Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ రిలీఫ్ ప్యాకేజ్‌లో అత్యవసర సేవలు అందిస్తోన్న వాలంటీర్లకు NGOల ద్వారా ఉచిత రైడ్లు
- NGO భాగస్వామ్యంలో అమెరికన్ ఇండియా ఫౌండేషన్, గో ధార్మిక్, ప్రాజెక్ట్ ముంబయి, ద గుడ్ క్వెస్ట్ ఫౌండేషన్
ఢిల్లీ: అత్యవసర కోవిడ్ రిలీఫ్ చర్యల్లో భాగంగా రూ. 3.65 కోట్ల సహాయాన్ని ప్రకటించింది ఉబర్.
ఈ మొత్తాన్ని ఈ అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ సిలిండర్స్ రవాణాకు, కాన్సన్ట్రేటర్స్, వెంటలేటర్స్ మరియు ఇతర క్రిటికల్ మెడికల్ ఎక్విప్మెంట్ తరలింపునకు ఉపయోగిస్తారు. దీనిద్వారా మహమ్మారి రెండో వేవ్‌ను ఎదుర్కునేందుకు భారతదేశ వైద్య వ్యవస్థకు మరింత సాయం చేసినట్లు అవుతుంది.
ఉబర్ తన సహాయాన్ని అందించేందుకు వివిధ NGOలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ NGOలు మెడికల్ ఎమర్జెన్సీ వస్తువుల్ని అత్యవసర సమయానికి తరలించి ప్రజల ప్రాణాల్ని కాపాడడంలో సహాయం చేస్తాయి. గత మేలో, ఉబర్ మొదటగా యూకేకు చెందిన గో ధార్మిక్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఢిల్లీ ఎన్సీఆర్ మరియు అహ్మాదాబాద్‌లో కోవిడ్ అత్యవసర సేవలు అందిస్తోన్న గో ధార్మిక్ సంస్థకు చెందిన వాలంటీర్లకు సహాయ సహకారాలను అందిస్తోంది ఉబర్. అప్పటినుంచి 90కి పైగా భారతీయ నగరాల్లో ఉబర్ మొబిలిటీ నెట్వర్క్… జైపూర్, వడోదర, లక్నో మరియు ముంబైతో సహా 6 భారతీయ నగరాల్లో గో ధార్మిక్ సహాయ సహకారాలను అందించేందుకు కృషి చేసింది. తద్వారా అత్యవసర సమయాల్లో దాదాపు 10 వేల మందికి సహాయం లభించింది.
ఉబర్ భాగస్వామ్యంతో గో ధార్మిక్.. ప్రత్యక్షంగా 725 మందికి ఆక్సిజన్ సహాయాన్ని అందించింది. అలాగే 33,000 మందికి భోజనం మరియు రేషన్ కిట్లను పంపిణీ చేసింది. దీంతోపాటు… అదనంగా 1,675 మెడికల్ ప్యాక్‌లు మరియు 250 హాస్పిటల్ బెడ్లతో 15 COVID సంరక్షణ సౌకర్యాలకు మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా ఉబర్ భాగస్వామ్యంపై గో ధార్మిక్ ఛైర్మన్ హేమల్ రణ్ధీర్వాలా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… భారతదేశంలో కోవిడ్ సహాయక చర్యలను పెంచేందుకు గో ధార్మిక్‌కు ఉబర్ ఎంతగానో సహాయాన్ని అందించింది. ఈ క్లిష్ట సమయాల్లో వేలాది మంది బాధిత కుటుంబాలకు మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులకు మేము చాలా అవసరమైన 24/7 మద్దతును అందించాము. ఇది మంచి పని అని అన్నారు.