Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అనూరాధ యువ ఎథికల్ హ్యాకర్. అల్జీమర్స్‌తో సమస్య ఎదుర్కొంటున్న తన తండ్రికి చికిత్స చేయించేందుకు, ఆయన పేరిట ఉన్న ఇంటిని విక్రయించే విషయంలో ఆమె సతమతం అవుతూ ఉంటుంది. ఒక రాత్రి వారి జీవితాల్లో నాటకీయ మలుపులు చోటు చేసుకుంటాయి: అదే ఇంట్లో ఒక అపరిచిత మహిళ మృతదేహం పక్కన అనూరాధ తన తండ్రి గణేశన్ ఉండటాన్ని చూస్తుంది. ప్రముఖ క్రైమ్ నవలా రచయిత గణేశన్ అసహజ ప్రవర్తనతో పాటు అన్ని సాక్ష్యాలు ఆయనకు వ్యతిరేకంగానే ఉంటాయి. ఈ హత్య వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు తనంతట తాను ముందుకు వచ్చిన అనూరాధకు పరిశోధనలో ముందుకు వెళుతున్న కొద్దీ దిగ్భ్రాంతితో కూడిన నిజాలు తెలుస్తాయి. హతురాలు ఎవరు మరియు గణేశన్ ఈ దారుణమైన నేరాన్ని ఎందుకు చేశారు? రచయితే హంతకుడా, లేదా అతను నిజంగా హత్య చేయలేదని ఆయన కుమార్తె నిరూపించగలదా?
ఈ హత్య కేసును డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి తన తదుపరి హాట్‌స్టార్ స్పెషల్ - నవంబర్ స్టోరీ - క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండగా, ఈ దారుణ హత్య వెనుక ఉన్న షాకింగ్ అంశాలను ఆవిష్కరించనుంది. నటి తమన్నా భాటియా తన బహుముఖ ప్రతిభను ఈ సిరీస్‌లో ప్రదర్శించింది. అనారాధ అనే ఎథికల్ హ్యాకర్ చిత్తశుద్ధితో ఈ గందరగోళంతో కూడిన ఈ కేసును పరిష్కరించేందుకు మరియు తన తండ్రిని కాపాడుకోవాలన్న తపనతో ముందుకు వస్తుంది. హత్య వెనుక ఉన్న రహస్యాన్ని ఆమె ఛేదించి తండ్రిని రక్షించుకుంటుందా? ఇది 7-ఎపిసోడ్ల హూ డన్ఇట్ కథనం కాగా, నవంబర్ స్టోరీ సిరీస్‌లో హత్య వెనుక ఉన్న వాస్తవాలను వెల్లడి చేసే ఫ్రేమ్‌లలో ఫ్లాష్‌బ్యాక్‌లు ఉంటాయి మరియు పలు స్థాయిల్లో కథ, కథనం కొనసాగుతూ ఉంటుంది. రామ్ సుబ్రమణియన్ దర్శకత్వం వహించగా, ఆనంద వికటన్ గ్రూప్ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో పశుపతి, జి.ఎం.కుమార్, అరుళ్దాస్ మరియు వివేక్ ప్రసన్న తదితర నటులు ఉన్నారు. డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో ఈ మే 20 నుంచి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నవంబర్ స్టోరీ విడుదల అవుతోంది.
నటి తమన్నా భాటియా మాట్లాడుతూ, “అనూరాధ ఒక యువ, స్వతంత్ర, నిర్భయమైన మరియు తెలివైన యువతి. దారుణమైన హత్య కేసులో ఇరుక్కున్న తన తండ్రికి శిక్ష పడకుండా రక్షించేందుకు ఆమె ప్రయత్నిస్తూ ఉంటుంది. కథకు హీరో లాంటి కీలకమైన, బలమైన స్త్రీ పాత్రను పోషించడం నా కెరీర్లో గుర్తుంచుకోదగ్గ, నాకు చాలా సంతోషకరమైన అనుభవాన్ని అందించిన పాత్రల్లో ఇదీ ఒకటి. వినూత్నమైన కథాంశం మరియు ప్రత్యేకమైన కథనంతో, నవంబర్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, హత్య చుట్టూ ఉన్న రహస్యం బహిర్గతమయ్యే వరకు ప్రేక్షకుల్లో ఉత్కంఠ కొనసాగేలా చేస్తుందని’’ అన్నారు.
