Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సుదీర్ఘమైన లాక్డౌన్ కారణంగా పలు పరీక్షల కోసం సిద్ధమవుతున్న మరియు విదేశాలలో విద్యనభ్యసించేందుకు వెళ్లాలనుకున్న ఎంతోమంది విద్యార్థుల ప్రణాళికలపై తీవ్ర ప్రభావాన్ని కోవిడ్-19 చూపిందని వెల్లడించడంలో ఎలాంటి సందేహమూ లేదు. కోవిడ్ ఉ19 కబంద హస్తాలలో ప్రపంచం చిక్కుకుని, మనమంతా ఇళ్లకే పరిమితమైన వేళ విద్యార్థుల ప్రిపరేషన్‌కు మద్దతును అందించడం కోసం పియర్సన్ స్థిరంగా కృషి చేస్తూనే ఉంది. ఈ వాతావరణం దృష్టిలో ఉంచుకుని పియర్సన్ వద్ద తాము పలు కార్యక్రమాలను ఆరంభించాం. వీటిలో పిమర్సన్ క్లాస్రూమ్ ఒకటి. అధిక విలువ కలిగిన ఇంగ్లీష్ పరీక్ష కోసం పూర్తి ఆన్లైన్ టీచర్ ఆధారిత విద్యార్థి విజయ వేదిక ఇది. ఇనిస్టిట్యూట్లు, టీచర్లు, విద్యార్థులు మరియు అడ్మిన్స్ట్రేటర్లకు మద్దతునందించే రీతిలో పియర్సన్ క్లాస్‌రూమ్‌ను తీర్చిదిద్దాము. దీనికి ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, నమ్మకమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ప్రిపరేషన్ కంపెనీ, ఈ2 లాంగ్వేజ్ తగిన సహకారాన్ని అందిస్తుంది. ఈ వేదిక ఇప్పుడు 900కు పైగా ప్రాక్టీస్ ప్రశ్నలు, 250 గంటలకు పైగా టీచింగ్ కంటెంట్ ను అత్యాధునిక వేదిక ద్వారా అందిస్తుంది. విదేశాలలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు, పరీక్షలలో మెరుగ్గా మార్కులను పొందేందుకు తమ భాషా ప్రావీణ్యతను మెరుగుపరుచుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. విదేశాలలో విద్యనభ్యసించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు, పీటీఈగా పిలువబడుతున్న పూర్తిగా ఏఐ మరియు కంప్యూటర్ ఆధారిత ఆంగ్ల భాషా ప్రావీణ్యత పరీక్షను అందించడం ద్వారా పియర్సన్ మద్దతునందిస్తుంది. ఈ టెస్ట్ సెషన్స్ విద్యార్థుల కోసం సంవత్సరమంతా అందుబాటులో ఉంటాయి మరియు పరీక్షను ఎంచుకున్న 24 గంటల లోపుగానే అవి బుక్ చేసుకునేందుకు లభ్యమవుతాయి. ఢిల్లీలోని ఐఆర్సీసీ మద్దతునందిస్తుండటం వల్ల, విద్యార్థులు వేగవంతంగా తమ టెస్ట్ స్కోర్లను ఐఆర్సీసీ మరియు వేగవంతంగా వీసా ప్రాసెసింగ్ కోసం అనుమతించిన వారి ఇనిస్టిట్యూట్లకు పంపవచ్చు.
గత సంవత్సరం పియర్సన్ ఇండియా నీట్ విద్యార్ధులకు తమ మద్దతును అందించనున్నట్లు వెల్లడించింది. దీనికోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా ఆన్లైన్ రిమోట్ ప్రొక్టోర్డ్ టెస్ట్ ను మై ఇన్సైట్స్ నీట్ ఆన్లైన్ టెస్ట్‌సిరీస్ పేరిట విడుదల చేసింది. ఈ టెస్ట్ సిరీస్ మూడు ఆల్ ఇండియా నాన్ఉప్రోక్టోర్డ్ పరీక్షలను నీట్ సిలబస్, ఒక పూర్తిస్థాయి పరీక్షను గ్రేడ్ 11 సిలబస్ మరియు నీట్ 2019 సంవత్సర పేపర్‌ను సమాధానాలతో సహా అందిస్తుంది. ఈ మైఇన్సైట్స్ టెస్ట్ సిరీస్‌ను విద్యార్థులు నిర్మాణాత్మకంగా పరీక్షలకు సంసిద్ధం కావడంలో సహాయపడేందుకు లక్ష్యంగా చేసుకున్నారు. దీనిద్వారా నీట్ సంబంధిత స్కోర్స్‌తో తమ ప్రయత్నాలకు సంబంధించి తక్షణ నివేదికలనూ పొందవచ్చు.
