Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.200 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి : ఎండి భాస్కర రావు బొల్లినేని వెల్లడి
హైదరాబాద్:ప్రముఖ ప్రయివేటు వైద్య సేవల సంస్థ కష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ (కిమ్స్) జూన్ 16న ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఓపెన్ బిడ్/ఆఫర్ జూన్ 18న ముగియనుందని వెల్లడించింది. ఈ ఆఫర్ ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.815 నుంచి రూ.825 వరకు నిర్ణయించింది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 2.35 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులు విక్రయించనున్నారు. కనీసం 18 షేర్లు లేదా ఆపైనా 18 గుణిజాలతో షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.200 కోట్ల నిధులు సమీకరించాలని నిర్దేశించుకున్నామని కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర రావు బొల్లినేని తెలిపారు. శుక్రవారం ఆయన వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కిమ్స్ ప్రస్తుతం 3,064 పడకల సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు విస్తరించడం ద్వారా 5వేల పడకలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ అతిపెద్ద ప్రయివేటు ఆస్పత్రిగా ఉన్నది.