Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలను కచ్చితమైన వనరులతో అనుసంధానం అయ్యేందుకు అలాగే కొవిడ్—19కు సంబంధించిన వాస్తవం కాని సమాచారాన్ని అడ్డుకునేందుకు శ్రమిస్తున్నాము. మా కమ్యూనిటీ స్టాండర్డ్స్ లేదా ప్రకటన విధానాలను ఉల్లంఘించే ఖాతాలు మరియు కంటెంట్‌ను తొలగించేందుకు; తప్పు సమాచారం మరియు అబద్ధపు పోస్టులను తగ్గించేందుకు మరియు ప్రజలు తాము చూసే పోస్టులను చూసే సందర్భాన్ని అందించేందుకు మేము గణనీయంగా పెట్టుబడులు పెట్టాము. దీనితో ప్రజలు ఏమి చదవాలి, దేన్ని విశ్వసించాలి మరియు పంచుకోవాలో నిర్ణయించుకునేందుకు అవకాశం కలుగుతుంది.
మహమ్మారి సమయంలో మనం ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్ మరియు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కొవిడ్-19కు సంబంధించి ఆమోదిత టీకాల గురించి అవాస్తవాలతో కూడిన 12 మిలియన్ల మేర హానికారకమైన, తప్పుడు సమాచారాన్ని తొలగించాము. ఫేస్బుక్ తర్డ్-పార్టీ ఫ్యాక్ట్ చెకర్ల నుంచి 167 మిలియన్ పోస్టులపై ఇది అబద్ధం అనే లేబుళ్లను వేసి ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రజలు ఈ హెచ్చరిక గుర్తులను చూసినప్పుడు 95% వారు బేసిక్ సమాచారాన్ని వీక్షించేందుకు ఆసక్తి చూపించరు.
మేము ప్రజలకు వారు ఆన్లైన్లో వీక్షించే సమాచారం గురించి అర్హమైన తీర్మానాలను తీసుకునేందుకు మేము ప్రజలకు పరికరాలను అందించే దిశలో ఉన్నాము. ఈ ప్రయత్నానికి మద్ధతు ఇచ్చే దిశలో రానున్న వారాల్లో మేము భారతదేశంలో కొవిడ్-19కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ఎల గుర్తించాలో శిక్షణ మరియు సమాచారాన్ని అందించేందుకు నూతన జాగృతి అభియాన్ నిర్వహిస్తుండగా, దీనితో వారు అధీకృతమైన మూలం www.mygov.in/covid-19/లో ఇక్కడ పరీక్షించుకునేలా ఉత్తేజన పొందుతారు. మేము కొవిడ్-19 సంబంధించిన తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సులభమైన 6 టిప్స్ అభివృద్ధి చేశాము. ఈ టిప్స్‌ను ఫేస్బుక్ వరుస ప్రకటనల ద్వారా ప్రదర్శించనుంది మరియు ఇది ప్రత్యేకమైన మైక్రోసైట్ www.fightcovidmisinfo.com/india/కు లింక్ అందిస్తుంది. ఈ వెబ్సైట్ మరియు ప్రకటనల ద్వారా మేము ప్రజలకు ఈ దిగువ పేర్కొన్న వాటిని ఉత్తేజిస్తున్నాము-
1. కేవలం శీర్షిక మాత్రమే కాకుండా, పూర్తి సమాచారాన్ని పొందండి
2. విశ్వసనీయమైన మూలం కోసం చూడండి
3. వాస్తవాలను పంచుకోండి, వదంతులను కాదు
4. విశ్వసనీయమైన మూలం నుంచి పూర్తి సందర్భం గురించి తెలుసుకోండి.
5. బంధుమిత్రులు తప్పుడు సమాచారాన్ని షేర్ చేసినప్పుడు వారికి తెలియజేయండి
6. షేర్ చేసే ముందు ఆలోచించండి
ఈ ప్రచార జాగృతి, వెబ్‌సైట్‌ను ఇంగ్లీషు అలాగే హిందీ, తమిళం, తెలుగు, ఒరియా, మలయాళం, మరాఠీ, కన్నడ, గుజరాతి మరియు బెంగాలీతో కలిపి 9 భారతీయ భాషల్లో నిర్వహించనుంది. కొవిడ్-19 గురించి కచ్చితమైన మరియు విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే దిశలో మేము చేస్తున్న ప్రయత్నాల్లో భాగగా ఫేస్బుక్ దేశంలోని అగ్రగామి వైద్యుల భాగస్వామ్యంలో ఒక అభియాన్ ప్రారంభించింది. ఈ అభియాన్ 12 వీడియోల సిరీస్ కాగా, అందులో వైద్యులు కొవిడ్-19 గురించి ప్రతి ఒక్కరూ సాధారణంగా అడిగే ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ వీడియో సిరీస్- #డాక్టర్కిసునో- https://www.facebook.com/FacebookIndia ఇక్కడ అందుబాటులో ఉంటుంది. దీనిలో బాలల్లో కొవిడ్-19, మధుమేహం మరియు కొవిడ్-19 మరియు కొవిడ్-19తో ఎదురయ్యే మానసిక ఆరోగ్య సమస్యలు తదితర ప్రముఖ అంశాలను కలిగి ఉంది.
ఈ కొవిడ్-19 మహమ్మారి, దానికి ఆవల మేము భాగస్వాములతో పని చేయడాన్ని కొనసాగిస్తున్నాము మరియు సముదాయానికి తప్పుడు సమాచారాన్ని చేర్చకుండా అడ్డుకుంటామని ధృవీకరిస్తున్నాము. వారు ఆన్లైన్లో చూసే కంటెంట్‌ను గుర్తించేందుకు మరియు సవాలు చేసేందుకు అలాగే తమ బంధుమిత్రులతో సామాజిక మాధ్యమాల్లో కచ్చితమైన సమాచారాన్ని పంచుకునుందుకు మేము వారికి అవసరమైన వనరులను అందిస్తున్నాము.