Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సిరీస్ మహారాణి ని మే 28 నుంచి ప్రసారం చేసేందుకు సోనీ లై వ్ అంతా సిద్ధం చేసుకుంది. సరిగ్గా ఈ సమయంలోనే దీని నిర్మాతలు హుమా ఖురేషి కి సంబంధిం చి మరో ఆకర్షణీయమైన, ఆసక్తిని రేపే లుక్ ను విడుదల చేశారు. టీజర్ తో ఇంటర్నెట్ లో వచ్చిన తుపాను అనంతరం, ముఖ్యమంత్రిగా హుమా కనిపించే తీరు ఎంతో ఆకర్షణీయంగా రూపొందించబ డింది.
ముఖ్యమంత్రిగా కనిపించేలా హుమా తన పాత్రకు అవసరమైన సరైన హుందాతనానికి ప్రతీకగా డార్క్ షేడ్ చీరలు, వాటికి తగ్గ షాల్స్ తో కనిపిస్తారు. నల్లటి కాటుక కళ్లు, ఎర్రటి బొట్టుతో హుమా ఆ పాత్రలో జీవించారు. తన పాత్రకు పరిపూర్ణ న్యాయం చేశారు.
ముఖ్యమంత్రి తన లుక్ గురించి హుమా ఖురేషి మాట్లాడుతూ, ‘‘నాకెంతో ఉద్వేగంగా ఉంది. ఈ షో ఎప్పుడు ప్రసారమవుతుందా అని చూస్తున్నాను. టీజర్ కు ఎంతో చక్కటి స్పందన వచ్చింది. ఈ షో మొత్తాన్ని వీక్షకులు ఆనందిస్తారని నేను కచ్చితంగా చెప్పగలను. రాణి భారతి పాత్రను పోషించ డం ఎంతో కష్టం. ఆమెలో ఎన్నో ఛాయలు ఉంటాయి. అంతేకాదు...ఆ పాత్రకు ఎంతో గౌరవం కూడా ఉంటుంది. ఆ పాత్రను ఆవహింపజేసుకునేందుకు మేం ఎన్నో లుక్స్ ప్రయత్నించాం. ఆమె జీవితం లోని దశలను అర్థం చేసుకునేందుకు అవి తోడ్పడ్డాయి’’ అని అన్నారు.
నిరక్షరాస్యురాలైనప్పటికీ ఊక నుంచి బియ్యాన్ని వేరు చేయగల సామర్థ్యం ఆమెకు ఉంది. అణకువ కలిగిఉన్న వ్యక్తే అయినప్పటికీ, కుటుంబానికి ప్రమాదం పొంచిఉన్నప్పుడు మాత్రం పోరాటం చేసేం దుకు సిద్ధంగా ఉంటారు. భిన్న వ్యక్తిత్వాలతో కనిపించే మహిళ రాణి భారతి. ఆమె భర్త తీసుకున్న ఓ నిర్ణయంతో ఆమె జీవితం తలకిందులవుతుంది. పాలు పితకడం, పిడకలు చేయడం నుంచి కష్టాల్లో తన కుటుంబానికి అండగా నిలవడం దాకా ఆమె ముందున్నది అంతా కూడా విచ్చుకు నేందుకు సిద్ధంగా ఉన్న మార్మికతనే. మరి రాణి ఈ కష్టాలను ఈదగలరా ? కరణ్ శర్మ దర్శకత్వంలో సుభాష్ కపూర్ చే రూపొందించబడి న ఈ షో లో సోహమ్ షా, అమిత్ సియల్, వినీత్ కుమార్ తదితరులు నటించారు. నరేన్ కుమార్, డింపుల్ ఖార్బాందా నిర్మించారు. ఫిక్షన్ గా రూపొందించబడిన మహారాణి సోనీ లైవ్ లో మే 28న ప్రసారం కానుంది