Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఈ నుంచి చౌక ధరలో కార్బెవాక్స్ డోసు
న్యూఢిల్లీ: ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ బయోలాజికల్-ఈ (బీఈ)ఉత్పత్తి చేస్తోన్న కార్బెవాక్స్ వ్యాక్సిన్ ఒక మోతాదు ధర రూ.150గా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బీఈ తయారీదారు కూడా కేంద్రం కోసం 30 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను రిజర్వ్ చేయనుంది. ఈ మొత్తం డోసుల కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. ఒక మోతాదుకు రూ. 150 చొప్పున మొత్తం రూ.1,500 కోట్లు అడ్వాన్స్ చెల్లించినట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన తర్వాత భారత మార్కెట్లో రాబోయే అత్యంత చౌకైన వ్యాక్సిన్ ఇదే కానుంది. . బీఈ కార్బెవాక్స్ మూడవ దశ ట్రయల్స్‌లో ఉంది. ఒక్కటి, రెండు దశల ట్రయల్స్ మంచి ఫలితాలు వచ్చాయి.
బీఈ కార్బెవాక్స్ రెండు డోసులను కలిపి రూ. 650లోపే అందిస్తామని ఇటీవల . బీఈ పేర్కొంది. తాజాగా ఈ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర రూ. 150కే అందుబాటులోకి రానున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం వాస్తవం అయితే ప్రభుత్వాలపై, ప్రజలపై భారీగా భారం తగ్గనుంది. ఈ టీకాకు జూలై-ఆగస్టు నాటికి ఆమోదం లభించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కొవిషీల్డ్ ఒక్కో డోసును ప్రభుత్వానికైతే రూ. 300కు, ప్రయివేటు సంస్థలకైతే రూ. 600కు విక్రయిస్తున్నారు. కొవాగ్జిన్ ఒక్కో డోసును ప్రభుత్వానికి రూ. 400కు, ప్రయివేటు సంస్థలకు రూ. 1200కు అందిస్తున్నారు. స్పుత్నిక్ టీకా ధర ఒక్కో డోసును రూ. 995కు విక్రయిస్తున్నారు. బయోలాజికల్-ఈ టీకా కనుక అందుబాటులోకి వస్తే కొవాగ్జిన్ తర్వాత అందుబాటులోకి వస్తున్న రెండో స్వదేశీ టీకా అదే అవుతుంది. అమెరికాకు చెందిన బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి బయోలాజికల్-ఈ సంస్థ కొవిడ్ టీకాను అభివద్ధి చేసింది. దేశంలో త్వరలోనే స్పుత్నిక్-వి, స్పుత్నిక్ లైట్‌తోపాటు జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకా, ముక్కు ద్వారా వేసే టీకాలు అందుబాటులోకి రానున్నాయి.