Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గూగుల్ వర్క్ స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్ సరళత్వం, సర్దుబాటుతత్వం, భద్రత మరియు బైజూస్ తిరుగు లేని కంటెంట్ బోధన రెండూ కలసి పాఠశాలలో సమర్థవంతమైన అభ్యసనానికి తోడుగా ఉండేందుకు ‘విద్యార్థ’ వేదికపైకి వచ్చాయి. తిరుగులేనివిధంగా చదువును అందించేందుకు ఆటోమేటెడ్, క్లౌడ్ ఆధారిత మేనేజ్ మెంట్ ప్లాట్ ఫామ్ వినూత్న అభ్యసన అనుభూతులను అందించేందుకు అధునాతన సాంకేతికతలు
బెంగళూరు: తన ఫ్లాగ్ షిప్ లెర్నింగ్ యాప్ పై 95 మిలియన్ల మంది నమోదిత విద్యార్థులను కలిగి ఉన్న ప్రపంచపు అగ్రగామి ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ అయిన బైజూస్, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆన్ లైన్ అభ్యసనం కొనసాగింపులో తోడ్పడేలా నేడిక్కడ గూగుల్ తో భాగస్వామ్యం ప్రకటించింది. బైజూస్ తో గూగుల్ వర్క్ స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ అనేది క్లాస్ రూమ్ నిర్వహణకు కొలాబ్రేటివ్ మరియు వ్యక్తి గతీకృత డిజిటల్ వేదికను అందించనుంది. దీనిలో పాల్గొనే విద్యాసంస్థలకు ఇది ఉచితంగా లభించనుంది.
డిజిటల్ ఎడ్యుకేషన్ కు కట్టుబాటుతో గూగుల్ వర్క్ స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్, డిజిటల్ పరివర్తన దిశగా బోధకుల ప్రయాణంలో వారికి సాధికారికత అందించడంలో బైజూస్ తిరుగులేని బోధనను మిళితం చేయనుంది. విద్యార్థ ప్లాట్ ఫామ్ పై నిర్మితమైన ఈ భాగస్వామ్యం బైజూస్ యొక్క ఎక్స్ టెన్సివ్ మాథ్, సైన్స్ బోధనకు నేరుగా యాక్సెస్ కల్పిస్తుంది. చూసేందుకు ఆకర్షణీయం గా ఉండే అభ్యసన పరిష్కారాలను అందించనుం ది. అధ్యాయం వారీగా స్లైడ్స్, రెడీమేడ్ అసైన్ మెం ట్స్, డేటా బ్యాంక్ లు, సమ్మరీ డాక్యుమెంట్లు, హ్యాండవుట్స్, టెస్ట్స్, ఇంకా మరెన్నో ఇందులో ఉంటాయి.
ఈ సందర్భంగా బైజూస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మృణాల్ మోహిత్ మాట్లాడుతూ, ‘‘గత ఏడాది కాలంలో ఆన్ లైన్ విద్యాభ్యాసం గణనీయ పెరుగుదల, ఆమో దం అన్నీ కూడా మన విద్యావ్యవస్థ యొక్క వేగవంతమైన డిజిటైజేషన్ కు దారి తీశాయి. రాత్రికి రాత్రి ఉపా ధ్యాయులు, విద్యార్థులు ఆన్ లైన్ లెర్నింగ్ బాట పట్టాల్సి వచ్చింది. ఇప్పుడు వీరంతా దీని శక్తిసామర్థ్యాలను గుర్తిస్తున్నారు. గూగుల్ తో మా భాగస్వామ్యం ద్వారా ఈ డిజిటల్ విప్లవానికి తోడ్పడడం, బోధన కొనసాగింపు నకు వీలు కల్పించేలా మన ఉపాధ్యాయులు అవసరమైన సాంకేతికతలతో, లెర్నింగ్ అసెట్స్ తో సిద్ధమై ఉం డేలా చేయడం మా లక్ష్యం. గూగుల్ తో కలసి పని చేయడం మాకెంతో ఆనందదాయకం. అభ్యసనం భవిష్యత్ ను పునర్ నిర్వచించడంలో మా భాగస్వామ్యం ఒక కీలక సమన్వయకర్తగా ఉంటుందని విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
తిరుగులేని విధంగా, సౌకర్యవంతమైన అభ్యసనానికి వీలు కల్పించేలా రూపొందించబడిన ఈ వేదిక గూగుల్ క్లాస్ రూమ్ ను కూడా కలిగిఉంటుంది. బోధకులకు ఇది సరళత్వాన్ని, భద్రతను కూడా అందిస్తుంది. డాక్స్, షీట్స్, స్లైడ్స్, ఫామ్స్ లతో కూడిన గూగుల్ వర్క్ స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్ కు తోడుగా గూగుల్ యొక్క ప్రీమి యం వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ అయిన గూగుల్ మీట్ కు కూడా ఉపాధ్యాయులు యాక్సెస్ పొదగలుగుతారు. ఇందులో గూగుల్ వర్క్ స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్స్ ఉపయోగించడం ద్వారా 100 మంది దాకా ఉచితంగా పాల్గొనవచ్చు.
