Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానమైన వైద్య సామగ్రి కేటాయింపు, ప్రభుత్వాలకు చేయూత
ఢిల్లీ: ప్రస్తుతం విజృంభించిన కోవిడ్-19 కేసుల పెంపుదలతో చేసే పోరాటంలో శామ్ సంగ్ తన తోడ్పాటుగా భారతదేశానికి 5 మిలియన్ (ఐఎన్ఆర్ 37 కోట్లు) యూఎస్ డాలర్ల సహాయాన్ని వాగ్ధానం చేసింది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు కేటాయిస్తోంది. తన పౌరసత్వం చొరవల్లో భాగంగా ఆసుపత్రులకు ప్రధానమైన వైద్య సామగ్రితో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. భారతదేశంలో వివిధ భాగస్వాములతో తగిన విధంగా సంప్రదించిన తరువాత స్థానిక పరిపాలనల తక్షణ అవసరాల్ని అంచనా వేసిన తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శామ్ సంగ్ 3 మిలియన్ యూఎస్ డాలర్లని కేంద్రానికి, ఉత్తర్ ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు కూడా విరాళం చేస్తుంది.
అదనంగా, గత కొద్ది వారాలుగా సమస్యని ఎదుర్కొంటున్న ఆరోగ్య సంరక్షణ రంగానికి సహాయపడటానికి, 100 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్, 3,000 ఆక్సిజన్ సిలిండర్లు ఒక మిలియన్ ఎల్ డీఎస్ సిరంజీలతో సహా 2 మిలియన్ విలువ గల యూఎస్ డాలర్లని కేటాయిస్తుంది. ఇవి ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు కేటాయించబడతాయి. ఎల్ డీఎస్ లేదా లో డెడ్ స్పేస్ సిరంజీలు ఇంజెక్షన్ ని చేసిన తరువాత డివైజ్ లో మిగిలిన డ్రగ్ మొత్తాన్ని తక్కువ చేస్తాయి, వ్యాక్సిన్ వాడకాల్ని అనుకూలం చేస్తాయి. ఉపయోగించిన తరువాత ప్రస్తుతమున్న ఉత్పత్తులకు సిరంజ్ లో వ్యాక్సిన్ పెద్ద మొత్తంలో మిగిలుతోంది. టెక్నాలజీ 20% వరకు గొప్ప సామర్థ్యాన్ని చూపించింది. ప్రస్తుతమున్న సిరంజీలు ఒక మిలియన్ మోతాదుల్ని డెలివరీ చేయగలిగితే, ఎల్ డీఎస్ సిరంజీలు వ్యాక్సిన్ యొక్క అదే పరిమాణంతో 1.2 మిలియన్ మోతాదుల్ని అందించగలవు. ఈ సిరంజీల తయారీదారు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి శామ్ సంగ్ సహాయపడింది.
అదనంగా, తమ ప్రజల చొరవల్లో భాగంగా, వ్యాక్సిన్ మోతాదులు లభింప చేయడం ద్వారా భారతదేశంలో 50,000కి పైగా అర్హులైన ఉద్యోగులు, లబ్దిదారుల జీవితాల్ని రక్షించే లక్ష్యంతో శామ్ సంగ్ వ్యాక్సినేషన్ ఖర్చుల్ని కూడా భరిస్తుంది. దేశవ్యాపంగా ఎలక్ట్రానిక్ రీటెల్ స్టోర్స్ లో పని చేసే శామ్ సంగ్ అనుభవజ్ఞులైన కన్సల్టెంట్స్ అందరూ భాగంగా ఉన్నారు. శామ్ సంగ్ లో, ఉద్యోగి ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమాలు మాకు పూర్తి ప్రాధాన్యత. ఉద్యోగులు వారి కుటుంబాలకు సమాచారంతో సహాయపడటానికి వైద్య సరఫరాలు, ఆసుదప్రిత సదుపాయాలు మరియు హోం-కేర్ అందుబాటులో ఉంచడానికి మేము దేశవ్యాప్తంగా ఇన్-హౌస్ సదుపాయాలు, బృందాల్ని ఏర్పాటు చేసాము.
2020 ఏప్రిల్ లో, భారతదేశం మహమ్మారితో చేసే పోరాటానికి శామ్ సంగ్ ఐఎన్ఆర్ 20 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి విరాళం మరియు నోయిడాలో స్థానిక పరిపాలనకు మద్దతులు కలిసి ఉన్నాయి, కంపెనీ ఇక్కడ మహమ్మారితో పోరాడే నివారణా ఉద్యమంలో కావలసిన వేలాది నివారణా మాస్క్స్ మరియు పర్శనల్ ప్రివెంటివ్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్స్ వంటి కావలసిన వైద్య సామగ్రిని ఆసుపత్రులకు కేటాయించింది. ఈ పోరాటంలో ముందుండి నిరంతరంగా కృషి చేస్తున్న ప్రొఫెషనల్స్ అందరికీ శామ్ సంగ్ వందనం చేస్తోంది. భారతదేశంవ్యాప్తంగా ఉన్న మా ఉద్యోగులతో సహా శామ్ సంగ్ కుటుంబం మరియు మా భాగస్వాములు మరియు వారి ఉద్యోగులు ఈ కోవిడ్ -19తో చేసే పోరాటంలో కలిసికట్టుగా సహాయ, సహకారాలు అందిస్తారు.