Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంపెనీ సిఎస్ఆర్ ముకుల్ మాధవ్ ఫౌండేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా కొవిడ్‌తో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాలకు కావలసిన వివిధ వైద్య పరికరాల వితరణకు నిధుల సేకరణ, సకాలంలో వాటి పంపిణీకి అంతర్జాతీయ మరియు స్థానిక వనరుల క్రోఢీకరించుకుంది
- యాక్షన్ ఎయిడ్, సిఆర్‌ఇఒ, బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (BAPIO), లండన్‌లో భారతీయ రాయబార కార్యాయలం, హోప్ 2 స్లీప్ ఛారిటీ, కతార్ ఎయిర్వేస్ మరియు అశోక్ లేల్యాండ్ సంస్థలతో భాగస్వామ్యం
హైదరాబాద్: ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (FIL) తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ముకుల్ మాధవ్ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా అలాగే భారతదేశంలో ఇతర కార్పొరేట్లు, సేవా సంస్థలు మరియు సమాన మనస్కులలో కొవిడ్ ఉపశమన చర్యలకు వనరులను క్రోఢీకరించింది. ఈ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రయత్నాలు ఎంఎంఎఫ్లో భాగంగా పలు కార్పొరేట్లతో పరిహారం, రెండో అల మహమ్మారి సందర్భంలో మద్ధతు ఇచ్చేందుకు ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో చేతులు కలిపాయి.
ఈ భాగస్వామ్యంతో 945 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 218 వెంటిలేటర్లు, థర్మల్ స్కానర్లు, పిపిఇ కిట్లు, ఆక్సిమీటర్లు, చేతి గ్లౌజులు, శానిటైజర్లు మరియు ప్యారాసిటమాల్ మాత్రలను కొవిడ్ కేంద్రాలు, మునిసిపల్ ఆసుపత్రులు మరియు గ్రామీణ ఆసుపత్రులకు దేశ వ్యాప్తంగా, అందులోనూ కొవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న చోట్ల విరాళంగా అందజేసింది. ఈ పరిహార ప్రయత్నాలకు ఆశా, ఎఎన్ఎం కార్యకర్తలే కాకుండా ఈ వైరస్‌కు వ్యతిరేకంగా మొదటి వరుసలో నిలబడి పోరాడం చేస్తున్న కొవిడ్ వారియర్స్‌ను రక్షించింది. ఈ మద్ధతు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, హరియాణ, రాజస్థాన్, గోవా, ఒడిశా, జార్ఖండ్ మరియు పంజాబ్‌లతో పాటు పలు రాష్ట్రాలకు విస్తరించింది.
ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఈ రెండో అల నియంత్రణ చర్యల కోసం రూ.9 కోట్ల కన్నా ఎక్కువ రిజర్వు చేసింది. ఎంఎంఎఫ్ అలాగే వాటి సహకారంతో నిధులను క్రౌడ్ ఫండింగ్, ఇతర కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ విభాగాలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించింది. ముకుల్ మాధవ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మరియు ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఫౌండేషన్ ఫౌండేషన్ బోర్డ్ సభ్యుడు రితు ప్రకాశ్ ఛాబ్రా మాట్లాడుతూ ‘‘మేము తీవ్రంగా విస్తరిస్తున్న కొవిడ్ కేసులను నియంత్రించేందుకు ప్రజలు అలాగే సంస్థలను ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి, ప్రజా ఆరోగ్య మౌలిక సదుపాయాలను వృద్ధి చేస్తున్నాము. మేము మా భాగస్వాముల మద్ధతుతో వనరులను సేకరిస్తుండగా, అది నిధుల సేకరణ, వైద్య పరికరాల కొనుగోలు మరియు లాజిస్టిక్స్ ప్రణాళిక మరియు అనుష్ఠానాలతో సులలితంగా జారీలోకి తీసుకు వచ్చాము అలాగే అత్యంత అవసరం ఉన్న రోగులు సకాలంలో చికిత్స పొందేలా చూసుకుంటున్నామని’’ వివరించారు.
ఈ పరిహార కార్యక్రమాల కార్యాచరణ విజయంలో పెద్ద వాటా కతార్ ఎయిర్ వేస్ నుంచి లభించిన పరిష్కరణతో సాధ్యం కాగా, అది ఉచితంగా ఉపకరణాలను తరలించేందుకు సహకారం అందించింది. అశోక్ లేల్యాండ్ అందించిన స్థానిక సమాచారానికి అనుగుణంగా పరికరాలను అత్యంత కుగ్రామాలకు సురక్షితంగా అలాగే వేగంగా చేర్చింది. ఫినోలెక్స్ దిగుమతి అనుమతి పొందడంలో అలాగే స్థానిక సంస్థలతో భాగస్వామ్య ప్రయత్నాలకు నేతృత్వం వహించే వాలంటీర్లు అలాగే పరిహారాన్ని సరైన స్థలాలకు చేర్చేందుకు పరిశీలించిన మనవిలను అందుకోవడంలో ప్రముఖ పాత్రను పోషించింది. ఏప్రిల్ 2021 ప్రారంభం నుంచి ఫౌండేషన్ విజయవంతంగా ధ్రువీకరించిన అన్ని మనవిలతో విజయవంతంగా అనుసంధాన్ని కలిగి ఉంది మరియు వారికి సకాలంలో చేర్చింది. ఇది బాలల ఆసుపత్రులు మరియు బాలలకు వైద్య చికిత్సలకు మద్ధతు ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషించింది.