Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· బహుళ ప్రాంతాలలో 2,50,000 సేఫ్టీ కిట్స్, 70,00,000 కిలోల రేషన్, 1,50,000 సబ్బులను ఒక లక్ష మందికి పైగా సఫాయీ సాథీస్కు పంపిణీ చేశారు.
· హెచ్‌సీసీబీ యొక్క ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా యుఎన్‌డీపీ సహకారంతో ఈ కార్యక్రమం చేశారు
విజయవాడ: ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన, హెచ్‌సీసీబీ, యుఎన్డీపీలు సఫాయీ సాథీస్ యొక్క ‘తాము చేస్తాం’ అనే స్ఫూర్తిని వేడుక చేశారు. సఫాయీ సాథీస్ అంటే మహమ్మారి సమయంలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటిని రీసైకిల్ చేయడంలో సహాయపడటం ద్వారా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో అవిశ్రాంతంగా కృషి చేసిన పారిశుద్ధ్య కార్మికులు. భాగస్వామ్య ఏజెన్సీలు, స్థానిక ప్రభుత్వ సంస్ధలతో కలిసి గత మూడు సంవత్సరాలుగా హెచ్‌సీసీబీ, యుఎన్డీపీలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ కార్యక్రమం ప్రాజెక్ట్ పృథ్వీలో అత్యంత కీలకమైన కార్మికులు వీరు. ప్రాజెక్ట్ పృథ్వీ ద్వారా ప్రతి సంవత్సరం 70వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడంతో పాటుగా రీసైకిల్ చేయడాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
భారతదేశంలో అగ్రశ్రేణి ఎఫ్ఎంసీజీ కంపెనీలలో ఒకటి హెచ్‌సీసీబీ(హిందుస్తాన్ కోకా–కోలా బేవరేజస్). ఈ సంస్థ యుఎన్డీపీతో కలిసి మహమ్మారి సమయంలో పనిచేయడంతో పాటుగా ఒక లక్ష మందికి పైగా ప్రజలను చేరుకుంది. వీరిలో 17వేల మంది సఫాయీ సాథీస్ సైతం ఉన్నారు. వీరికి సేఫ్టీ కిట్స్, రేషన్ సరఫరాలు, పరిశుభ్రతా కిట్స్ మొదలైనవి అందించారు. మొత్తంమ్మీద 2,50,000 సేఫ్టీ కిట్స్, 70,00,000 కిలోల రేషన్‌ను అందించారు. వీటిలో బియ్యం, గోధుమ పిండి, పప్పు దినుసులు, మసాలాలు, టీ, ఉప్పు, పాల పొడి, వంటనూనె, గింజధాన్యాలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా 1,50,000 సబ్బులను సైతం కోవిడ్–19 మహమ్మారి ప్రభావం ఆరంభమైన నాటి నుంచి అందించారు. ఈ రెండు సంస్థలూ మునిసిపల్ కమిషనర్లు, సిటీ ఇంప్లిమెంటింగ్ పార్టనర్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో పాటుగా పరిశుభ్రత మరియు భద్రత – మాస్కులు, గ్లోవ్స్ నిర్వహణ, భౌతిక దూరం వంటి అంశాల పట్ల 30 కు పైగా నగరాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సఫాయీ సాథీస్కు సరుకు రవాణా చేయడంతో పాటుగా నిర్ధేశించిన ప్రాంతాల్లో వ్యర్థాలను సేకరించేందుకు ట్రావెల్ పాస్‌లను సైతం అందించారు. ఈ ప్రయత్నాలను కటక్, భుబనేశ్వర్, పూరి, హైదరాబాద్ నగరాల మున్సిపల్ కమిషనర్లు ప్రశంసించారు.
పాట్నాకు చెందిన సఫాయీ సాథీ మాయా కుమారి మాట్లాడుతూ ‘‘నాతో పాటుగా మా బృందంలో ఆరుగురం ఉన్నాం. నెలకు 13వేల నుంచి 15 వేల రూపాయలను సంపాదిస్తుంటాం. ఆహార ధరలు చాలా పెరిగాయి. మేమిప్పుడు మంచి భోజనం కూడా పొందలేకపోతున్నాము. ఈ పరిస్థితుల్లో మేము ఎలా బ్రతకాలోనని ఎప్పుడూ భయపడుతూనే ఉంటాము. కొన్ని రోజులు అయితే ఆకలితోనే నిద్రపోతుంటాం. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమంతో కలిసి నేను పనిచేయడం ఆరంభించిన తరువాత వారు నాకు రేషన్ కార్డు మంజూరు చేశారు. నాకు మాత్రమే కాదు నా కుటుంబానికి కూడా ఆహారం లభిస్తుందనే భరోసా కలిగించిన అందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాము. ఎన్నో సంవత్సరాలుగా మేమంతా ఎదురుచూస్తోన్న అనుసంధానిత ఇది’’ అని అన్నారు.
2018లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 30కు పైగా ప్రాంతాలలో నిర్వహించబడుతుంది. హెచ్‌సీసీబీ యొక్క ప్లాస్టిక్ వ్యర్ధ నిర్వహణ కార్యక్రమాలు ప్రజలు, సమాజం, నగర స్థానిక సంస్థలు ప్రభుత్వ శాఖలు, వాటాదారుల నడుమ సహకారాన్ని వృద్ధి చేయడంతో పాటుగా ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణలో సుస్థిర పరిష్కారాలనూ తీసుకువస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,07,500 మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో విడుదల కాకుండా అడ్డుకోవడంతో పాటుగా 86వేల లీటర్ల నూనెను వర్జిన్ ప్లాస్టిక్ తయారీలో వినియోగించకుండా అడ్డుకోవడమూ జరిగింది. అసంఘటిత రంగంలోని సఫాయీ సాథీస్ తో అనుసంధానించబడటం ద్వారా స్వయం ఉపాధి సంఘాలుగా సంఘటిత ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడంతో పాటుగా బ్యాంకింగ్, గుర్తింపు కార్డులు, సామాజిక భద్రత అయినటువంటి భీమా పథకాలు తదితర అంశాలలో సైతం జోడించడం జరుగుతుంది.