Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వినియోగదారుల నుంచి వస్తున్న అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకుని 50% రాయితీ ఆఫర్‌ను 13 జూన్ 2021 వరకు విస్తరిస్తున్నట్లు వండర్లా హాలిడేస్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు చేసుకునే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేందుకు మరియు నిఖర ధరలో 50% వరకు ఆదా చేసుకునేందుకు అవకాశం దక్కుతుంది. పార్కు ప్రవేశానికి ప్రతి వ్యక్తికి టిక్కెట్టు ధర రూ.699 (జిఎస్టితో కలిపి) ఉండగా, వండర్లా కొచ్చి, బెంగళూరు అలాగే హైదరాబాద్ పార్కులకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ ఆఫర్లో భాగంగా వండర్లా బెంగళూరు రిసార్ట్‌లో ఇద్దరికి అల్పాహారంతో కలిసి, ఒక రాత్రి రిజర్వేషన్‌కు ధర రూ.2,999+ జిఎస్టి ఉంటుంది.
వినియోగదారులు కొనుగోలు చేసుకునే ఈ టిక్కెట్లు ఓపెన్ టికెట్ కాగా, వినియోగదారులు పార్కులు అలాగే రిసార్టులు తిరిగి ఓపెన్ అయిన తరువాత వారు సందర్శించే తేదీని ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసుకున్న టిక్కెట్లు మార్చి 31,2022 వరకు వినియోగించుకోవచ్చు మరియు వినియోగదారులు పార్కును సందర్శించే వీక్ డేస్, వీకెండ్లు లేదా సెలవు రోజులు అనే ఎటువంటి నిర్బంధం లేకుండా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
వండర్లా గురించి మరింత అదనపు సమాచారానికి సందర్శించండి: www.wonderla.com, లేదా పార్కుకు సంబంధించిన వివరాలకు 9291998877 మరియు రిసార్టుకు సంబంధించిన వివరాలకు 9632692544కు కాల్ చేయండి.