Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్బంధాలను విధించిన నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు నేడు భారతదేశ వ్యాప్తంగా 50 నగరాల్లో మొబైల్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్లను (ఏటీఎంలు) అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించగా, వినియోగదారులకు అవి ఈ లాక్డౌన్ సమయంలో ఉపయోగపనున్నాయి. నిర్బంధం కొనసాగుతున్న ప్రదేశాల్లో మొబైల్ ఏటీఎంలు ప్రజలు నగదు పొందేందుకు, తాము ఉంటున్న ప్రాంతాల నుంచి బయటకు వెళ్లవలసిన అవసరాన్ని తప్పించనున్నాయి.
ఈ మొబైల్ ఏటీఎంలు చెన్నై, ముంబయి, దిల్లీ/గుర్గావ్, విజయవాడ, డెహ్రాడూన్, కటక్, లూథియాన, లఖ్నవూ, భువనేశ్వర, చండీగఢ్, తిరువనంతపురం, అలహాబాద్, పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, తిరుచ్చి, సేలం, కోయంబత్తూరు, హొసూరు, నొయిడా, జేపూర్ (కోరాపుట్), బెంగళూరు, మైసూరు, జైపుర, పాణిపట్, అంబాలా, జమ్ము, నాసిక్, రేవారి, పాట్నా నగరాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉండనున్నాయి. వినియోగదారులు మొబైల్ ఏటీఎం ఉపయోగించి 15 రకాల లావాదేవీలను నిర్వహించుకునేందుకు అవకాశం ఉండగా, ప్రతి చోటా అవి నిర్దిష్ట అవధి వరకు పని చేస్తాయి. ఈ మొబైల్ ఏటీఎం రోజుకు 3- 4 చోట్ల నిలిపి ఉంచుతారు. ఏటీఎంల వద్ద వరుసలో నిలబడవలసి వచ్చినప్పుడు భౌతిక దూరాన్ని కాపాడేందుకు అన్ని జాగ్రత్తలను తీసుకుంటుండగా, సిబ్బంది అలాగే వినియోగదారుల సురక్షతకు క్రమం తప్పకుండా శానిటైజేషన్ నిర్వహించనున్నారు. ‘‘మా మొబైల్ ఏటీఎం మౌలిక నగదు సేవలను కోరుకునే ప్రజలకు తమ చుట్టుపక్కల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండానే మహోన్నతమైన మద్ధతు ఇచ్చే భరోసాను కలిగి ఉన్నామని’’ హెచ్డిఎఫ్సి బ్యాంకు లయబిలిటీ ప్రొడక్ట్స్, థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ అండ్ నాన్-రెసిడెంట్ బిజినెస్ గ్రూప్ హెడ్ ఎస్.సంపత్ కుమార్ తెలిపారు. మహమ్మారి విరుచుకు పడుతున్న ఈ సమయంలో కొవిడ్-19 విస్తరించడాన్ని అడ్డుకునేందుకు మనం ఒక్కతాటిపై నిలబడవలసిన అవసరం ఉండగా, మేము ప్రతి ఒక్కరినీ #స్టేహోమ్ మరియు #స్టేసేఫ్గా ఉండేందుకు మా వంతు ప్రయత్నాలు కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఈ సేవలతో మహహ్మారిని నిర్బంధించేందుకు అలుపెరగకుండా శ్రమిస్తున్న ఆరోగ్య సేవల కార్యకర్తలు అందరినీ అలాగే ఇతర అత్యవసర సేవలను అందించే వారికి చక్కని మద్ధతు కానుందని’’ పేర్కొన్నారు.