Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ సంక్షోభ సమయంలో, ఊపిరితిత్తుల వ్యాధులు గణనీయంగా పెరిగింది. సెకండ్ వేవ్ ఎక్కువ మంది ప్రజలు ఊపిరితిత్తుల ఆరోగ్య విషయంలో తప్పుడు సమాచారంతో సతమతమవుతున్నారు. ఆస్తమా (ఉబ్బసం) పరంగా ఇది మరింత ఎక్కువగా కనబడుతుంది. ఈ వ్యాధి చుట్టూ ఇప్పుడు ఎన్నో అపోహలు కనబడుతున్నాయి. ప్రపంచ ఆస్తమా దినోత్సవ వేళ, ఆస్తమా పట్ల ఉన్న అపోహలు పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి మరియు ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు ఈ వ్యాధి బారిన పడిన వారిని ప్రోత్సహించండి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్ వెల్లడించే దాని ప్రకారం, ‘‘భారతదేశంలో దాదాపు 93 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 37 మిలియన్ల మంది అస్తమా(ఉబ్బస) రోగులు. అంతర్జాతీయంగా ఆస్తమారోగులలో 11.1% మందిని మాత్రమే భారతదేశం కలిగి ఉంది కానీ, మరణాల పరంగా మాత్రం 42% ఇక్కడే జరుగుతున్నాయి. తద్వారా ప్రపంచ ఆస్తమా రాజధానిగా భారత్ మారింది’’. ఆస్తమా గురించి డాక్టర్ మహబూబ్ ఖాన్, హెచ్ఓడి, చెస్ట్ హాస్పిటల్స్ మాట్లాడుతూ ‘‘దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధి ఆస్తమా. ఊపిరితిత్తులకు సంబంధించిన ఈ వ్యాధిలో ఊపిరితిత్తులలోని గాలి మార్గాల లో ఇన్ఫ్లమ్మేషన్ (వాపు) సంభవిస్తుంది. ఈ వాపు కారణంగా, గాలి మార్గాలు సన్నబడతాయి మరియు ఊపిరితిత్తులు పలు అలెర్జీల బారిన పడేందుకు తద్వారా అస్తమా దాడికి గురయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. దుమ్ము, జలుబు, కాలుష్యం, జుట్టు ఉన్న పెంపుడు జంతువులు, వైరస్లు, గాలి కాలుష్యకారకాలు మరియు ఆఖరకు భావోద్వేగాలు సైతం ఆస్తమా దాడికి గురి చేస్తాయి. ఈ దాడులను ఇన్హేలషన్ చికిత్స ద్వారా నివారించవచ్చు. దీనికి దీర్ఘకాలం పాటు ఔషదాలను వాడాల్సిన అవసరమూ పడవచ్చు. కొంతమంది ఈ ఔషదాలు వ్యసనంగా మారతాయని అపోహ పడుతుంటారు. ఆస్తమా పట్ల సరైన అవగాహన కల్పించడం ద్వారా ఈ అపోహలను పోగొట్టవలసిన అవసరం ఉంది’’ అని అన్నారు.
ఆస్తమా నయం కాని వ్యాధి అయినప్పటికీ, ఈ వ్యాధిని నియంత్రించడం సాధ్యమే మరియు సాధారణ చురుకైన జీవితం గడపటమూ వీలవుతుంది. కాకపోతే సరైన చికిత్స మరియు ఆస్తమా నిర్వహణ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం అత్యంత కీలకం. గినా మార్గదర్శకాలు వెల్లడించే దాని ప్రకారం ఇన్హేలషన్ చికిత్స సూచనీయం. ఆస్తమా నియంత్రించడానికి అత్యంత సురక్షితమైన మార్గమిది. అంతేకాకుండా మీ ఊపిరితిత్తులకు ఇది నేరుగా చేరుకోవడంతో పాటుగా తక్షణమే పనిచేయడమూ సాధ్యమవుతుంది. ఇన్హేలర్స్ ప్రాముఖ్యతను డాక్టర్ మహబూబ్ ఖాన్, హెచ్ఓడి, చెస్ట్ హాస్పిటల్స్ వెల్లడిస్తూ ‘‘దీర్ఘకాలం పాటు నిలిచి ఉండే దీని స్వభావం కారణంగా, ఆస్తమాకు దీర్ఘకాలం పాటు చికిత్స కూడా కావాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్తమా బారిన పడిన ఓ వ్యక్తి గడిపేందుకు ఇన్హేలర్స్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. చాలామంది రోగులు తాము వాడాల్సిన పరిమాణంలో ఔషదాలను వాడకపోవడం లేదంటే ఇన్హేలర్స్ను సరిగా వినియోగించకపోవడం జరుగుతుంది. చికిత్సను సరిగా తీసుకోకపోవడమంటే అర్ధం రోగి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు అవసరమైన అంశాలను పాటించకపోవడం. ఆస్తమా నిర్వహణకు సంబంధిచించి రోగులు తమ డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించడంతో పాటుగా ఇన్హేలర్స్ను వినియోగించాల్సి ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదించకుండా ఇన్హేలర్స్ వినియోగం ఆపరాదు’’ అని అన్నారు.