వీటితో పాటుగా పియర్సన్ ఇటీవలనే ఓ యాప్‌ను (ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్) యుపీఓస్సీ కోసం సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం విడుదల చేసింది. ఇది సమ్మిళిత అబ్యాస అనుభవాలను విద్యార్థులకు అందించడంతో పాటుగా అభ్యాస అంశాలను వినూత్నమైన బిట్ సైజ్ ఫార్మాట్లో తీసుకువస్తుంది. ఇది ఔత్సాహికులకు ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ కోసం సుప్రసిద్ధ కంటెంట్ క్రియేటర్లతో పియర్సన్ ఇండియా భాగస్వామ్యం చేసుకుని ఔత్సాహికులకు అవసరమైన వనరులను ఉచితంగానే అందిస్తుంది.
ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రస్తుత సంక్షోభ కాలంలో వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు మద్దతునందించేందుకు ఉపయోగపడుతున్నాయి మరియు ఈ సంక్షోభం మరికొంత కాలం కొనసాగే అవకాశాలు ఉన్నందున వారికి మద్దతునందించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాము.
2. మహమ్మారి కారణంగా వచ్చిన నిబంధనలు మరియు లాక్డౌన్ల కారణంగా గత కొద్ది నెలలుగా మీరు గమనించిన గణనీయమైన మార్పులు ఏమిటి?
కోవిడ్-19 మహమ్మారి మొత్తం విద్యావ్యవస్థపైనే గణనీయమైన ప్రభావం చూపింది, అదే సమయంలో ఈఉలెర్నింగ్, డిజిటల్ మాధ్యమాల సామర్థ్యమూ వెల్లడించింది. ఆన్లైన్ విద్య ఇప్పుడు ప్రధాన స్రవంతిగా మారింది. మా పియర్సన్ గ్లోబల్ లెర్నర్ సర్వే వెల్లడించిన దాని ప్రకారం, ప్రస్తుత కాలంలో అభ్యాసకులు తమ విద్య కోసం వర్ట్యువల్ , డిజిటల్ మార్గాలకు ప్రాధాన్యతనివ్వడం గణనీయంగా పెరిగింది.
నూతన నైపుణ్యాలను సంతరించుకోవడంపై దృష్టి సారించడం కూడా ఇటీవలి కాలంలో పెరిగింది. ప్రస్తుత వాతావరణంలో ఇది అత్యంత కీలకమైనది. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్ ఇప్పుడు మరింత ప్రాక్టికల్, అభ్యాస అనుభవాల కోసం వృత్తి విద్యా కోర్సులు, శిక్షణల వైపు చూస్తున్నారు. వీటితో పాటుగా ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఆసక్తి ప్రదర్శిస్తున్న మరో అంశం రిమోట్ ప్రోక్టోరింగ్ స్పేస్. విద్యార్థులు తమ ఇంటి వద్దనుంచే పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించే యంత్రాంగం ఇది. మోసం లేదంటే ఇతర రకాలుగా దుష్ప్రవర్తనలు జరిగే అవకాశాలను ఇది తొలగించి ప్రామాణికతను నిర్ధారిస్తుంది. ఈ సంక్షోభ సమయంలో విద్యార్థులతో పాటుగా విద్యావేత్తలు అతి క్లిష్టమైన అవసరంగా దీనిని భావిస్తున్నారు మరియు భవిష్యత్‌లో ఇది సంభావ్య ట్రెండ్‌గా కొనసాగే అవకాశాలూ ఉన్నాయి. విద్యార్థుల కోసం నీట్ పరీక్షలను పరీక్షల తరహా ర్యాంకులను అందిస్తూ అఖిల భారత స్థాయిలో మా మొట్టమొదటి పరీక్షను నిర్వహించాం. దేశవ్యాప్తంగా 100కు పైగా ఇనిస్టిట్యూట్ల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తమ సంసిద్ధతను తెలుసుకోవడంతో పాటుగా తమ బలాలు, మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు, ప్రభావవంతంగా పరీక్షలకు సిద్ధం కావాల్సిన ఆవశ్యకతను తెలుసుకోవడంలో ఇది వారికి సహాయపడింది.
