Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫ్యూచర్ జెనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్జిఐఎల్ఐ) కొత్తగా మనీ బ్యాక్ సూపర్ ప్లాన్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇది సంప్రదాయ నాన్ పార్టిస్పేటింగ్ మనీ బ్యాక్ ప్లాన్ అని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిలో ఏకమొత్తంలో మెచ్యూరిటీ సమయంలో నగదు అవకాశంతో పాటుగా పాలసీ కాలంలో అత్యధిక మనీ బ్యాక్ సైతం పొందే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మనీ బ్యాక్ను సైతం ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్ అంటూ మూడు విభాగాల నుంచి ఎంచుకునే అవకాశాలున్నాయని తెలిపింది. వీటిని 6, 8, 10 ఏళ్ల కాల పరిమితితో అందిస్తుంది.