Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కాంట్రాక్ట్ పరిశోధన, అభివృద్ధి, తయారీ సంస్థగా పేరుగాంచిన జీవీకే బయో సైన్సెస్ అధికారికంగా కొత్త బ్రాండ్ గుర్తింపుతో ఇప్పుడు అరాజెన్ లైఫ్ సైన్సెస్ (అరాజెన్)గా రూపాంతంరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా అనేక సృజనాత్మక లైఫ్ సెన్సెస్ కంపెనీలతో 20 ఏళ్ల భాగస్వామ్యపు వారసత్వం కలిగిన అరాజెన్ ఇప్పుడు చిన్న, పెద్ద మాలిక్యూల్స్ వేదికల్లో ఔట్సోర్స్డ్ ఆవిష్కరణ, అభివృద్ధి, తయారీ సేవలు విస్తరించేందుకు సిద్ధమైంది.
మోర్డోర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం 2020లో అంతర్జాతీయ ఫార్మాసూటికల్ సీడీఎం మార్కెట్ విలువ $ 160.12 బిలియన్లుగా ఉండగా ఇది 2026 నాటికి 6.5% CAGR నమోదు చేస్తూ ప్రతిపాదిత కాలానికి (2021-2026) $ 236.61 బిలియన్లకు చేరుతుందని అంచనా. సీడీఎంఓ మార్కెట్లో భారతదేశం ప్రధాన స్థానంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఈ రంగంలో లోతైన నైపుణ్యం, అంతర్జాతీయంగానూ సరఫరా చేయగల బలమైన సామర్ధ్యం, అంతర్జాతీయ బయోఫార్మాసూటికల్ కంపెనీలు, బయోటెక్ క్లైంట్లతో ఉన్న భాగస్వామ్యం కారణంగా బలమైన నిర్మాణాత్మక వృద్ధిని అరాజెన్ చూపుతోంది.
20 ఏళ్ల చరిత్ర సృష్టిస్తున్న ఈ సమయంలో కొత్త అంతర్జాతీయ పెట్టుబడిదారుగా గోల్డ్‌మన్ సాచ్స్ వచ్చిన సందర్భంలో అరాజెన్ తన సరికొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. “లైఫ్ సైన్సెస్ పరిశ్రమ ఇష్టపడే భాగస్వామిగా మారాలనే లక్ష్యంతో 20 ఏళ్ల క్రితం మేము మా ప్రయాణం ప్రారంభించాం. ఇన్నాళ్లుగా వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పెట్టుబడులను చూసిన మేము ఇప్పుడు కంపెనీలో కొత్త పెట్టుబడిదారును చూస్తున్నాం. అంతే కాదు మా ఖాతాదారులు, పరిష్కారాలపై కొత్త దృష్టితో ముందడుగు వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా బ్రాండ్ ఇచ్చే హామీ “కలిసికట్టుగా ముందుకు” ఇక మా ఉద్దేశం “ ప్రతీ అణువులో చక్కని ఆరోగ్యం” అన్నవి అరాజెన్ విలువలను ప్రతిబింబిస్తాయి. మెరుగైన ఆరోగ్యం కోసం జరుగుతున్న పోటీలో మా భాగస్వాములతో కలిసి పనిచేస్తూ వారు విజయం సాధించేలా చూస్తాం” అన్నారు అరాజెన్ సీఈఓ మన్ని కంటిపూడి.
కొత్త బ్రాండ్ గుర్తింపు, కొత్త హామీలను సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రమేశ్ సుబ్రమణియన్ వివరిస్తూ, “కలిసికట్టుగా ముందుకు అన్న మా బ్రాండ్ హామీని కొత్త గుర్తింపు తేటతెల్లం చేస్తుంది. రెండు సంస్థలు ఒక్క చోటుకు రావడం, వాటి మధ్య సహకారం మెరుగైన ఆరోగ్యం కోసం అనంతమైన అవకాశాలు కల్పిస్తుంది. మా గుర్తు “AURA” (ఆరా) మా విశిష్ట వ్యక్తిత్వాన్ని – యాంబిషియస్, అండర్‌స్టేటెడ్, రీసైలెంట్, అజైల్ను ప్రతిబింబిస్తుంది. అరాజెన్ బ్రాండ్ రంగులు ప్రతిబింబాన్ని, అర్థాన్ని తెలియజేస్తాయి. ముదురు నీలి రంగు సైన్స్, స్ట్రెంగ్త్, రీసైలెన్స్ను తెలియజేస్తే శక్తిమంతమైన నారింజ రంగు జీవం, మెరుగైన ఆరోగ్యం, లక్ష్యం, శక్తికి సూచికగా నిలుస్తుంది’ అని అన్నారు.
“భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 సైట్లు, 400లకు పైగా పీహెచ్.డీల నైపుణ్యం, 3,100 మంది బలమైన ఉద్యోగులతో అరాజెన్ ఈ సరికొత్త శక్తి, దృష్టితో ఈ రంగంలోని మా ప్రస్తుత ఖాతాదారులకు సేవలను కొనసాగించడంతో పాటు కొత్త వారికి సేవలందించేందుకు సిద్ధంగా ఉందని” చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్ సింగ్ అన్నారు.