అదనంగా, విద్యార్థులకు ఉపయుక్తమైన, ఉద్యోగ సంబంధిత నైపుణ్యాలను అందించేందుకు, కాలేజీలు మరియు పాఠశాలల్లో బీటీఈసీగా సుపరిచితమైన అంతర్జాతీయ అర్హతలను సైతం మేము అందిస్తున్నాం. దీనిద్వారా మరింతగా అభ్యసించేందుకు లేదా ఉద్యోగం కోసం అభ్యాసకులు అవసరమైన జ్ఞానం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని పొందగలరు.
సెకండ్ వేవ్ విజృంభణతో, విద్యా వ్యవస్థ ఇప్పుడు తగినట్లుగా సిద్ధమయ్యేందుకు తగిన ప్రయత్నాలను చేస్తుంది. గత సంవత్సర కాలంగా ఏదైతే మనమంతా చూస్తున్నామో అది అధిక శాతం మంది ప్రజలకు టీకా వేసేంత వరకూ పునరావృతం అవుతూనే ఉంటుంది. పియర్సన్ ఇండియా ఇప్పుడు సమ్మిళిత పరిష్కారాలను తీసుకురావడంపై దృష్టి సారించింది. ఆఫ్‌లైన్ మరియు ఆన్లైన్ పరిష్కారాల సమ్మిళితంగా ఇవి ఉండటంతో పాటుగా ఇవి ప్రభావవంతంగా ఉంటాయని భావించడం జరుగుతుంది. ఇలా జరిగేందుకు పూర్తిగా నిష్ణాతుల బృందాన్ని ఏర్పాటుచేశాం. వీరు నిరంతరం పనిచేస్తూ ఆ తరహా ఉత్పత్తులు, వేదికలను అభ్యాసకుల కోసం అందిస్తారు.
3. ఇటీవలి కాలంలో మీరు విద్యకు సంబంధించి పరిశీలించిన విదేశీ ధోరణులను గురించి వివరించగలరా?
ఇతర రంగాలు లేదా పరిశ్రమల్లాగానే విద్యారంగం కూడా మహమ్మారి కారణంగా గణనీయంగా ప్రభావితమైంది. విదేశీ విద్యా సంవత్సరాన్ని దాదాపు ఓ సంవత్సరం పాటు నిలుపుదల చేసింది. అయితే, ప్రస్తుత వాతావరణంలో, యువతరం మాత్రం ఈ అంశాల పట్ల కూడా సానుకూలంగానే ఉంది. పియర్సన్ చేసిన ఓ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, 91% మంది విద్యార్థులు ఇప్పటికీ విదేశాలలో విద్యనభ్యసించేందుకు ఆసక్తిగా ఉన్నారు. తమకు అనుమతులు వచ్చిన వెంటనే వెళ్లిపోవాలనీ కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే పలు ప్రయాణ ఆంక్షలు, విదేశీ విమానాల రద్దు కొనసాగుతుంది. గత కొద్ది వారాలుగా పెరుగుతున్న కోవిడ్ కేసులు కూడా దీనికి కారణం. యుకె, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు నిత్యం ప్రయాణ పరిస్థితులను సమీక్షిస్తున్నాయి మరియు వీలైనంతగా ఈ ప్రక్రియలను సౌకర్యవంతంగా మలిచేందుకు భరోసా అందిస్తున్నాయి.
ఎంతోమంది భారతీయ విద్యార్థులకు ప్రాధాన్యతా విద్యా కేంద్రంగా కెనడా వెలుగొందుతుంది. కెనడా యొక్క అంతర్జాతీయ విద్యా రంగానికి అతి పెద్ద తోడ్పాటుదారునిగా ఇండియా వెలుగొందుతుంది. యునెస్కో వెల్లడించే దాని ప్రకారం, 2018లో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్ధులు విద్య నభ్యసిస్తుంటే వారిలో 7,50,000 మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు. యుకె సైతం అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటుండటంతో పాటుగా విదేశీ విద్యార్థుల కోసం తమ తలుపులు తెరిచింది. యుకె యూనివర్శిటీలు విద్యార్థులకు మద్దతునందించడంతో పాటుగా ఆన్లైన్ మరియు సమ్మిళిత అభ్యాస నమూనాలనూ అందిస్తుంది. పియర్సన్ గ్లోబల్ లెర్నర్స్ సర్వే ప్రకారం, కోవిడ్‌ఉ19 మహమ్మారి ఫలితంగా, 80% మంది విద్యార్థులు ఉన్నత విద్య ప్రాధమికంగా మారిందని అంగీకరిస్తున్నారు. ఈ మార్పు అనేది శాశ్వతం కాకపోవచ్చు కానీ ఈ అవాంతరాలు విదేశాలలో విద్యనభ్యసించాలని ప్రణాళిక చేసుకున్న విద్యార్థుల ప్రాధాన్యతలు, ఎంపికపై మాత్రం ప్రభావం చూపుతుంది. ఈ అధ్యయనం వెల్లడించిన దాని ప్రకారం, 86% మంది విద్యార్థులు యూనివర్శిటీ అనుభవాలలో ఆన్లైన్ అభ్యాసం ఓ భాగం కానుందని భావిస్తున్నారు.
