Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశపు నెంబర్ 1 టీవీ బ్రాండ్, తమ అత్యంత ఆకర్షణీయమైన, ఎక్కువ మంది కోరుకునే లైఫ్‌స్టైల్ టీవీ ద ఫ్రేమ్ 2021 ఎడిషన్‌ను శాంసంగ్ పరిచయం చేసింది. ఆన్ చేసినప్పుడు టీవీలా, ఆఫ్ చేసినప్పుడు ఆర్ట్‌లా కనిపిస్తుంది ఇది. ఫ్రేమ్‌ను అభిరుచికి తగినట్లుగా డిజైన్ చేశారు. తద్వారా మీ విలాసవంతమైన ఇంటి ప్రాంగణాలను మరింత వైవిధ్యంగా మార్చడంతో పాటుగా అత్యద్భుతమైన, అనుకూలీకరణ బీజెల్ అవకాశాలతో మీ సొంత శైలి ప్రకటనను చేసేందుకు అనుమతిస్తుంది. ఈ 43 అంగుళాల ఫ్రేమ్ ఈ సంవత్సరమే విడుదల కావడంతో పాటుగా కంపాక్ట్ స్పేసెలో డిజైన్‌కు జీవం పోస్తుంది.
ఈ నూతన ఫ్రేమ్ ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు శాంసంగ్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్‌పై నాలుగు స్క్రీన్ పరిమాణాలు - 43 అంగుళాలు, 50అంగుళాలు, 55అంగుళాలు మరియు 65 అంగుళాలలో 61,990 రూపాయల ప్రారంభ ధరతో జూన్ 12, 2021 నుంచి లభ్యమవుతుంది. ద ఫ్రేమ్ ఎర్లీ బర్డ్ వినియోగదారులు జూన్ 12 నుంచి 24 వ తేదీలోపుగా బుక్ చేసుకుంటే 9,900 రూపాయల విలువ కలిగిన బీజెల్స్ను పొందగలరు.
నమ్మశక్యం కాని రీతిలో అత్యద్భుతంగా ఉండే ఫ్రేమ్ అనుకూలీకరణ అవకాశాలత మీ సొంత టీవీని తయారుచేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ 2021 ఎడిషన్‌తో మీరు విభిన్న రంగుల బీజెల్స్ను మీ చుట్టుపక్కల ప్రాంతాలకు తగినట్లుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మీ వ్యక్తిగత ఆర్ట్ కలెక్షన్‌ను విస్తృతశ్రేణిలోని 1400 పీస్‌ల ఆర్ట్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దుకోవచ్చు. అంతేకాదు, మీ కుటుంబ లేదా ట్రావెల్ ఫోటోగ్రాఫ్‌లను సైతం అప్లోడ్ చేయవచ్చు. మీరు మీ చిత్రాలను ఐదు విభిన్నమైన మాట్ లేఔట్ అవకాశాలతో అనుకూలీకరించడంతో పాటుగా 16 విభిన్నమైన రంగులతో మరింత వాస్తవికంగా మార్చుకోవచ్చు. అంతేనా, పూర్తి సరికొత్త ఆకర్షణీయమైన 2021 ఎడిషన్ ద ఫ్రేమ్ గత మోడల్‌తో పోలిస్తే 46% సన్నగా ఉంటుంది. తద్వారా మీరు ఎక్కడ ఉంచినా అత్యంత అందంగా ఇది వాస్తవ చిత్ర ఫ్రేమ్‌తో మిళితమవుతుంది.
ద ఫ్రేమ్ 2021 కేవలం అందంగా ఉండటం మాత్రమే కాదు, ఇది అత్యున్నత చిత్ర నాణ్యతను క్యుఎల్‌ఈడీ సాంకేతికతతో అందిస్తుంది. ఇది వాస్తవ జీవతపు రంగులను అందిస్తుంది. అదే రీతిలో వృద్ధి చేసిన కాంట్రాస్ట్, తప్పు పట్టలేని రీతిలో 100% కలర్ వాల్యూమ్‌తో అసాధారణ చిత్ర నాణ్యతతో అందిస్తుంది. ఈ ఫ్రేమ్ 2021 ఇప్పుడు శాంసంగ్ క్వాంటమ్ డాట్ టెక్నాలజీ, శక్తివంతమైన క్వాంటమ్ ప్రాసెసర్ 4కె, 4కె ఏఐ అప్ స్కేలింగ్ సామర్థ్యం మరియు స్పేస్ ఫిట్ వంటివి మీ గదిలోని వాతావరణం విశ్లేషించడం ద్వారా శబ్ద సెట్టింగ్స్‌ను ఆటో ఆప్టిమైజ్ చేస్తుంది. ద ఫ్రేమ్ 2021 ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్‌పై జూన్ 12,2021వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. ద ఫ్రేమ్ ను ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదారులు 9900 రూపాయల విలువలగల బీజెల్స్ ను కాంప్లిమెంటరీగా జూన్ 12 నుంచి జూన్ 2021 వ తేదీ లోపుగా పొందవచ్చు.
