Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: మనం ఆడుతున్న అన్ని ఆటల్లో,లుడో అంటే నేటి సమూహాలకు ఎక్కువ అభిమానం. ఇది అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుండగా, మీ స్నేహితులు విసిరే పాచికతోఎదురుగా ఉన్న శత్రువులను మార్చే అవకాశం అనేది ఇది ఆట కన్నా ఎక్కువ అనుభూతిని అందిస్తుంది. బోర్డ్ గేమ్స్ శ్రేణి విస్తృతంగా ఉన్నప్పటికీ, లుడో ఆటను గెలిచేందుకు చేసే వ్యూహరచనతో వచ్చే ఆనందానికి మరేదీ సాటిరాదు. లాక్డౌన్ సమయంలో లుడో చక్కని ఆదరాభిమానాలను దక్కించుకుంది. మనం ఇల్లు అనే గూడుకే పరిమితమైనప్పుడు, మన పావులను గెలిపించుకునేందుకు వర్చ్యువల్ విధానాన్ని అనుసరించాము. ఇప్పుడు, దీన్ని అప్‌గ్రేడ్ చేసుకోవలసిన సమయం. వరుసగా 7 ఏళ్లు బాలల బ్రాండ్, ఈ విభాగంలో నాయకుడైన నికెలోడియన్ను గూగుల్ ఇండియా సహకారంతోతిరిగి తీసుకు వస్తుండగా, మీకు ఇష్టమైన నిక్టూన్స్ పెగ్స్ మరియు వాటితో హ్యాండ్స్-ఫ్రీగా ఆడేందుకు వినూత్న ఫార్మాట్ అయిన నికెలోడియన్ లుడోను మీ ముందుకు తెస్తుంది. వినేందుకు ఇది అద్భుతంగా అనిపిస్తుంది కదా?
నికెలోడియన్, గూగుల్ కలిసి ఏళ్లతరబడి యువ మనస్సులను ఆకర్షిస్తూ, నిక్టూన్స్పై అభిమానం మరియు ప్రజాదరణ పెంపొందించుకునేందుకు సహకరించాయి మరియు బాలలకు అత్యంత ఇష్టమైన పాత్రల ద్వారా లుడోపై వ్యామోహాన్ని మరింత పెంచుకునేలా చేసే ప్రయత్నాలతో, ఆటను మరింత సరదాగా, రంజుగా చేస్తోంది. తమకు సౌకర్యంగా ఉండే పరికరంపై, తమ స్వరంతోనే లుడో ఆడేందుకు ఇది వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ క్లాసిక్ గేమ్‌కు గూగుల్ నుంచిఒక రకమైన వర్ణాన్ని జోడిస్తే, మీరు గూగుల్ నుంచి కొద్దిగా వాయిస్ సహకారంతో నికెలోడియన్ను మొదటిసారి వినూత్నంగా ఆడగలుగుతారు. ఈ ఆటలో నాలుగు హౌస్‌లు మరియు ప్రతి ఒక్కరికీ రెండు పావులు మాత్రమే ఉంటాయి. ప్రతి హౌస్‌లోని పావులపై మీకు ఇష్టమైన నిక్టూన్ల ముఖాలు ఉంటాయి మరియు మీరు చేయాల్సిందల్లా ‘ఒకే గూగుల్, టాక్ టూ నికెలోడియన్ లుడో’ అని చెబితే సరిపోతుంది. ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులతో ఉన్న జట్లకు మోటు-పట్లూ, మరియు రుద్ర రంగీలా అని పేరు మార్చబడుతుంది, బ్లూ మరియు ఎల్లోలకు వరుసగా శివ-రేవా మరియు హ్యాపీ-పినాకి అని పేరు పెట్టబడుతుంది.