గూగుల్ ఎడ్యుకేషన్ హెడ్ (దక్షిణాసియా) బాని ధావన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘గత ఏడాది గూగుల్ లో మేం మా సాంకేతికతలను, ప్లాట్ ఫామ్స్ ను ప్రతి చోట కూడా విద్యార్థులకు నాణ్యమైన అభ్యసన అనుభూ తిని అందించడంలో తోడ్పడేందుకు వినియోగించాం. దేశవ్యాప్తంగా పాఠశాలలను చేరుకునేందుకు బైజూస్ తో భాగస్వామ్యం కావడం మాకెంతో ఆనందదాయకం. పాఠశాల కరిక్యులమ్ కు తోడుగా సుసంపన్న, ఇంటరాక్టివ్ ఇంగ్లిష్ ఆధారిత అభ్యసన పరిష్కారాలను ఇది అందిస్తుంది. తరువాతి కాలంలో భారతీయ భాషలలో కూడా ఇది అందుబాటులోకి వచ్చేలా చేసేందుకు ప్రయత్నిస్తాం. ఆన్ లైన్ లెర్నింగ్, టీచింగ్ వేగంగా వృద్ధి చెందుతు న్న నేపథ్యంలో ఉపాధ్యాయులు తమ పాఠాలకు మరింత జీవం పోసేలా చేసేందుకు అర్థవంతమైన పరిష్కా రాల కోసం చూస్తున్నారు. మేం అందిస్తున్న పరిష్కారాలు ఆన్ లైన్ తరగతులను మరింత ఎంగే జింగ్ గా ఉండేలా చేస్తాయని భావిస్తున్నాం’’ అని అన్నారు.
మెసేజింగ్, టెస్ట్ నిర్వహణ, రోజువారీ తరగతులు, బైజూస్ నుంచి చక్కటి కంటెంట్ లతో సహా తమ విద్యార్థు లకు ఉపాధ్యాయులు ఒక సమగ్ర పరిష్కారాన్ని అందించేలా చేయడం ఈ సొల్యూషన్ లక్ష్యం. గూగుల్ యొక్క అంతర్జాతీయ స్థాయి భద్రతతో కరిక్యులమ్ తో ఇంటిగ్రేట్ చేయబడి విద్యార్థులు నిమగ్నమయ్యేలా, వ్యక్తిగతీ కరించబడిన బోధనకు వీలు కల్పించేలా ఉపాధ్యాయులకు సాధికారికత కల్పించేలా ఈ డిజిటల్ ఎకో సిస్టమ్ చేస్తుంది.
ఈ ప్లాట్ ఫామ్ పై సైనప్ చేసే ప్రతి పాఠశాల కూడా ఉపాధ్యాయులు, విద్యార్థులు, అడ్మిన్ సిబ్బందికి అందరికి కూడా గూగుల్ వర్క్ స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్ తో శక్తివంతమైన అధికారిక ఇమెయిల్ ఐడీలను పొందుతుంది. పాఠశాలలో ప్రభావపూరిత విద్యాభ్యాసం కోసం ఈ లెర్నింగ్ సొల్యూసన్ ఎండ్ టు ఎండ్ క్లాస్ రూమ్ మేనేజ్ మెంట్ ను అందిస్తుంది. క్లాస్ రూమ్ లెర్నింగ్ ను నిర్వహించేందుకు, యాక్సెస్ చేసేందుకు, ట్రాక్ చేసేందుకు తోడ్పడుతుంది.
ఈ అభ్యసన పరిష్కారం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి గల పాఠశాలలు దిగువ పేర్కొన్న వివరాలను తెలియజేయవచ్చు.