Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యుఎఫ్ఐ ఎంఇఏ (UFI MEA) సదస్సులో ఎగ్జిబిషన్ రంగానికి చెందిన ప్రాంతీయ అంతర్జాతీయ నాయకులు దుబాయ్లో సమావేశమయ్యారు. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వ్యాపార కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేందుకు ఈ నగరం ప్రపంచానికి ఎలా మార్గదర్శనం చేసిందో వక్తలు వివరించారు.
నగరానికి సంబంధించిన సుస్థిర చర్యల హామీతో, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మే 26న నిర్వహించిన సమావేశంలో, 10 దేశాల నుంచి 150 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దుబాయ్ టూరిజం, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అథారిటీ మరియు కై హట్టెండోర్ఫ్ డైరెక్టర్, గౌరవనీయులైన హెలాల్ సయీద్ అల్మార్రి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో యుఎఫ్ఐ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సమావేశంలో మాట్లాడారు.
దుబాయ్ కార్పొరేషన్ ఫర్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ సీఈఓ ఇస్సాం ఖాజిం మాట్లాడుతూ “నగరంలో దృఢమైన, నిర్ణయాత్మక నాయకత్వం మరియు కొవిడ్-19 మహమ్మారిని వివేకంతో నిర్వహించడంతో దుబాయ్లో ఎగ్జిబిషన్లు, వాణిజ్య ప్రదర్శనలు, ఇతర వ్యాపారాలను సురక్షితంగా తిరిగి ప్రారంభించి, అంతర్జాతీయంగా ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచి, స్థానికంగా ఆర్థిక మరియు జ్ఞానాభివృద్ధిలో కీలక పాత్రను పోషించింది. యుఎఫ్ఐ ఎంఇఏ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ప్రపంచ వ్యాపార సమాఖ్యలు, సంఘాలకు చెందిన ముఖ్య నాయకులతో పరస్పరం చర్చించుకునేందుకు, అవి నిరంతర పుంజుకునేందుకు ఒక వేదికను కల్పించేందుకు మాకు సహాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగానికి మద్దతు ఇచ్చేందుకు మేము ఆసక్తిగా ఉన్నాము మరియు దుబాయ్లో సురక్షిత వాతావరణానికి వారి వ్యాపారాలను తరలించడం ద్వారా వారి ఈవెంట్ ప్రణాళికలను తిరిగి ట్రాక్ చేసుకునేందుకు నిర్వాహకులను స్వాగతిస్తున్నామని’’ తెలిపారు.
యుఎఫ్ఐలోని మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా ప్రాంత ప్రాంతీయ డైరెక్టర్ నాజీ ఎల్ హడ్డాద్ మాట్లాడుతూ “ప్రస్తుత పరిస్థితులలో సెల్ఫ్ రెసిలెన్స్ మరియు అంకితభావంతో పరిశ్రమలు వృద్ధి చెందాలన్న సంకల్పానికి ఈ సమావేశం స్పష్టమైన మద్ధతు ఇచ్చింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, మా డెస్టినేషన్ భాగస్వామి దుబాయ్ టూరిజం మద్దతు లేకుండా ఈ సమావేశం విజయవంతం అయి ఉండేది కాదని మేము భావిస్తున్నాము. మా స్పాన్సర్లు, వక్తలు మరియు ప్రతినిధుల సహకారం మరియు పాల్గొనేందుకు వచ్చిన ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలని’’ తెలిపారు. దుబాయ్ ఎక్స్పో 2020కు మరింత ప్రాచుర్యం కల్పించే దిశలో రాబోయే నెలల్లో, దుబాయ్ అరబ్ హెల్త్ మరియు ది హోటల్ షోతో సహా ప్రధాన కార్యక్రమాలను నిర్వహించనుంది.