తమ రోజువారీ జీవితంలో డాక్టర్లు సాధారణంగా రోగుల వెల్లడించే అంశాల ఆధారంగా కొన్ని అపోహాలను జాబితాకరించారు. ఆ ప్రపంచ ఆస్తమా దినోత్సవ వేళ మనం ఆస్తమా మరియు ఇన్హేలర్స్ చుట్టూ ఉన్న అపోహలను పోగొట్టవలసిన అవసరం ఉంది.
అపోహ 1: ఆస్తమా ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తాయి
వాస్తవం: ఒక వ్యక్తికి ఉన్నట్లుగా మరో వ్యక్తిలో ఆస్తమా లక్షణాలు కనబడవు. డాక్టర్లు రోగులను సరిగా పరిశీలించినపిమ్మట మాత్రమే సరిగా వ్యాధిని నిర్థారించడం జరుగుతుంది.
అపోహ 2: పిల్లలు ఆస్తమాతో పోరాడగలరు
వాస్తవం: ఆస్తమా లక్షణాలు వయసుతో పాటుగా పెరుగుతాయి. ఇది జీవితకాలపు స్థితి. దీర్ఘకాలం పాటు నిలిచి ఉండే స్థితి కారణంగా, ఆస్తమాకు మరియు దీని లక్షణాలకు ఎలాంటి చికిత్స లేదు. ఇది ఏ సమయంలోఅయినా మరలా రావొచ్చు.
అపోహ 3:ఆస్తమాతో మృత్యుముఖానపడము
వాస్తవం: చికిత్సకు సరిగా కట్టుబడి ఉండకపోవడం చేత పరిస్థితులు మరింతగా దిగజారే ప్రమాదాలున్నాయి. డాక్టర్లను సంప్రదించకుండా మీ ఇన్హేలర్స్ వినియోగం ఆపడమన్నది మృత్యువుకూ దారితీయవచ్చు.
అపోహ 4: అస్తమా అంటువ్యాధి
వాస్తవం: ఆస్తమా అనేది వారసత్వ లక్షణాల కారణంగా మరియు పర్యావరణ అంశాల పరంగా రావొచ్చు. ఇది అంటువ్యాధి కాదు
అపోహ 5: ఆస్తమా అనేది వయసు మళ్లిన వారికి వచ్చే వ్యాధి
వాస్తవం: ఆస్తమా ఏ వయసు వారికి అయినా రావొచ్చు.
అపోహ 6: ఆస్తమా కలిగిన ప్రజలు వ్యాయామాలు చేయడం సురక్షితం కాదు
వాస్తవం: నిస్సారమైన జీవితం గడిపేందుకు ఆస్తమా ఎలాంటి కారణమూ కాదు. చాలామంది డాక్టర్లు తమ రోగులను చురుగ్గా ఉండాల్సిందిగా కోరుతుంటారు. చాలామంది క్రీడాకారులకు ఆస్తమా ఉంది. అయినప్పటిరీ వారు చురుకైన జీవనశైలి అనుసరిస్తున్నారు.
అపోహ7: ఇన్హేలర్స్ కు బానిసలుగా మారే ప్రమాదం ఉంది
వాస్తవం: ఇన్హేలర్స్ కు బానిసలుగా మారరు. ఆస్తమా నిర్వహణకు విస్తృతశ్రేణిలో అంగీకరించిన చికిత్సా మార్గాలుగా వీటి వినియోగం గుర్తించబడింది.
అపోహ 8: ఎలాంటి లక్షణాలు లేవంటే ఆస్తమా లేనట్లే..
వాస్తవం: లక్షణాలు లేనంత మాత్రాన ఆస్తమా లేదనడానికి అవకాశాలూ లేవు ! ఔషదాల వినియోగం అకస్మాత్తుగా ఆపేస్తే అది వ్యాధి మరింత తీవ్రతరం అయ్యేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. నిజానికి ఆస్తమా లక్షణాలు ఏ సమయంలో అయినా మరలా వచ్చేందుకు అవకాశాలున్నాయి.
ఆస్తమా నిర్వహణకు సంబంధించి చర్చను ప్రోత్సహిస్తున్నప్పుడు, ఆస్తమా రోగులకు సరైన సమాచారం అందించడం ద్వారా అవగాహన కల్పించడం మాత్రమే కాకుండా ఆస్తమా రోగులకు మద్దతునందించేలా మద్దతు వ్యవస్థను సైతం సామాన్య ప్రజానీకం సృష్టించేలా అవగాహన కల్పించడం ద్వారా ప్రత్యక్షంగా ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ప్రతిధ్వనించేలా చేయాల్సి ఉంది. ఆస్తమా లాంటి దీర్ఘకాలిక వ్యాధులలో నిరంతరం అవగాహనను మెరుగుపరచడం కీలకం. వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.