శాంసంగ్ యొక్క సుస్ధిరమైన కార్యక్రమాలలో భాగంగా , ద ఫ్రేమ్ 2021 ఇప్పుడు సస్టెయినబల్ ప్యాకేజింగ్ డిజైన్‌తో వస్తుంది. దీనిని క్యాట్ హౌస్ లేదా బుక్ షెల్ఫ్గా మార్చడంతో పాటుగా స్వయం చాలిత సోలార్ సెల్ శక్తివంతమైన రిమోట్ కంట్రోల్స్ కారణంగా బ్యాటరీలను తరచుగా మార్చాల్సిన అవసరం ఉండదు మరియు ఇంటి లోపల లైట్లుతోనే వీటిని చార్జ్ చేసుకోవచ్చు. తద్వారా గ్రీన్హౌస్ ఉద్గారాలనూ తగ్గించుకోవడంలో సహాయపడుతుంది.
'నేడు వినియోగదారులు అసాధారణ డిజైన్ ప్రీమియం సాంకేతికతల సమ్మేళనంలా ఉండే ఉత్పత్తులను కోరుకుంటున్నారు. తమ ఇళ్లకు డిజైన్ చేయించుకుంటున్న సమయలోనే వారు సాంకేతికతను తమ వైవిధ్యమైన, వ్యక్తిగతీకరించిన అంశాలను తమ జీవనశైలికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఫ్రేమ్ 2021తో మా వినియోగదారులు తమ నివాస ప్రాంగణాలను అనుకూలీకరించిన బీజెల్ అవకాశాలను అందిస్తుంది. అదే సమయంలో అత్యద్భుతమైన చిత్ర నాణ్యతను మా క్యుఎల్‌ఈడీ సాంకేతికతో అందిస్తున్నాం. ఈ నూతన సంచిక ఖచ్చితంగా వినియోగదారులకు ఆనందాన్ని అందించడంతో పాటుగా ఎలాంటి నివాస ప్రాంగణాన్ని అయినా ఆహ్లాదంగా మారుస్తుంది' అని సందీప్ సింగ్ అరోరా, సీనియర్ డైరెక్టర్, ఆన్లైన్ బిజినెస్, కన్స్యూమర్ ఎలకాట్రనిక్స్, శాంసంగ్ ఇండియా అన్నారు.
మీ సొంత శైలిని సృష్టించండి
మీ ఇంటి సౌందర్యంను అత్యున్నతంగా ద ఫ్రేమ్ 2021 మార్చడంతో పాటుగా బీజెల్ రంగును మరియు దాని శైలిని సైతం మీ ప్రాంగణాలకు అనుగుణంగా వినూత్నమైన రీతిలో మలుచుకునే అవకాశం అందిస్తుంది. ఈ ఫ్రేమ్ బీజెల్ను రెండు రంగుల అవకాశాలతో అనుకూలీకరించవచ్చు. తెలుపు మరియు టీక్ రంగులలో ఇవి వస్తాయి. ఇవి అభిరుచికి తగినట్లుగా కాంట్రాస్ట్ మరియు సౌందర్యం అందిస్తాయి. అంతేకాదు, గది ఉన్న ప్రాంతం అనుసరించి మీరు డిజైన్ చేసినా లేదంటే వినూత్నమైన రంగుల ధోరణికి అనుగుణంగా తీర్చిదిద్దినా ఇది కాంప్లిమెంట్ చేస్తుంది. ఈ ఫ్రేమ్ టీవీలు ఎత్తు మార్చుకోతగిన వీలున్న టీవీ స్టాండ్‌తో వస్తాయి. అయోమయంగా కనిపించకుండా సౌండ్‌బార్‌ను సైతం అమర్చుకునేందుకు ఇది తోడ్పడుతుంది.
మీలోని కళా ప్రేమికుని కోసం...
ద ఫ్రేమ్‌లో అత్యంత వినూత్నమైన మరియు అద్భుతమైన ఫీచర్లలో ఒకటి ఏమిటంటే, టీవీ లా మీరు వినియోగించకపోతే ఈ ఫ్రేమ్ ఆర్ట్ మోడ్‌లోకి మారిపోతుంది. ద ఫ్రేమ్ 2021 ఇప్పుడు అదనపు ఆర్ట్ వర్క్స్‌తో రావడంతో పాటుగా వ్యక్తిగత అభిరుచులకు సరిపోలుతుంది. మీ సొంత వ్యక్తిగత ఆర్ట్ కలెక్షన్‌ను మీరే తీర్చిదిద్దుకునేలా చేయడంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధ ఇనిస్టిట్యూట్లకు చెందిన 1400 పీసెస్ లైబ్రరీని సృష్టిస్తుంది. ఇది ఏఐ ఆధారిత ఆటో క్యూరేషన్ సాంకేతికతను జోడించుకుంది. ఇది మీ ఎంపిక ఆధారంగా ఆర్ట్ వర్క్ ఎంపికలను అందిస్తుంది. ఫ్రేమ్ 2021 ఇప్పుడు మెరుగైన ఫోటో స్టోరేజీ ప్రాంగణం అందిస్తుంది. ఇది గతంలోని 500 మెగాబైట్స్ నుంచి 6 గిగాబైట్స్కు జోడించారు. తద్వారా మీరు యుహెచ్డీ నాణ్యతలో 1200 ఫోటోలను నిల్వ చేయవచ్చు.