Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మెక్ డొనాల్డ్స్ లోకి బీటీఎస్ మీల్ వచ్చే వరకు మనం రోజులు లెక్కబెట్టుకుంటూ వచ్చాం. మెక్ డోనాల్డ్స్ దక్షిణ కొరియా వంటకాల నుంచి పొందిన స్ఫూర్తితో రూపొందిన ఈ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ఆర్డర్ – 10 – పీస్ చికెన్ మెక్ నుగెట్స్, మీడియం వరల్డ్ ఫేమస్ ఫ్రైస్, మీడియం కోక్, స్వీట్ చిల్లీ, కాజున్ డిప్పింగ్ సాసెస్ –పశ్చిమ, దక్షిణ భారతదేశంలో జూన్ 4 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ లోగా ఆ వినోదాన్ని ముందుగానే ఆనందిద్దాం. ఈ అంతర్జాతీయ సహకారాన్ని మరింత ప్రత్యేకమైన, ఆహ్లాదకరంగా చేయడానికి, ప్రత్యేకమైన BTS X మెక్డొనాల్డ్ యొక్క వస్తువులు ఇప్పుడు భారతదేశంలోని అభిమానులందరికీ వీవర్స్ షాప్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి.ఈ హెడ్ – టు – టో కలెక్షన్ బీటీఎస్ మీల్ నుంచి ఎంపిక చేయబడిన మెనూ ఐటమ్స్ నుంచి పొందిన స్ఫూర్తితో రూపుదిద్దుకుంది. హూడీస్, పర్పుల్ బాత్ రోబ్స్, సాక్స్, సాండల్స్ వంటి డైనమెట్ త్రెడ్స్ వీటిలో ఉన్నాయి. ప్రతీ ఒక్క బీటీఎస్ సభ్యుడి కోసం ఏడు ఫ్రైలతో కూడిన మెక్ డొనాల్డ్స్ ఫ్రై బాక్స్ లోగో కావచ్చు లేదా మెక్ డొనాల్డ్స్ రెడ్ అండ్ గోల్డ్ తోబీటీఎస్ పర్పుల్ కలయిక కావచ్చు, ఈ డిజైన్లు అభిమానులు ఎంతగానో మెచ్చుకునే రెండు బ్రాండ్ల ఐకానిక్ భాగస్వామ్యానికి పరిపూర్ణంగా ప్రాతినిథ్యం వహిస్తాయి. అభిమానులు అనువర్తనాన్ని సందర్శించవచ్చు, బ్రౌజింగ్ ప్రారంభించవచ్చు మరియు ఆన్లైన్ స్టోర్ నుండి నేరుగా తమ అభిమాన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మీరు ఇప్పుడేWeverse Shop యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని షాపింగ్ ప్రారంభించండి.
మెక్ డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ అండ్ సౌత్) మార్కెటింగ్ &కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అరవింద్ ఆర్పీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘పశ్చిమ, దక్షిణ భారతదేశంలో మా మొదటి సెలెబ్రెటీ సిగ్నేచర్ ఆర్డర్ రాక కోసం మా కస్టమర్లు, సిబ్బంది ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. ఈ కొలాబ్రేషన్ మరో వారం దూరంలోనే ఉండడం మాకెంతో ఆనందం కలిగిస్తోంది’’ అని అన్నారు. ‘‘మా అతిథులు బీటీఎస్ మీల్ ను మరియు ఎక్స్ క్లూజివ్ మెర్చ్ లైన్ నుంచి తమ అభిమాన పీసెస్ ను ఆనందించడాన్ని మించిన ఆనందం మరొకటి మా కు ఉండదు’’ అని అన్నారు. ఈ బ్రాండ్ నూతన సింగిల్ ‘బట్టర్’ ను చాటిచెబుతూ మెక్ డొనాల్డ్స్ నూతన కమర్షియల్ ను కూడా విడుదల చేసింది.
పశ్చిమ, దక్షిణ భారతదేశంలో కొనుగోలుదారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2021 జూన్ 4 నుంచి జులై 4 దాకా డెలివరీ, డైన్ ఇన్, టేకవుట్, ఆన్ ది గో వంటిమా మల్టిపుల్ చానల్స్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. అంతర్జాతీయంగా సుమారుగా 50 మార్కెట్లకు వస్తున్న బీటీఎస్ మీల్ కు తోడుగా ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు త్వరలోనే మెక్ డొనాల్డ్స్ ఫేవరేట్స్ ను ఆనందించవచ్చు. ఆయా మార్కెట్ల వివరాలు, మీల్ లభ్యత తేదీలను ఇక్కడ పొందవచ్చు.
వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్:
వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ లిమిటెడ్ (బీఎస్ఈ: 505533)(డబ్ల్యూడీఎల్) తన అనుబంధ సంస్థ హార్డ్ క్యాజిల్ రెస్టారెంట్స్ ప్రై.లి. (హెచ్ఆర్ పిఎల్) ద్వారా భారతదేశంలో క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల (క్యూఎస్ఆర్)ను నెలకొల్పుతూ నిర్వహిస్తోంది. ఈ కంపెనీ పశ్చిమ, దక్షిణ భారతదేశంలో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ల చెయిన్ ను నిర్వహిస్తోంది. మెక్ డొనాల్డ్స్ భారతీయ అనుబంధ సంస్థ ద్వారా మెక్ డొనాల్డ్స్ కార్పొరేషన్ యూఎస్ఏ తో ఫ్రాంచైజీ అనుబంధం కలిగిఉంది.
హార్డ్ క్యాజిల్ రెస్టారెంట్ల గురించి:
హెచ్ఆర్ పిఎల్ అనేది భారతదేశ పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్లు సొంతంగా నెలకొల్పేందుకు, నిర్వహించేందుకు హక్కులు కలిగిఉన్న మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైజీ. 1996లో స్థాపితమైన నాటి నుంచి ఈ ప్రాంతంలో ఫ్రాంచైజీగా ఉంది. హెచ్ఆర్ పిఎల్ ఏటా 200 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలందిస్తోంది. తెలంగాణ, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 42 నగరాల్లో ఇది 305 (2021 మార్చి 31నాటికి) రెస్టారెంట్లను కలిగిఉంది. 10,000 మందికి ఉపాధిని కల్పిస్తోంది. మెక్ డొనాల్డ్స్ వివిధ ఫార్మాట్స్ మరియు బ్రాండ్ ఎక్స్ టెన్షన్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్టాండ్ అలోన్ రెస్టారెంట్లు, డ్రైవ్ – త్రూస్, 24/7, మెక్ డెలివరీ, మెక్ బ్రేక్ ఫాస్ట్, డెజర్ట్ కియోస్క్ లు లాంటివి వీటిలో ఉన్నాయి. బర్గర్లు, ఫింగర్ ఫుడ్స్, రాప్స్, రైస్, సలాడ్స్, హాట్ అండ్ కోల్డ్ బీవరేజెస్లతో పాటుగా విస్తృత శ్రేణి డెజర్ట్స్ దీని మెనూలో ఉన్నాయి. పలు మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్లు ఇన్ హౌస్ మెక్ కెఫె ను కలిగిఉంటాయి. హెచ్ఆర్ పిఎల్ నిర్వహించే ప్రతీ రెస్టారెంట్ లోనూ – నాణ్యం, సేవ, పరిశుభ్రత, విలువ- అనే మెక్ డొనాల్డ్స్ వ్యవస్థ మూలస్తంభాలను కలిగిఉంటాయి.