Authorization
Mon Jan 19, 2015 06:51 pm
* టాటా స్కై మ్యూజిక్, మ్యూజిక్‌ని కలపడంతో మ్యూజిక్ పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం
* ఇప్పుడు కొత్తగా పునరుద్ధరించబడిన సర్వీస్ ద్వారా టీవీ, మొబైల్ యాప్‌లో కేవలం రోజుకి రూ.2.5తో 360 డిగ్రీల సంగీతం
* చందా తీసుకోవడం ద్వారా నెలకు రూ.99 విలువైన హంగామా మ్యూజిక్ ప్రోని ఉచితం
* ఎలాంటి యాడ్స్ లేకుండా చందాదారులు 20 ఆడియో స్టేషన్లు, 5 వీడియో స్టేషన్లను
* అన్లిమిటెడ్ ఆఫ్‌లైన్ డౌన్లోడ్స్, అన్లిమిటెడ్ పుల్‌లెంగ్త్ మ్యూజిక్ వీడియోలు, హంగామా మ్యూజిక్ యాప్
* హెచ్డి క్వాలిటీ ఆడియోలు
ముంబయి: భారతదేశంలో అగ్రశ్రేణి కంపెనీలలో అన్నింటికంటే ప్రథమమైనది టాటా. టాటా అంటేనే
నమ్మకానికి ప్రతీక. అలాంటి టాటా నుంచి ప్రముఖ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌గా రెండు మ్యూజిక్ చానెల్స్ ఉన్నాయి. అవే టాటా స్కై మ్యూజిక్ మరియు టాటా స్కై మ్యూజిక్ం. ఇప్పుడు ఈ రెంటిని ఏకీకృతం చేసి టాటా స్కై మ్యూజిక్ పేరుతో సరికొత్తగా ఆవిష్కరించారు. టాటా స్కై మ్యూజిక్
లక్ష్యం ఒక్కటే. రేపటి కంటే ఇవాళ్టిని అద్భుతంగా తీర్చిదిద్దడం (to make tomorrow better than today) ఇప్పుడు ఈ టాటా స్కై మ్యూజిక్‌ని సరికొత్తగా పునరిద్ధరించడం ద్వారా సంగీత అభిమానులకు అద్బుతమైన వీనుల విందైన, వారికి నచ్చిన సంగీతాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించాలని లక్ష్యంగా
పెట్టుకుంది టాటా స్కై మ్యూజిక్. టాటా స్కై మ్యూజిక్ ద్వారా తన వినియోగదారులకు అద్భుతమైన కంటెంట్‌ను అందించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 20 ఆడియో స్టేషన్లు మరియు 5 వీడియో, స్టేషన్లతో... టాటా స్కై మ్యూజిక్‌లో మాస్, క్లాస్, భారతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ, భక్తి, గజల్, హిందూస్థానీ, కర్ణాటక సంగీతం వంటి అన్ని సంగీతాలను అందిస్తుంది. ఇప్పుడు
ఈ అవకాశం టీవీలో మాత్రమే కాదు. మొబైల్ యాప్‌లో లభిస్తుంది. ఈ సర్వీస్ మొత్తం కుటుంబానికి రోజుకు కేవలం రూ.2.5 మాత్రమే.
ఈ సందర్భంగా టాటా స్కై చీఫ్ కమర్షియల్ అండ్ కంటెంట్ ఆఫీసర్ పల్లవి పూరి మాట్లాడారు. ఆమె
మాట్లాడుతూ.. అదనపు ప్రయోజనాలతో వన్ స్టాప్ మ్యూజిక్ సర్వీస్‌ను అందించాలని మేం నిర్ణయించుకున్నాం. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా పూర్తి చేశాం. ప్రతీ ఒక్కరికి కావాల్సిన
సంగీతాన్ని అందిస్తూనే, బలమైన లైబ్రరీ వ్యవస్థను కూడా రూపొందించుకున్నాం. దీనిద్వారా మా వినియోగదారులకు అద్భుతమైన సంగీత అనుభవాన్ని అందించాలని అనుకుంటున్నాం. మా
భాగస్వామి హంగామా మ్యూజిక్ సహాయంతో... మా వినియోగదారుల సంఖ్య కూడా పెరగడానికి, సరికొత్త సంగీత ప్రియులను అన్వేషించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని
అన్నారు ఆమె.
టాటా స్కై మ్యూజిక్, టాటా స్కై మ్యూజిక్ంని ఏకీకృతం చేయడం ద్వారా ఒకే ప్లాట్ఫామ్లో ఆడియో
వీడియోలను అందించే అవకాశం ఏర్పడింది. ఇందుకోసం 360-డిగ్రీల ఫ్యామిలీ ప్లాన్‌ను అందిస్తోంది. ఇది టీవీ, టాటా స్కై మొబైల్ యాప్ రెండింటిలోనూ ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందించవచ్చు. అంతేకాకుండా యాక్టివ్ సబ్‌స్కైబర్స్ అదనపు ఖర్చు లేకుండా టాటా స్కై మొబైల్ యాప్ ద్వారా
నెలకు రూ.99 రూపాయల విలువైన హంగామా మ్యూజిక్ ప్రోను ఉచితంగా ఆస్వాదించవచ్చు.
టాటా స్కై మ్యూజిక్ మ్యూజిక్ సర్వీస్‌ను ఇప్పటికే ఉపయోగిస్తున్న యాక్టివ్ సబ్‌స్కైబర్స్. ఈ
ప్యాక్‌కి ఆటోమేటిగ్గా అప్‌గ్రేడ్ అవుతారు. కొత్త చందాదారులు ఈ మ్యూజిక్ సర్వీస్‌ను ఉపయోగించుకోవాలంటే 080 6858 0815 నెంబర్‌కు కు మిస్డ్ కాల్ ఇచ్చి 815లో
వచ్చే సర్వీస్‌ను ఆస్వాదించవచ్చు.