Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ది ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ భారీ విజయం అనంతరం మార్వెల్ సిరీస్‌లో లోకి అందరినీ ఆకట్టుకునేందుకు విడుదల కానుంది. క్రాస్-టైమ్‌లైన్, రియాలిటీ-బెండింగ్, యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ కోసం గాడ్ ఆఫ్ మిస్చీఫ్‌ను వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి. అవును, లోకి జూన్ 9నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియంలో ఇంగ్లీషులో లోకి చూడండి. హిందీ, తెలుగు, తమిళ ప్రేక్షకులు, దీన్ని మీ కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకు వచ్చిన - డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో చూడండి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పటి వరకు చేసిన ప్రయాణంలో మొండివాడు, నిర్లక్ష్యంగా వ్యవహరించే మరియు అన్నింటికంటే అనూహ్యంగా ఉంటూ, తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని నింపుతూ, అభిమానులు తనపై పలు అంచనాలు పెట్టుకునేలా చేయడంలో లోకి సిద్ధహస్తుడు. మార్వెల్స్ తరహాలోనే బలమైన వారసత్వంతో, అభిమానులకు ఓపికగా ఉండడం చేదుగా ఉన్నప్పటికీ దాని ఫలితం మాత్రం తియ్యగా ఉంటుందని ఇది భరోసా ఇస్తుంది!
లోకిగా ప్రేక్షకుల ముందుకు తిరిగి వస్తున్న నటుడు టామ్ హిడిల్స్టన్ తన మొదటి సిరీస్‌లో తన పాత్ర గురించి మాట్లాడుతూ, “ఇది చాలా ఉత్తేజకరమైన పాత్ర, “ఇన్ఫినిటీ వార్” విడుదల అనంతరం మార్వెల్ స్టూడియోలో ప్రతిఒక్కరితో నేను మాట్లాడిన విషయాలు నాకు గుర్తున్నాయి. మేము అందరం ఒక్క చోట చేరి, ఆలోచనలను పంచుకుని, సరిగ్గా ఇప్పటి వరకునేను లోకి పాత్రలో ఆరు సినిమాలు చేశాను. ఆ సినిమాలు అన్నీ థోర్ కథలే. ఇవన్నీ థోర్తో లోకీకి ఉన్న సంబంధం, అతని కుటుంబంతో ఉన్న అనుబంధాల గురించి వివరిస్తుంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము? మనం ఇప్పటి వరకు ఏం చేయలేదు? కొత్తది ఏమిటి? అసలైనది ఏమిటి? అనేవి వాస్తవానికి స్ఫూర్తినిచ్చే సంభాషణలు. వాటిని నేను ఆలోచనలకు వదిలివేశాను మరియు ఇది చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే పాత్రకు విస్తృతమైన కోణాలు ఉన్నాయి. అది నటుడిగా నాకు లభించిన బహుమతి అని చెప్పవచ్చు. లోకి అంటే దాదాపుగా ఈ అంతులేని మనోహరమైన ట్రిక్కులు చూపించే పెట్టె, ఇక్కడ మీరు అతన్ని అర్థం చేసుకున్నామని భావిస్తుంటారు; కాని అతను వెల్లడించే అంశాలే వేరుగా ఉంటాయని’’ తెలిపారు.
మార్వెల్ సినిమాల్లో అతను మొదట నటించినప్పటి నుంచి,థోర్కు కింగ్ ఆఫ్ అస్గార్డ్ అని పేరు ఉన్నప్పటి నుంచి, ఎవెంజర్స్: ఎండ్గేమ్లో తిరిగి కనిపించే వరకు లోకి చాలా వరకు అతని సోదరుని నీడలోనే ఉంటాడు. ఏదేమైనప్పటికీ, ఓవెన్ విల్సన్, గుగు మబాతా-రా, సోఫియా డి మార్టినో, ఉన్మి మొసాకు మరియు రిచర్డ్ ఇ. గ్రాంట్ నటించిన ఈ సిరీస్‌లో అతను ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నాడు. ఈ షో చాలా ఉత్తేజకరమైన అనుభవాన్ని మరియు కథాంశంలో మలుపులతో ప్రేక్షకులకు చక్కని మనోరంజన హామీని ఇస్తుంది. గాడ్ ఆఫ్ మిస్చీఫ్ టైమ్ వేరియెన్స్ అథారిటీతో, మల్టిపుల్ టైమ్‌లైన్స్‌ను, ఎవరూ వినాశనానికి పాల్పడకుండా అడ్డుకునే కథనాన్ని కలిగి ఉంది. కానీ లోకి చుట్టుపక్కల ఉన్నప్పుడు, ఒకరకమైన దుష్ప్రవర్తన అనుసరిస్తుంది! ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు, కేట్ హెరాన్ దర్శకత్వం వహించిన, డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో మూడు భారతీయ భాషల్లో అతి త్వరలో విడుదల అవుతున్నలోకి వీక్షించడం మర్చిపోవద్దు. అప్పటి వరకు ఓపికగా ఉండడం చేదుగా ఉన్నప్పటికీ దాని ఫలితం మాత్రం తియ్యగా ఉంటుందని మేము మీకు భరోసా ఇస్తున్నాము!
హిందీ, తమిళం, తెలుగు భాషలలో త్వరలో డిస్నీ + హాట్‌స్టార్ విఐపిలో మాత్రమే విడుదల అవుతున్న లోకి సిరీస్‌లో గాడ్ ఆఫ్ మిస్చీఫ్ వీక్షించండి.