Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యునైటెడ్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా యునైటెడ్ హెల్త్ గ్రూప్ (ఎన్వైఎస్ఈః యుఎన్హెచ్) 1 మిలియన్ డాలర్ల(7.4 కోట్ల రూపాయలు)ను భారతదేశంలో వృద్ధి చెందుతున్న కరోనా వైరస్ సంక్షోభ నివారణకు అందిస్తున్నట్లు వెల్లడించింది. కోవిడ్–19 కేసులు మరియు మరణాలు రికార్డుస్థాయిలో పెరుగుతుండటం చేత ప్రస్తుతం భయంకరమైన అత్యవసర ఆరోగ్య స్ధితిని భారతదేశం ఎదుర్కొంటుంది. కోవిడ్–19తో పోరాడాలనే కంపెనీ యొక్క అంతర్జాతీయ నిబద్ధతకు కొనసాగింపు ఈ విరాళం. గతంలో భారతదేశానికి 1.5 మిలియన్ డాలర్ల (11 కోట్ల రూపాయలు) విరాళం అందించింది.
ఈ విరాళం ద్వారా 2500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సమకూర్చుకోవడంతో పాటుగా భారతదేశంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత సమస్యను అధిగమించడంలో తోడ్పడనున్నారు. అలాగే తీవ్రంగా కోవిడ్–19 వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న వారికి అవసరమైన క్లిష్టమైన యంత్రసామాగ్రిని సైతం అందించనున్నారు. ఈ గ్రాంట్‌ను యుఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ తో పాటుగా దీని అనుబంధ ఫౌండేషన్ యుఎస్–ఇండియా ఫ్రెండ్షిప్ అలయెన్స్ ద్వారా చేశారు. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లును భారతదేశపు ప్రణాళికా విభాగం నీతి ఆయోగ్‌కు అందించనున్నారు. తద్వారా ఎక్కడైతే గణనీయమైన అవసరాలు ఉంటాయో అక్కడకు వీటిని తరలించగలరనే భరోసా కలుగుతుంది.
‘‘కోవిడ్–19 మహమ్మారి ఆరంభమైన నాటి నుంచి యునైటెడ్ హెల్త్ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న చోట కమ్యూనిటీలపై మహమ్మారి ప్రభావం తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నాలను కొనసాగించడానికి కట్టుబడి ఉంది. అదే సమయంలో తమ బృంద సభ్యుల భద్రత మరియు సంక్షేమానికి భరోసా అందించే రీతిలో వనరులు మరియు మద్దతు సైతం అందిస్తుంది’’ అని లౌరా సియావోలా, అధ్యక్షులు– ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్, యునైటెడ్ హెల్త్ గ్రూప్ బిజినెస్ అన్నారు. ‘‘కోవిడ్–19 యొక్క వినాశకరమైన ప్రభావం ఎదుర్కోవడానికి అత్యంత కీలకమైన వైద్య యంత్ర సామాగ్రి మరియు సరఫరాలను భారతదేశపు ఆరోగ్య సంరక్షణ నిపుణులకు అందించడం ద్వారా అత్యవసరమైన ఉపశమనాన్ని ఈ అదనపు తోడ్పాటు అందిస్తుంది’’ అని అన్నారు.
- నగదు తోడ్పాటుతో పాటుగా భారతదేశంలో యునైటెడ్ హెల్త్ గ్రూప్ యొక్క ఉపశమన ప్రయత్నాలు
- ఆరోగ్య మరియు భద్రతా కిట్స్‌ను ఏర్పాటుచేసేందుకు మరియు కోవిడ్–19 పరీక్షా సరఫరాలను అందించేందుకు
- బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, హైదరాబాద్, ముంబై, నోయిడాలలోని ఆప్టమ్ బృంద సభ్యులకు మద్దతునందించేందుకు
- టెలి హెల్త్ ప్రాప్యత విస్తరించడం ద్వారా బృంద సహచరులు మరింతగా తక్షణ మరియు సౌకర్యవంతమైన మరియు వైద్య కన్సల్టేషన్స్ పొందేందుకు తోడ్పడతాయి.
అంతర్జాతీయంగా ప్రభావితమైన కమ్యూనిటీలకు మద్దతునందించడంతో పాటుగా కోవిడ్–19తో పోరాడేందుకు తోడ్పాటునందించడానికి 100 మిలియన్ డాలర్లను అందిస్తామనే యునైటెడ్ హెల్త్ గ్రూప్ యొక్క నిబద్ధతలో భాగం తాజా ఈ తోడ్పాటు. ఈ కంపెనీ గతంలో 1.5 మిలియన్ డాలర్లను భారతదేశానికి అందించింది. తద్వారా ఆరోగ్య సంరక్షణ కార్మికులు, తీవ్రంగా ప్రభావితమైన మరియు పౌర సేవలను అందుకోలేని ప్రజలు, సీనియర్ సిటిజన్లు మరియు గృహ వసతి మరియు ఆహార భద్రత లేని ప్రజలతో పాటుగా యంత్ర సామాగ్రి కొరత ఎదుర్కొంటున్న ప్రభుత్వ ల్యాబ్‌లు సహా దేశంలో బాగా ప్రభావితమైన కమ్యూనిటీలకు తక్షణ సహాయం అందించింది.