట్లాడుతూ.. “బహిరంగ ప్రదేశాల్లో మహిళలు సురక్షితంగా ఉండేందుకు వారికి కావాల్సిన వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి మరింత మంది డ్రైవర్లను నిమగ్నం చేయాలని అనుకున్నాం. అందులో భాగంగా ఉబర్‌తో జెండర్ సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని విస్తరించడం మాకు సంతోషంగా ఉంది. ఈ కొత్త వర్చువల్ సెషన్లకు మంచి ఆదరణ లభిస్తుందని మేము విశ్వసిస్తున్నాము మరియు మహిళల భద్రతను పెంచడానికి మేము సహకరించగలము” అని అన్నారు.
ఈ సందర్భంగా నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ (ఎన్‌సిడబ్ల్యు) చైర్పర్సన్ రేఖా శర్మ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ... ఉబర్ ఇండియా, మనస్ ఫౌండేషన్ భాగస్వామ్యం ద్వారా డ్రైవర్లకు లింగ ఆధారిత హింస నివారణ గురించి వివరించడం, అలాగే చిత్తశుద్ధితో మరియు ఉద్దేశ్యంతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఫౌండేషన్. ఇవాళ వాళ్లు ఆన్లైన్ సెషన్ల ద్వారా డ్రైవర్లను సెన్సిటైజ్ చేసే చొరవను ప్రారంభిస్తున్నారు. ఇది మహమ్మారి తీసుకువచ్చిన ఆవిష్కరణ. ఇలాంటి వ్యక్తిగత సెషన్ల ద్వారా 63,000 మంది డ్రైవర్లకు విజయవంతంగా అవగాహన కల్పించినందుకు నేను వారిని అభినందిస్తున్నాను. అలాగే 100,000 మంది డ్రైవర్లకు అవగాహన కల్పించేలా చేపట్టిన కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో అందరికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. రవాణా పరిశ్రమకు సాధ్యమైనంత ఉత్తమమైన భద్రతా ప్రమాణాలను నిర్ణయించడానికి మరియు మహిళలకు సురక్షితమైన బహిరంగ ప్రదేశాలను అందించడంలో ఇలాంటి మార్పు చాలా దూరం తీసుకువెళ్తంది అని అన్నారు. ఇలాంటి అంశాలపై తన ప్లాట్ఫామ్లో భద్రతను పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది ఉబర్. అంతేకాకుండా తన గ్లోబల్ డ్రైవింగ్ చేంజ్ ఇన్షియేటివ్ లో భాగంగా 2022 నాటికి మహిళల భద్రత కోసం పనిచేస్తున్న సంస్థలకు 5 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. మహిళల రక్షణ కోసం ఉబర్ ఎంతో అద్భుతమైన సాంకేతికతను ఉపయోగిస్తోంది. టూ-వే ఫీడ్‌బ్యాక్, రేటింగ్స్, టెలిమాటిక్స్, జిపిఎస్ లాంటి భద్రతా ప్రమాణాలను ఉబర్ తన ప్లాట్ఫామ్లో ఉంచింది. ఇవన్నీ ప్రయాణ సమయంలో రైడర్ ఉపయోగించుకోవచ్చు. రైడర్స్ తమ ట్రిప్‌ను తమ పరిచయస్తులకు షేర్ చేసుకోవచ్చు. వారి ఫోన్ నెంబర్లను మాస్క్ చేయడం జరుగుతుంది. అలాగే డ్రైవర్లు కూడా స్క్రీనింగ్ చేయబడతారు. అంతేకాకుండా అత్యవసర సమయంలో, సేఫ్టీ టూల్కిట్లో అత్యవసర బటన్ ఉంటుంది. ఆ బటన్‌ను నొక్కడం ద్వారా రైడర్లు అధికారులతో కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే, ఉబర్ యొక్క అంకితమైన 24X7 సేఫ్టీ హెల్ప్‌లైన్ నంబర్, ప్రయాణ సమయంలో లేదా ట్రిప్ ముగిసిన 30 నిమిషాల వరకు ఉబర్ భద్రతా బృందంతో నేరుగా మాట్లాడటానికి రైడర్లను అనుమతిస్తుంది.