ఉత్సాహంతో కొనసాగే ఆటలో, మీకు ఇష్టమైన నిక్టూన్ల స్వరంలోమాటలు వినిపిస్తాయి. ఆట ప్రారంభించిన తర్వాత, నికెలోడియన్ లుడో తన వినియోగదారులకు క్లాసిక్ బోర్డ్‌తో పోల్చితే, తన ఆధునిక, సరికొత్త డిజైన్‌తో, రిఫ్రెష్ లుక్‌తో మరియు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఒకే ఆటగాడు 4 మంది స్నేహితులు కలిసి ఒకే చోట ఈ ఆటను చేతులు పెట్టకుండా ఆడవచ్చు. నాలుగుకు బదులుగా రెండు పావుల ఫార్మాట్, మీ స్నేహితులతో తిరిగి అనుసంధానం అయ్యేందుకు మీకు అవకాశం ఇస్తుంది. బాండ్ మరియు మీరు వేగవంతమైన ఆట కోసం మీరు ఆసక్తి చూపితే దానికి తగినట్లు మీకు సహాయపడుతుంది! నికెలోడియన్ లుడో ఆంగ్ల భాషలో, వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉంటుంది.
సరికొత్త ఈ ప్రయత్నం గురించి వయాకామ్ 18కిడ్స్ టీవీ నెట్వర్క్ మార్కెటింగ్ హెడ్ సోనాలి భట్టాచార్య మాట్లాడుతూ “నికెలోడియన్‌లో మేము కొత్తదనాన్ని అందించాలన్న శాశ్వత స్ఫూర్తితో, సాటిలేని బహుళ టచ్పాయింట్ల ద్వారా ప్రత్యేకమైన మరియు లీనమయ్యే అనుభవాలను అందించడం ద్వారా మా యువ ప్రేక్షకులతో మమేకం అయ్యేందుకు ప్రతిసారీ ప్రయత్నిస్తూ వస్తున్నాము. గూగుల్‌తో ఈ అనుబంధం ఒకే రకమైన ఆలోచలు ఉన్న భాగస్వాములతో మమేకం అయ్యేందుకు మరియు మీడియా &ఎంటర్టెయిన్మెంట్ ఎకోసిస్టమ్‌లోని విభిన్న అంశాలను ఆస్వాదించేందుకు ఒక వేదికను సృష్టించే దశద్వారా, వారిని తమ అభిమాన నిక్టూన్లతో సరదా ప్రపంచానికి ప్రయాణించేందుకు సహకరిస్తుందని’’ వివరించారు. ఈ ప్రయత్నాన్ని మరింత విస్తరించేందుకు అనుగుణంగా ఈ క్యాంపెయిన్‌ను అన్ని స్క్రీన్ల ద్వారా బాలలను చేరుకునేందుకు అంది వచ్చిన అన్ని అవకాశాలను అంటే, బ్రాండ్ నిర్వహించే యూట్యూబ్, ఆన్-ఎయిర్ ప్రసారం మరియు డిజిటల్ మాధ్యమాలను వినియోగించుకుంటుంది. నికెలోడియన్ ఫ్రాంచైజ్ ఛానెళ్లలో ప్రసారమయ్యే ప్రమోషన్ల నుంచి నికెలోడియన్ ఫ్రాంచైజ్ సోషల్ మీడియా మరియు గేమింగ్ ప్లాట్‌ఫారాలపై బలమైన డిజిటల్ ప్లాన్ వరకు క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. నికెలోడియన్ లుడోను ఆసక్తిగా కొనసాగించేందుకు మరియు వారి దృష్టిని ఆకట్టుకునేందుకు ఛానెల్‌కు ఉన్న విస్తృతమైన ఇన్ఫ్లూయెన్సర్ ప్రమోషన్ మరియు డిజిటల్ ఎంగేజ్‌మెంట్‌ను ఉత్తేజకరమైన కార్యకలాపాలను రూపొందించింది.
కనుక, ఎక్కువ డౌన్లోడ్లు, ఎక్కువ ఇన్స్టాలేషన్లు లేవు. కేవలం తమ స్వరంతో, వినియోగదారులు ‘‘ఓకే గూగుల్, టాక్ టూ నికెలోడియన్ లుడో’’ అని చెప్పడం ద్వారా ఆట ఆడవచ్చు. అభిమానులు ఈ ఆటను ప్రయత్నించడానికి ఇదే ఒక చక్కని కారణంగా నిలువనుంది!