Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 శాతం కాల్స్ హైదరాబాద్ నుంచే
హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా మరియు మహమ్మారి విస్తరించిన సమయంలో ఐరోపా ఖండానికి చెందిన అతిపెద్ద గృహోపకరణాల తయారీదారు మరియు ఈ రంగంలో ప్రపంచంలోని ప్రముఖ సంస్థలలో ఒకటిగా ఉన్న బిఎస్‌హెచ్ హోమ్ అప్లియెన్సెస్ తమ వినియోగదారుల సేవలను మొత్తం ఆన్‌లైన్‌లోకి మార్చివేసింది. మార్చి 2020నుంచి సంస్థ దేశ వ్యాప్తంగా 22,000 వినియోగదారుల సేవా సమస్యలను పరిష్కరించింది. గత 3 నెలల్లోనే, దక్షిణ భారతదేశానికి చెందిన 72%వర్చ్యువల్ విధానంలో పరిష్కరించింది. ఈ నగరాల్లో చెన్నై (17.8%), కొచ్చిన్ (38.1%), కోయంబత్తూర్ (4%), బెంగళూరు (27%), హైదరాబాద్ (12%) ఉన్నాయి.
పలు నగరాల్లో కఠినమైన లాక్డౌన్ విధించడంతో, వినియోగదారులు తమకు కావలసిన పరికరాల కొనుగోలుకు ఆన్‌లైన్‌పై ఆధారపడుతుండగా, దీనితో వీటిని ఇన్స్టాల్ చేసుకోవడం, మరమ్మతులకు సపోర్ట్ అవసరం అవుతుంది. వినియోగదారుల అవసరాలను పరిష్కరించడం మరియు పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన మార్పును బిఎస్‌హెచ్ వెంటనే ఒడిసి పట్టుకుంది మరియు అత్యుత్తమ సేవా ప్రమాణాల హామీకి భంగం కలుగకుండా ఆన్లైన్ కన్సల్టేషన్ల సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వీడియో మరియు ఫోన్ కాల్స్ ద్వారా వినియోగదారులకు తక్షణమే పరిష్కారాలను అందించే సమయంలో ఇంజనీర్లు నిర్విరామంగా సేవా మార్గదర్శకాలను అనుసరించారు.
దీని గురించి బిఎస్‌హెచ్ హోమ్ అప్లియెన్సెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డసీఈఓ నీరజ్ భాల్మాట్లాడుతూ నిమహమ్మారి సమయంలో మా వినియోగదారులందరికీ రిమోట్ సపోర్ట్ అందించేందుకు విశ్రాంతి లేకుండా శ్రమించిన బిఎస్‌హెచ్ కస్టమర్ సర్వీస్ బృందానికి అభినందనలు చెబుతున్నాను. నోవెల్ కరోనా వైరస్ ప్రజలను డిజిటల్-మాత్రమే జీవన విధానం అనే మార్గంలోకి ప్రయాణించేలా చేస్తున్న నేపథ్యంలో, అన్ని వ్యాపారాల్లో వర్చువల్ అనుభవాలను హ్యూమన్ టచ్‌తో ప్రేరేపించడం చాలా అవసరం. అటువంటి సేవలనే మేము బిఎస్‌హెచ్ ద్వారా అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాము. దక్షిణ భారతదేశం బిఎస్హెచ్కు ఒక కీలకమైన మార్కెట్ మరియు మేము మాపై విశ్వాసాన్ని ఉంచిన వినియోగదారులకు నాణ్యతతో కూడిన సేవలను అందిస్తూనే ఉంటామని్ణ్ణ పేర్కొన్నారు.
సవాళ్లతో కూడుకున్న ఈ సమయంలో శ్రమరహిత వర్చ్యువల్ సేవలు అందుకున్న దేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల నుంచి బిఎస్‌హెచ్ బృందం చక్కని ప్రశంసలు అందుకుంది. వినియోగదారుల పట్ల నిబద్ధతతో, బిఎస్‌హెచ్ తన అన్ని ఉత్పత్తులపై తన వారెంటీని జూన్ 30, 2021 వరకు విస్తరించింది. లాక్డౌన్ జారీలో ఉన్న ఏప్రిల్ 15 నుంచి 2021 మే 31 వరకు వారంటీ గడువు ముగిసిన అన్ని ఉత్పత్తులపై ఈ విస్తరించిన వారంటీ వర్తిస్తుంది.