Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మరియు కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బ్రాండ్ శాంసంగ్ ఇప్పుడు తమ బిక్స్బీ3.0 అప్డేట్లో భారతీయ ఆంగ్లంను భాగంగా చేసినట్లు వెల్లడించింది. 2017లో బిక్స్బీని ఆవిష్కరించిన నాటి నుంచి యూజర్లకు తెలివైన వాయిస్ అసిస్టెంట్ నుంచి ఓపెన్, స్కేలబల్ ఏఐ ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఇది ఎక్కడైనా, ఏ సమయంలో అయినా విభిన్నమైన మొబైల్ ఉపకరణాలు, వేరబల్స్ మరియు డిజిటల్ అప్లయెన్సెస్‌పై లభ్యమవుతుంది. వినియోగదారుల అనుభవాలను మెరుగుపరుచుకునేందుకు మరియు బిక్స్బీ ఫీచర్లను మరింత అర్థవంతంగా మార్చేందుకు, భారతీయులకు అనువుగా రూపొందించేందుకు శాంసంగ్ ఇప్పుడు భారతీయ ఆంగ్లంకు మద్దతునందించే రీతిలో బిక్స్బీని శాంసంగ్ తీర్చిదిద్దిది. బిక్స్బీ 3.0లో భాగంగా ఈ అప్డేట్స్ చేసింది. ఈ నూతన వెర్షన్ బిక్స్బీ ద్వారా రోజువారీ అవసరాలను మెరుగైన, అభివృద్ధి చేసిన భారతీయ ఆంగ్ల అవతార్ ద్వారా నియంత్రించవచ్చు.
బిక్స్బీ ఇప్పుడు భారతీయ పేర్లు, ప్రదేశాలు,సంబంధాలు, కంటెంట్ మరియు రెసిపీలను అర్థం చేసుకుంటుంది. బిక్స్బీ ఇప్పుడు వినియోగదారులకు పలు అంశాల పట్ల సహాయాన్ని రోజంతా అందిస్తుంది. ఉదాహరణకు మీ రోజువారీ యోగా రొటీన్‌కు టైమర్‌ను సెట్ చేసుకోవడం చేయవచ్చు. అలాగే బెంగళూరులో వాతావరణం పరిశీలించవచ్చు. ‘కాల్ మా’ లేదా ‘బావా’ అంటూ మీ పని చేసుకుంటూ అనొచ్చు. మీ పాకశాస్త్ర ప్రావీణ్యం ను చికెన్ టిక్కా మసాలా రెసీపీ తెలుసుకుని మెరుగుపరుచుకోవచ్చు. దీపావళి చిత్రాలను మీ స్మార్ట్‌ఫోన్‌లో వెదకడం మరియు ఇంకెన్నో చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా బిక్స్బీని అడగడమే ! మీరు సౌకర్యవంతంగా మీ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను మీ టెలివిజన్ సెట్‌కు అతి సులభమైన వాయిస్ కమాండ్ అయినటువంటి ‘హాయ్ బిక్స్బీ, షో బెంగళూరు వెకేషన్ ఫోటోస్ ఆన్ టీవీ’ అంటే సరిపోతుంది.
‘‘శాంసంగ్ వద్ద మా ప్రయత్నమెప్పుడూ కూడా అసౌకర్యం లేని అనుభవాలను మా వినియోగదారులకు విప్లవాత్మక సాంకేతికత ద్వారా అందించడం. తాజా అప్డేట్, భారతీయ ఆంగ్లంకు బిక్స్బీ3.0లో మద్దతును తీసుకువస్తుంది తద్వారా మా లక్ష్యానికి ఓ అడుగు చేరువచేస్తుంది. భారతదేశంలో మహోన్నతమైన వంటకాల చరిత్ర ఉంది. అందువల్ల బిక్స్బీ విభిన్నమైన స్వరాలను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉండటంతో పాటుగా దేశవ్యాప్తంగా స్థానిక మాండలీకాలను సైతం అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాం. బెంగళూరు, ఢిల్లీ, నోయిడాలలోని మా వైవిధ్యమెన బృందం భారతదేశంలో వీలైనన్ని ఎక్కువగా ఆంగ్లంలో మాట్లాడే తీరులను గుర్తించే విధంగా దీనిని రూపొందించారు’’ గిరిధర్ జక్కీ, సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్, వాయిస్ ఇంటిలిజెన్స్ టీమ్, శాంసంగ్ ఆర్ అండ్ డీ బెంగళూరు అన్నారు.
గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై పలు సెట్టింగ్స్, ఫీచర్లను నియంత్రించే అవకాశాన్ని బిక్స్బీ అందిస్తుంది. తద్వారా దీనిని మృదువుగా, వేగంగా మారుస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాపై స్లో మోషన్ వీడియోను వీరు ఆరంభించవచ్చు, ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ అయిపోతుంటే పవర్ సేవింగ్ మోడ్‌ను ఆరంభించవచ్చు అలాగే చివరగా అందుకున్న కాల్‌ను కాంటాక్ట్‌గా సేవ్ చేసుకోవచ్చు, మొబైల్ హాట్‌స్పాట్‌ను ఆన్ చేసుకోవడం లేదా డౌన్లోడ్స్ ఫోల్డర్‌ను తెరువడం వంటి అంశాలన్నీ కూడా కేవలం ఒక్క వాయిస్ కమాండ్‌తో చేయవచ్చు. వినియోగదారులు ఆఖరకు బిక్స్బీని పార్కింగ్ లొకేషన్లో తమ వాహనం ఉంచిన స్థానాన్ని గుర్తించుకోమని కూడా కోరవచ్చు. తద్వారా అతి సులభంగా ఆ ప్రదేశాన్నీ గుర్తించవచ్చు. భారతీయ ఆంగ్ల మద్దతుతో బిక్స్బీ ప్రస్తుతం ప్రతిష్టాత్మక గెలాక్సీ ఎస్ 21 సిరీస్ తో పాటుగా ఇటీవలనే ఆవిష్కరించిన గెలాక్సీ ఏ52 మరియు గెలాక్సీ ఏ72 స్మార్ట్ఫోన్లలో లభ్యమవుతుంది. భారతీయ ఆంగ్ల వెర్షన్ త్వరలోనే గెలాక్సీ ఫోల్డ్, గెలాక్సీ ఎస్ 20 సిరీస్ మరియు గెలాక్సీ నోట్ 20 సిరీస్‌తో సహా ఇతర ఉపకరణాలలో సైతం లభ్యం కానుంది.
ఇది ఎలా పనిచేస్తుంది ?
· ప్రస్తుత బిక్స్బీ వినియోగదారులు తమ సపోర్టెడ్ ఉపకరణాలలోని తమ బిక్స్బీ యాప్ స్ర్కీన్ పై భాగంలో ఓ బ్యానర్‌ను చూడవచ్చు.ఈ బ్యానర్‌పై క్లిక్ చేయడంతో తమ ఉపకరణాలపై భారతీయ ఆంగ్లంను ఉపయోగించడం ఆరంభించవచ్చు
· నూతన బిక్స్బీ వినియోగదారులు ఖచ్చితంగా భారతీయ ఆంగ్లంను తమ సపోర్టెడ్ ఉపకరణాలపై బిక్బ్సీని సెట్ చేసుకునే సమయంలో ఎంచుకోవాలి.