Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఇప్పుడు టెక్ మహీంద్రా లిమిటెడ్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ రెండు సంస్థల నడుమ జరిగిన అవగాహన ఒప్పందం ద్వారా తొలుత అంతర్జాతీయ చెస్ లీగ్ నిర్వహించడంపై దృష్టి సారిస్తారు. ఈ సంవత్సరారంభంలో టెక్ మహీంద్రా ఈ ప్రతిపాదనను చేసింది. ఇప్పుడు అంతర్జాతీయ చెస్ లీగ్ ఫిడె మద్దతుతో ఇది ప్రత్యేక హోదా పొందడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒకే ఒక్క ప్రపంచ లీగ్‌గా కూడా గుర్తింపు పొందింది. ఈ పోటీలను మొట్టమొదటిసారిగా, వినూత్నమైన రీతిలో ఫిజిటల్ (ఫిజికల్, డిజిటల్) రూపంలో నిర్వహిస్తారు. అంతర్జాతీయంగా ఫ్రాంచైజీ సొంతమైన బృందాలతో పాటుగా జూనియర్లు, వైల్డ్‌కార్డ్ ప్లేయర్లు సైతం ఈ పోటీలలో పాల్గొంటారు.
టెక్ మహీంద్రా, ఫిడెలు తమ శక్తియుక్తులన్నింటినీ సమీకరించి అత్యున్నత ప్రమాణాలతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తాయి. సాంకేతిక నిబంధనల రూపకల్పనలో ఫిడె సహాయపడటంతో పాటుగా తమ మాధ్యమాల ద్వారా ఈ పోటీలకు ప్రచారం చేస్తుంది. టెక్మహీంద్రాతో ఫిడె యొక్క ఈ భాగస్వామ్యం ఇప్పుడు చెస్‌ను నూతన, సృజనాత్మక ఫార్మాట్లలో ప్రోత్సహించడంతో పాటుగా యువతకు అవకాశాలనూ సృష్టిస్తుంది. అంతేకాకుండా ఎంతోమంది చాంఫియన్లనూ వృద్ధి చేస్తుంది. ఈ భాగస్వామ్యం ఇప్పుడు నూతన తరపు సాంకేతికతలైనటువంటి 5జీ, కృత్రిమ మేథస్సు, వర్ట్యువల్ రియాల్టీ వంటి వాటిపై ఆధారపడేందుకు లక్ష్యంగా చేసుకుంది. తద్వారా సృజనాత్మకంగా ఈ గేమ్‌ను ఇంటరాక్టివ్ టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రచారం చేస్తుంది.
గ్లోబల్ చెస్ లీగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఓ నూతన కంపెనీని సైతం సృష్టించనున్నారు. దీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఫిడె అధ్యక్షులు సైతం భాగం కానున్నారు. ఐదు సార్లు వరల్డ్ చాంఫియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్‌కు మెంటార్, భాగస్వామిగా వ్యవహరించనున్నారు. ఆయన కేవలం సలహాలివ్వడమే కాదు ఈ లీగ్‌కు ఓ ఆకృతినీ ఇవ్వనున్నారు.