దర్శకుడు రామ్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, “నవంబర్ స్టోరీ ఒక క్లాసిక్ మర్డర్ మిస్టరీ కాగా, ఇక్కడ నేరం వెనుక సత్యాన్ని కనుగొనాలనే తపన, దాని వెనుక దాగిన వాస్తవాలను ఈ సిరీస్ వెల్లడిస్తుంది. కథాంశం మరియు అది ప్రాణం పోసుకున్న విధానం రెండింటిలోనూ, తెలుగు ప్రేక్షకులను వారు గతంలో మాదిరిగా కాకుండా, విలక్షణమైన క్రైమ్ థ్రిల్లర్‌గా చూపించాలని మేము కోరుకున్నాము. నటీనటులందరూ అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించారు మరియు డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి దీన్ని హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల చేయడం ఈ సిరీస్‌కు అదనపు ప్రయోజనం కాగా, ప్రత్యేకమైన థీమ్ మరియు శైలి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందని నేను విశ్వసిస్తున్నాను మరియు స్తున్నానని’’ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వికటన్‌కు చెందిన శ్రీనివాసన్.బి, మాట్లాడుతూ ‘‘ఓటీటీ కోసం వికటన్ మొట్ట మొదటి ప్రొడక్షన్‌గా రూపొందించిన నవంబర్ స్టోరీలో ఒక బలవమైన కథనం ఉండగా, తమన్నా, జి.ఎం.కుమార్ మరియు పసుపతి తదితర టాలెంటెడ్ నటులు ఇందులో నటించారు. అనూరాధ పాత్రను పోషించేందుకు తమన్నా తనను తాను పూర్తిగా మలుచుకుంది. గణేశన్ పాత్రలో జి.ఎం.కుమార్ ప్రతి సందర్భంలోనూ విలక్షణంగా కనిపిస్తూ, ప్రేక్షకుల ఊహలకు అతీతంగా కనిపిస్తారు. ఏసు పాత్రలో పశుపతి తన జీవితకాల నటనానుభవ ప్రదర్శనతో ఈ షోను అత్యద్భుతంగా రక్తికట్టించారు. మొదటిసారి ధారావాహికను రచించి, దర్శకత్వం వహించిన రామ్, మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠతో మలుపులు తీసుకునే కథను రూపొందించగా, అది ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా వీక్షించేలా చేస్తుంది. సుమారుగా 4 ఏళ్ల పాటు కథ రూపకల్పన, చిత్రీకరణ చేసుకున్న నవంబర్ స్టోరీ గౌరవం, పట్టుదల, పోరాటంతో విజయాన్ని సాధించవచ్చని ప్రేక్షకులకు తెలియజేస్తుందని’’ వివరించారు.
సారాంశం
అల్జీమర్స్‌తో బాధపడుతున్న గణేశన్ ఒక ప్రసిద్ధ క్రైమ్ నవలా రచయిత. ఎథికల్ హ్యాకర్ అయిన తన కుమార్తె అనూరాధతో కలిసి ఉంటారు. తాము అమ్మకానికి ఉంచిన ఇంట్లో నవంబర్ 16న, పెయింట్ పూసిన ఒక మహిళ మృతదేహం పక్కన తన తండ్రి ఉండటాన్ని చూస్తుంది. పోలీసులు అక్కడకు చేరుకునే సరికి, అన్ని సాక్ష్యాలు గణేశన్‌కు వ్యతిరేకంగానే కనిపిస్తాయి. అతని కుమార్తె తన తండ్రి నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు మరియు సత్యాన్ని ఆవిష్కరించేందుకు ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. హతురాలికి సంబంధించిన వాస్తవ కథను ఆమె తెలుసుకుంటుందా లేదా ఆమె తన తండ్రికి శిక్ష పడకుండా కాపాడుకుంటుందా? లేదా, అల్జీమర్స్ రోగే ఆ హత్య చేసి ఉంటాడా?