Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ భారత్ బయోటెక్‌కు అమెరికాలో తీవ్ర నిరాశ ఎదురైంది. సంస్థ అభివద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తిరస్కరించింది. ఈ టీకా వినియోగానికి సంబంధించిన భారత్ బయోటెక్ తన యుఎస్ భాగస్వామ్య కంపెనీ ఆక్యుజెన్‌తో కలిసి అక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదించగా నిరాకరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తాము గుర్తించట్లేదని ప్రకటించిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం అనేక దేశాలు భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను గుర్తించలేదు. భారత్‌లో కోవాగ్జిన్ వచ్చి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా.. ఇకపై అత్యవసర అనుమతి కోరబోమని, కోవిడ్ టీకా ఆమోదం కోసం ఎఫ్‌డీఏకు దాఖలు చేస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. కోవాగ్జిన్‌కు సంబంధించిన మాస్టర్ ఫైల్‌ను తమకు సమర్పించాలని ఎఫ్‌డీఏ సూచించిందని ఆక్యుజెన్ సీఈఓ శంకర్ ముసునూరి తెలిపారు.