Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఊపిరితిత్తుల వ్యాధులతో సహా బహుళ దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణాలుగా నిలిచే అంశాలలో పొగాకు వినియోగం ఒకటిగా నిలుస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1.35 లక్షల మరణాలకు పొగాకు కారణమవుతుందని అంచనా. గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వే ఇండియా(2016–17) గణాంకాల ప్రకారం దాదాపు 267 మిలియన్ల మంది పెద్దలు (15 సంవత్సరాలకు పైబడిన వయసు కలిగిన వారు) అంటే భారతదేశంలో మొత్తం పెద్దలలో 29%మంది పొగాకు వినియోగిస్తున్నారు. అదే అధ్యయనం భారతదేశంలో ప్రతి 8 మందిలో ఒకరు (15–24 సంవత్సరాల వయసు నడుమ) ఏదో ఒక రూపంలో పొగాకు వినియోగిస్తున్నారని కూడా వెల్లడించింది.
సీఓపీడీకి అత్యంత ప్రమాదకారకంగా ధూమపానం నిలుస్తుంది. వాస్తవానికి చిన్నతనంలో పొగను పీల్చడం వల్ల కూడా భవిష్యత్లో సీఓపీడీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా శ్వాస హాస్పిటల్లో ఎలర్జీ, ఆస్తమా విభాగాలలో సీనియర్ కన్సల్టెంట్ గా సేవలనందిస్తోన్న డాక్టర్ విష్ణు ఎన్ రావు పొగాకు వినియోగం మరియు శ్వాస సంబంధిత సమస్యల నడుమ సంబంధాన్ని నొక్కి చెప్పారు. పొగాకు వినియోగం పరంగా సిగిరెట్ కాల్చడం ఎక్కువగా కనిపిస్తుంది. పొగాకు వినియోగం, దానిని వదిలించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన తెలుపుతూ ధూమపానంను ఎంత చిన్న వయసులో ప్రారంభిస్తే, అంతే త్వరగా వారి ఊపిరితిత్తుల పనితీరు కూడా తగ్గుతుంది. ఒకవేళ సీఓపీడీ లాంటి శ్వాస సంబంధిత వ్యాధులు ఉంటే ధూమపానంతో వాటి పనితీరు మరింతగా క్షీణిస్తుంది. అదృష్టవశాత్తు ధూమపానం మానేయడంతో పాటుగా డాక్టర్ల సూచనలను అనుసరిస్తే ఆస్పత్రిలో చేరే అవకాశాలు తగ్గుతాయి. ఎంత త్వరగా ధూమపానానికి దూరంగా ఉంటే, అంత త్వరగా వ్యాధిని నియంత్రించుకోవడంతో పాటుగా ఊపిరితిత్తులు మరింతగా పాడవకుండా కాపాడుకోవచ్చు’’ అని అన్నారు.
ఆయనే మాట్లాడుతూ ‘‘ఒకవేళ మీకు సీఓపీడీ ఉంటే, ధూమపానంకు దూరంగా అంటే ఆఖరకు పాసివ్ స్మోక్కు కూడా దూరంగా ఉండటం ద్వారా ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు. ధూమపాన అలవాటు వదిలించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఆ విషయం తెలియజేయడంతో పాటుగా మీరు పొగతాగేలా ప్రోత్సహించే అంశాలు, ప్రజలకు దూరంగా ఉండాలి. అలాగే అవసరమైతే మీ డాక్టర్ సహాయమూ తీసుకోవచ్చు’’ అని అన్నారు. ఎవరైనా ధూమపాన అలవాటు లేదంటే పొగాకు ఉత్పత్తుల వినియోగానికి దూరంగా ఉండవచ్చు. ప్రజలు ధూమపానానికి దూరంగా ఉండేలా సహాయపడే పలు మార్గాలు, కార్యక్రమాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు అయితే ఔషదాలు, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరఫీ, సపోర్ట్ గ్రూప్స్ లేదా కౌన్సిలింగ్ ద్వారా ఈ అలవాటు మానుకోవడంలో సహాయపడగలరు. అవసరమైనప్పుడు సరైన సహాయం పొందడం అత్యంత కీలకం.