Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నేడు భుబనేశ్వర్, పూనె, గురుగ్రామ్ లోని తమ మూడు శిక్షణా కేంద్రాలను ఐసోలేషన్ కేంద్రాలుగా మలిచినట్లు వెల్లడించింది. ఈ కేంద్రాలలో తొలి దశ సహాయం అందించడంతో పాటుగా 24 గంటలూ నర్సులు సహాయపడటంతో పాటుగా డాక్టర్లు సైతం అందుబాటులో ఉంటారు. అవసరమైన పక్షంలో దగ్గరలోని ఆస్పత్రుల నుంచి వైద్య సహాయం కూడా లభ్యమవుతుంది. తమ ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడిన వారికి సమగ్రమైన సంరక్షణను అందించడానికి బ్యాంకు తీసుకున్న పలు చర్యలలో ఇవి ఓ భాగం.
వీటిలో భాగంగా
స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి పనిచేయడంతో పాటుగా వ్యాక్సినేషన్ శిబిరాలను ఏర్పాటుచేయడంపై పనిచేస్తుంది. వీటిలో కొన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.
దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా అపోలో, మణిపాల్, షాల్బీ, మియట్, బిల్రోత్ లాంటి ఆస్పత్రులలో వ్యాక్సినేషన్ అందించనున్నారు. దేశవ్యాప్తంగా పలు హోటల్స్తో సైతం భాగస్వామ్యం చేసుకున్నారు. ఇవి ఐసోలేషన్ సదుపాయాలు, కనీస వసతులు, ప్రాధమిక ఆరోగ్య పరీక్షలు అందిస్తాయి. అపోలో 24/7, మెడిబడ్డీ, ఫార్మ్ఈజీ యాప్స్ ద్వారా డాక్టర్లతో ఈ–కన్సల్టేషన్. ఔషదాల డెలివరీని ఫార్మ్ ఈజీ చేయనుంది.
ఈ యాప్ల ద్వారా ఎంపిక చేసుకున్న సైకాలజిస్ట్లతో ఈ–కన్సల్టేషన్
అషిమా భట్, గ్రూప్ హెడ్–సీఎస్ఆర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాట్లాడుతూ ‘‘ఈ తరహా సంక్షోభ సమయంలో మా ప్రధాన ఆందోళన మా ఉద్యోగుల సంక్షేమం గురించే ఉంది. మా ఉద్యోగులతో పాటుగా వారి ప్రియమైన వారికి అత్యుత్తమమైన రీతిలో సహాయం మరియు వైద్య సంరక్షణను అందించడం ద్వారా భరోసా అందించే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం వారి శారీరక ఆరోగ్యం పరంగా మాత్రమే కాదు ఒత్తిడిని సైతం వారు ఎదుర్కొనేలా చేస్తున్నాం. మేము పలువురు సైకాలజిస్ట్లతో కూడిన బృందాన్ని సైతం అందుబాటులో ఉంచాం. వారిని ఉద్యోగులు సంప్రదించవచ్చు. ఎందుకంటే, మా తొలి ప్రాధాన్యత ఎప్పుడూ కూడా మా సహచరుల సంక్షేమమే’’ అని అన్నారు.