Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగిల్ సబ్స్ క్రిప్షన్, సింగిల్ పేమెంట్, సింగిల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా అద్భుతమైన మరియు ప్రీమియం కంటెంట్ ఉన్న ఓటీటీ యాప్స్ అన్నీ ఇప్పుడు మీ మొబైల్లోనే సరికొత్త టాటా స్కై బింజ్ యాప్ ద్వారా చూడవచ్చు. ఆ యాప్స్ Disney+ Hotstar Premium, ZEE5, Hungama Play, Eros Now, ShemarooMe, Voot Select, Voot Kids, SonyLIV మరియు CuriosityStream కొత్త యూజర్లు అందరూ 7 రోజుల ఉచిత ట్రయల్‌ని పొందవచ్చు. రెండు అట్రాక్టివ్ ప్లాన్స్ – రూ. 149 మరియు రూ. 299
ఢిల్లీ: దేశంలోనే లీడింగ్ పే టీవీ ప్లాట్ఫామ్లో దూసుకుపోతున్న టాటా స్కై.. ఇప్పుడు తన వినియోగదారుల కోసం ఓటీటీ అగ్రిగేటర్ సర్వీస్‌ను మరింత అప్డేట్గా అందిస్తోంది. అందులో భాగంగా Tata Sky Binge Mobile app యాప్ ద్వారా మరిన్ని సేవలు, మరిన్ని ప్రీమియమ్ ఓటీటీలను అందిస్తోంది. Make tomorrow better than today అనే తన బ్రాండ్ లైన్‌తో ఇన్నాళ్లు టాటా స్కై బింజ్ను టీవీలో అందించిన టాటా స్కై... ఇప్పుడు తన సర్వీసుల్ని మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులకు అందించబోతోంది. టాటా స్కై బింజ్ యొక్క ప్రధాన సూత్రం కంటెంట్. వినియోగదారులను ఆకట్టుకునేది కంటెంట్ మాత్రమే అనేది బలంగా నమ్ముతుంది. అందుకే ఆ కంటెంట్‌ను అందరికంటే ముందుగా, మరింత క్వాలిటీగా అందించేందుకు కృషి చేస్తుంది. ఇందుకోసం ఈ OTT అగ్రిగేషన్ యాప్ ద్వారా వివిధ రకాల స్ట్రీమింగ్ సర్వీసెస్ నుంచి న్యూ రిలీజెస్, పాపులర్ మూవీస్, ట్రెండింగ్ నౌ వంటి ఆప్షన్స్‌లోకి కంటెంట్‌ను క్యూరేట్ చేస్తుంది. తద్వారా ఏ కంటెంట్ ఎక్కడుందో కనుక్కోవడం సులభతరం అవుతుంది. అంతేకాకుండా లాంగ్వేజ్, జోనర్, యాప్ రైల్స్ లాంటివి ఉపయోగించి కంటెంట్ సర్ఫింగ్, సెర్చింగ్ మరియు రికమండేషన్స్‌ని వేగంగా మరియు సౌకర్యవంతంగా చేస్తుంది. ఇక స్క్రీన్ కింద ఉన్న టాబ్ బార్… హోమ్ స్క్రీన్, సెర్చ్ మరియు వాచ్ లిస్ట్‌ను సులభంగా యాక్సెస్ ఇస్తుంది. సింగిల్ ప్లాట్ఫామ్లో కంటెంట్‌ను చూసేందుకు ఒకే చందా, ఒకే చెల్లింపు మరియు ఒకే సైన్-ఆన్ ద్వారా ఆకర్షణీయంగా మరియు ఆనందించేలా చేస్తుంది.
ఇంటిగ్రేటెడ్ OTT కంటెంట్‌ను అద్భుతమైన రీతిలో అందించేందుకు టాటా స్కై బింజ్ మొబైల్ యాప్‌లో ఇప్పుడు వినియోగదారుల కోసం రెండు ఆకర్షణీయిమైన ప్లాన్స్ ఉన్నాయి. అందులో మొదటికి Tata Sky Binge 299 ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం... 10 OTT యాప్స్‌ని ఒక టీవీ స్క్రీన్ (అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ – టాటా స్కై ఎడిషన్ లేదా బింజ్+ STB) మరియు 3 మొబైల్ స్క్రీన్స్ ద్వారా చూసుకోవచ్చు. ఇక రెండో ప్లాన్ 149 విషయానికి వస్తే... 3 మొబైల్ స్క్రీన్స్‌లో చూసుకోవచ్చు. అయితే ఇందులో 7 OTT ప్లాట్‌ఫామ్స్ మాత్రమే.