Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ నెలలో అంతా ఎంతగానో ఎదురుచూసిన షోలలో ఒకటి, సోనీ లైవ్ తదుపరి ఒరిజినల్ మహారాణి భారీ తారాగణంతో రూపుదిద్దుకుంది. హుమా ఖురేషి, అమిత్ సియల్, సోహమ్ షా ముఖ్యపాత్రల్లో నటించారు. రాణి భారతి (హుమా ఖురేషి) జీవితం గురించి, రాత్రికి రాత్రి ఆమె జీవితం ఎలా మారిపోయిందో ఈ క థ తెలియజేస్తుంది. ఆమె భర్త (సోహమ్ షా పోషించిన పాత్ర) చేసిన ఓ ప్రకటన అందుకు కారణమైంది. ఆ ప్రకటన యావత్ రాష్ట్ర రాజకీయ యంత్రాంగాన్ని కుదిపివేసింది. వారసుడి గురించి ఆయన చేసే ప్రకటన గురించి పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా ఆత్రంగా ఎదురుచూస్తుంటే, సీఎం హఠాత్ ప్రకటన ఆయన భార్య తో సహా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఆశయాలను సాధించాలనే తపన, లొంగిపోని సామర్థ్యాలను ప్రతిఫలిస్తుంది మహారాణి. ఇలాంటి శక్తి వంతమైన కథ లో శక్తివంతులైన కళాకారులు నటించారు.
భీమ భారతి – సోహమ్ షా
భీమ చిన్నతనం నుంచి అంటరానితనానికి, అణచివేతకు గురై ఉంటాడు. తనకు ఎదురైన ప్రతికూలత లన్నిటినీ అధిగమించి, సమసమాజం నిర్మించాలన్న తపనతో రాజకీయాల్లోకి చేరుతాడు. సత్తారూఢ్ జన్ శక్తి పార్టీ లో ఎదిగిపోయి బిహార్ లో ఆధిపత్యం సాధిస్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఆయన తన వారసుడిని ప్రకటించాల్సి వస్తుంది. ఆ పదవిని ఎవరు స్వీకరిస్తారు? ఆయన నిర్ణయం ఏమిటి? అది ఆట నిబంధనలను ఎలా మార్చివేస్తుంది? మరింత మిస్టరీ కోసం చూడండి.
నవీన్ కుమార్ – అమిత్ సియల్
సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. కచ్చితంగా ఉండే వ్యక్తి. వాదనలు పెట్టుకుంటూ ఉంటాడు. ఇదీ ఈ షో లో నవీన్ కుమార్ పాత్ర. మంచి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నవీన్, ఆయన అభిమానించే జయప్రకాశ్ నారాయణ అడగడంతో ఆయన పార్టీలో చేరుతాడు. రాజకీయాల్లో తన ధోరణితో ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పటికీ, భీమా ఆకర్షణ, సాధారణ ప్రజానీకంతో అనుబంధం ఆయనకు ఇబ్బంది కరంగా మారుతుంది. ఆయన ఎప్పుడూ బిహార్ తదుపరి ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. భీమా అకస్మాత్తు నిర్ణయం ఆయన జీవితం, రాజకీయ ఆకాంక్షలు నిలిచిపోయేలా చేస్తుంది. మరి ఆయన ఆ తరువాత ఏం చేస్తాడు ? అమిత్ సియాల్ ఇటీవలే ఖాట్మండు కనెక్షన్ లో తన నటనకు గాను ప్ర శంసలు పొందాడు. అది ఇప్పుడు సోనీ లైవ్ లో ప్రసారమవుతోంది. కరణ్ శర్మ దీనికి దర్శకత్వం వహించారు. సుభాష్ కపూర్ రూపకర్త. ఈ షో లో ప్రమోద్ పాఠక్, కానికు శృతి, వినీత్ కుమార్ తదితరులు ఇందులో నటించారు. బిహార్ రాజకీయాల ఆధారంగా రూపుదిద్దు కున్న ఈ ఫిక్షన్ సిరీస్ సోనీ లైవ్ లో మే నెలలో విడుదల కానుంది.