Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెజాన్ కంపెనీ సిఇఒ పదవి నుంచి ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్ తప్పుకోనున్నారు. జూలై 5 న అధికారికంగా ఈ పదవిని వీడనున్నారు. సరిగ్గా సంస్థను స్థాపించిన 27 ఏళ్ల తర్వాత పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకోబోతున్నారు. నూతన సిఇఒగా జెఫ్ సలహాదారు అయిన ఆండీ జెస్సీ నియమితులు కానున్నారు. కాగా.. బెజోస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొనసాగుతారు. జెఫ్ బెజోస్ ఇంటర్నెట్తో పుస్తకాలను విక్రయించడం ద్వారా అమెజాన్ సంస్థను జెఫ్ బెజోస్ 27 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఎర్త్ ఫండ్, బ్లూ ఆరిజిన్ స్పేస్ షిప్ కంపెనీ, అమెజాన్ డే వన్ ఫండ్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి ఇతర వెంచర్లపై దష్టి పెట్టాలని యోచిస్తోన్నారు.