Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహమ్మారి సమయంలో అవిశ్రాంతమైన సేవ చేసినందుకు నర్సులు, వైద్యులు, అంబులెన్స్ డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీసు అధికారులు మరియు మునిసిపాలిటీ ఫ్రంట్ లైన్ సిబ్బంది కోవిడ్ యోధులకు భారతీయులు ఎప్పటికీ రుణపడి ఉంటారు. కోవిడ్ 19 యొక్క సెకండ్ వేవ్ తరువాత హైదరాబాద్ నగరం నెమ్మదిగా అన్ లాక్ దిశగా వెళుతున్న తరుణంలో 'ఇనార్బిట్ కేర్' కింద ఇనోర్బిట్ మాల్ నిస్వార్థ ఫ్రంట్లైన్ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, జిహెచ్ఎంసి మండలాలు,
ట్రాఫిక్ జంక్షన్లను ఇనోర్బిట్ మాల్ అధికారులు ఫ్రంట్ లైన్ సిబ్బందిని తాము అందచేసిన పురస్కారంతో వారిని ఆశ్చర్యపరిచారు. ఫ్రంట్ లైన్ సిబ్బందికి 'ఇనార్బిట్ కేర్స్ బ్యాగ్స్' అందజేశారు. వారి ఆదర్శప్రాయమైన పనికి గౌరవం ప్రశంసతో వారి సేవలను కొనియాడారు. జూన్ 6, 7 తేదీలలో. ఇనానోర్బిట్ మాల్ సెంటర్ హెడ్ శరత్ బెలవాడి తన బృందంతో దేశం కోసం వీరు చేసిన సేవలను కొనియాడారు.