Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాహుల్ కష్ణ, ప్రియాంక నోముల జంటగా రూపొందిన చిత్రం 'అగ్రజీత'. సందీప్ రాజ్ దర్శకత్వంలో సందీప్ రాజ్ ఫిలిమ్స్, వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇదొక భిన్నమైన కథ. ఒక జీవి మరణం అనంతరం తన జ్ఞాపకాలను అణువు ద్వారా మరో జీవిలోకి వెళ్లే ఒక శాస్త్రీయ కథ. ఈ చిత్రం ఆద్యంతం ఆస్ట్రేలియా దేశంలోని గ్రేట్ ఓషన్ రోడ్, రెడ్ వుడ్ అడవుల్లో, మంచు ప్రదేశాలైన మౌంట్ బుల్లర్ వంటి మరెన్నో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీలో చిత్ర యూనిట్ మీడియాతో సమావేశమైంది. ఈ సందర్బంగా హీరోయిన్ ప్రియాంక నోముల మాట్లాడుతూ, 'దర్శకుడు సందీప్ లేకపోతే ఈ సినిమా లేదు. కథ అందించిన కష్ణగారు సైంటిఫిక్ రీసెర్చ్ చేసారు. సినిమా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా హిట్ అవుతుంది' అని చెప్పారు. 'ఇది నా మొదటి సినిమా. నన్ను నమ్మి సందీప్ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓ మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని హీరో రాహుల్ కష్ణ అన్నారు.
కథ అందించిన కష్ణ రెడ్డి లోక మాట్లాడుతూ, 'ఈ సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. సినిమా అద్భుతంగా వస్తోంది' అని తెలిపారు.
'షూటింగ్‌కి ముందు చిన్న సినిమాగా చేద్దాం అనుకున్నాం. కానీ స్క్రిప్ట్ బాగా వచ్చింది. దీంతో గ్రాండ్‌గా తెరకెక్కించాం. జులైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని దర్శకుడు సందీప్ రాజ్ చెప్పారు.
వాసవి త్రివేది ప్రొడక్షన్స్ అధినేతలు మాట్లాడుతూ, 'ఎంతో ప్రతిభగల నటీనటులు, సాంకేతిక నిపుణులు మా చిత్రానికి పని చేశారు. వారందరి శ్రమ, ప్రతిభతో ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది' అని తెలిపారు.