మనం ఈ సంక్షోభం నుంచి నెమ్మదిగా బయటపడుతున్న వేళ, భద్రత మరియు ఎంపిక చేసుకునే దేశం పరంగా మరింత ఆప్రమప్తంగా ఉండాల్సి వస్తుంది. విద్యార్థులకు పూర్తి అనుకూల వాతావరణం అందిస్తూనే, ప్రస్తుత వాతావరణానికి అనుగుణంగా సంస్కరించిన ఇమ్మిగ్రేషన్ నిబంధలు ఉండాల్సిన అవసరమూ ఉంది. ఈ మహమ్మారిని ఏ విధంగా ఆ దేశాలు నిర్వహించగలవన్న అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.
4. విద్యా వాతావరణంలో డిజిటల్ ఏ విధంగా తన పాత్ర పోషిస్తుంది ? భవిష్యత్‌లో కూడా అంటే నిబంధనలను పూర్తిగా సడలించిన తరువాత కూడా ఇది కీలకంగా మారనుందా ?
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఉ19 మహమ్మారి డిజిటల్ స్వీకరణను గణనీయంగా వృద్ధి చేసిందని వెల్లడించడంలో ఎలాంటి సందేహాలూ లేవు. అయితే, కోవిడ్‌ఉ19కు ముందు కూడా అప్పటికే అత్యధిక వృద్ధి నమోదు కావడంతో పాటుగా విద్యా రంగంలో దీని స్వీకరణ కూడా అధికంగా ఉంది. 2019 వ సంవత్సరంలో అంతర్జాతీయంగా ఎడ్టెక్ పెట్టుబడులు 18.66 బిలియన్ డాలర్లుగా నిలిచాయి. అంతేకాదు, మొత్తంమ్మీద ఆన్లైన్ ఎడ్యుకేషన్ మార్కెట్ 2025 నాటికి 350 బిలియన్ డాలర్లుగా చేరుకోవచ్చని అంచనా. లాంగ్వేజ్ యాప్స్, వర్ట్యువల్ ట్యుటరింగ్, వీడియో కాన్ఫరెన్స్ టూల్స్ లేదా ఆన్లైన్ అభ్యాస సాఫ్ట్వేర్ అయినా సరే కోవిడ్ ఉ19 తరువాత గణనీయమైన వృద్ధి వినియోగపరంగా కనిపిస్తుంది.
విద్యారంగం ఇప్పటికి కూడా నిస్సందేహంగా మహమ్మారి ప్రభావాన్ని అనుభవిస్తుంది. పరీక్షలు వాయిదా పడటం, సుదీర్ఘ లాక్డౌన్ మరియు పాఠశాలలు మూతపడటం వంటి అంశాల పరంగా మనం వీటిని గమనించవచ్చు. ఈ నేపథ్యంలో డిజిటల్ అత్యంత కీలకమైన పాత్రను పోషించడంతో పాటుగా విద్యారంగానికి తగిన మద్దతును అందిస్తుంది. దీర్ఘకాలంలో సమ్మిళిత అభ్యాసమనేది ఖచ్చితంగా భవిష్యత్‌గా నిలువవచ్చు. ఈ సమ్మిళత పరిష్కారాలలో ఆఫ్‌లైన్/ఆన్లైన్ సమ్మేళనం అనేది మహమ్మారి అనంతర ప్రపంచంలో మరింత ప్రభావవంతంగా ఉండవచ్చు. అయితే, పూర్తిగా ఆన్‌లైన్‌కు మారడమన్నది నెమ్మదిగా జరుగవచ్చు మరియు అభ్యాసానికి సంబంధించి విభిన్న విభాగాలలో అభ్యాస పర్యావరణ వ్యవస్ధ చేత ఇది స్వీకరించబడుతుంది. సమకాలీన విద్య యొక్క లక్ష్యం , వివిధ బోధనాంశాలలో అవసరమైన విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించడం మాత్రమే కాదు, డిజిటల్ ప్రపంచం1 2 3 4 అన్వేషించేందుకు అవసరమైన నైపుణ్యాలు, డిజిటల్ సామర్థ్యాలను సైతం సమకూర్చడం అని మేము నమ్ముతున్నాము.