Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశపు సుప్రసిద్ధ స్టాండలోన్ ఆరోగ్య భీమా సంస్థలలో ఒకటైన మ్యాక్స్‌బూపా నేడు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్లాన్– సీనియర్ ఫస్ట్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. సీనియర్లకు తమ గోల్డెన్ ఇయర్స్‌లో ఎలాంటి నిబంధనలూ లేని మద్దతు, సంరక్షణను అందించే రీతిలో దీనిని డిజైన్ చేశారు. సీనియర్ ఫస్ట్ ప్లాన్‌లో 25 లక్షల రూపాయల వరకూ కవరేజీ అవకాశాలు ఉంటాయి. సాధారణ ఆరోగ్య సమస్యలైనటువంటి క్యాటరాక్ట్, కీళ్ల మార్పిడి వంటి అంశాలపై ఎలాంటి ఉప పరిమితులూ లేవు. సీనియర్ సిటిజన్లు ప్రస్తుతం ఆరోగ్య భీమా కొనుగోళ్లలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సహాయపడటంతో పాటుగా అతి సులభంగా పాలసీ జారీ చేయడంలోనూ తోడ్పడుతుంది. సీనియర్ ఫస్ట్ ప్లాన్ పలు ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. దీనిలో తప్పనిసరిగా పాలసీ జారీకి ముందుచేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఉండవు. తొలి రోజు నుంచే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటుగా ఎలాంటి అసౌకర్యం లేని క్లెయిమ్లనూ చేసుకోవచ్చు.
సీనియర్ ఫస్ట్ పాలసీలో అత్యంత ఆకర్షణీయమైన అంశం రీఅస్యూర్ బెనిఫిట్. ఇది తొలి క్లెయిమ్తోనే ఆరంభమవుతుంది. అపరిమిత సమ్ ఇన్స్యూర్డ్ ప్రయోజనమూ కలిగిస్తుంది. పాలసీ సంవత్సరంలో ఎన్ని క్లెయిమ్‌లను అయినా పాలసీదారు చేసుకోవచ్చు.
సీనియర్ ఫస్ట్ పాలసీ ఆవిష్కరణ సందర్భంగా మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ అండ్ సీఈవొ శ్రీ కృష్ణన్ రామచంద్రన్ మాట్లాడుతూ ‘‘సీనియర్ సిటిజన్ల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించే పాలసీల లభ్యత లోపాన్ని పూరించే రీతిలో మా సీనియర్ ఫస్ట్ పాలసీ రూపొందించాం. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లు ఆరోగ్య భీమా కొనుగోలు వేళ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీనిలో తప్పనిసరి వైద్య పరీక్షలు మొదలు, ముందుగా ఉన్న అనారోగ్య స్థితుల కారణంగా పాలసీని తిరస్కరించడం, అధిక ప్రీమియం, తగినంతగా కవరేజీ ఇవ్వకపోవడం, అత్యధిక కో–పే చెల్లింపులు వంటివి ఉన్నాయి. సీనియర్ ఫస్ట్ పాలసీని సీనియర్ల వైద్యఅవసరాలకు తగినట్లుగా జాగ్రత్తగా తీర్చిదిద్దాము. ఈ పాలసీ ఎంచుకున్న వారికి ఆర్థిక పరంగా భారం ఉండదనే భరోసాను అందిస్తున్నాం’’ అని అన్నారు. మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్, ప్రొడక్ట్స్, అండర్‌రైటింగ్ అండ్ క్లెయిమ్స్–డైరెక్టర్,డాక్టర్ భబుతోష్ మిశ్రా మాట్లాడుతూ ‘‘ఆరోగ్య పరంగా తీవ్రంగా ప్రభావితమయ్యే వారిలో సీనియర్ సిటిజన్లు ముందు వరుసలో ఉంటారు. ఆ వయసులో స్థిరమైన ఆదాయం ఆగిపోవడం కారణంగా చాలామంది ఆరోగ్య పరంగా రాజీపడుతుంటారు. ఈ సీనియర్ ఫస్ట్ ప్లాన్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు కోవిడ్–19 సహా అన్ని రకాల అనారోగ్యాలకూ సమగ్రమైన కవరేజీిని అందిస్తుంది..’’ అని అన్నారు. మ్యాక్స్ బూపా సీనియర్ ఫస్ట్ ప్లాన్ ఇప్పుడు గోల్డ్, ప్లాటినమ్ శ్రేణిలో 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల శ్రేణిలో లభిస్తుంది.